Header Ads

గుండెల్ని మండిస్తున్న గాత్రం - మ‌న‌సు దోచేస్తున్న కైలాష్‌ఖేర్

రెహ‌మాన్ పుణ్య‌మా అంటూ కొత్త గాయ‌నీ గాయ‌కులు వెలుగులోకి వ‌చ్చారు. బాలీవుడ్ ప‌రంగా చూస్తే కొత్త వారు ఎవ‌రు వ‌చ్చినా స్వీక‌రించేందుకు సిద్దంగా ఉంటుంది. సూఫీ, ఫోక్ క‌ల‌గ‌లిస్తే కైలాష్ ఖేర్ గుర్తుకు వ‌స్తాడు. తెలంగాణ‌లో గోరేటి వెంక‌న్న గొంతుకు జీర ఎలా వుంటుందో..కైలాష్‌కు కూడా హై పీచ్‌లో అద్భుతంగా పాడ‌గ‌ల నేర్పుంది. అందుకే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌కు చెందిన ఈ మట్టిత‌నం క‌ల‌బోసుకున్న గాయ‌కుడిని జ‌నం ఆద‌రించారు. దేశ వ్యాప్తంగా ప్రేమించారు. ఆయ‌న ఆర్ద్ర‌త‌తో..ఆవేద‌న‌తో..ఆవేశంతో పాడుతూ వుంటే అందులో లీన‌మై పోయారు. ఇపుడు మోస్ట్ వాంటెడ్ సింగ‌ర్స్‌ల‌లో కైలాష్ ఖేర్ ఒక‌రు. పాప్‌, రాక్‌, ఫోక్ ..ఇలా ప్ర‌తి ఫార్మాట్‌లో పాడే నైపుణ్యం సంపాదించాడు . పాప్ సింగ‌ర్ గా ఇప్ప‌టికే మ‌న‌సు దోచుకున్నాడు. జాన‌ప‌ద బాణీల‌ను..సూఫీ త‌త్వాన్ని క‌లిపి పాడే ద‌మ్మున్న గాయ‌కుడిగా ఎదిగాడు కైలాష్ .
పాట‌గాడే కాదు ర‌చ‌యిత‌, మ్యూజిక్ కంపోజ‌ర్ కూడా. రాక్ బేస్డ్ సింగ‌ర్‌గా మొద‌ట్లో స్టార్ట్ చేశాడు. జాన‌ప‌ద బాణిల‌ను..సూఫీ గీతాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ అల‌వోక‌గా ఆలాపించ‌డం ఈయ‌న‌కే చెల్లింది. కైలాష్ ఆవేశం ఆయ‌న గొంతుకు ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తీసుకు వ‌చ్చింది. దానినే ఆయ‌న కంటిన్యూ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రామినెంట్ సింగ‌ర్‌గా మ‌రింత పాపుల‌ర్ అయ్యారు. హిందీ, గుజ‌రాతి, నేపాలి, త‌మిళ్‌, తెలుగు, మ‌ళ‌యాలం, క‌న్న‌డ‌, బెంగాళీ, ఓడియా, ఉర్దూ భాష‌ల్లో వేలాది పాట‌లు పాడారు కైలాష్ ఖేర్‌. 700 పాట‌లు ఆద‌ర‌ణ పొందాయి. సూఫీ సింగ‌ర్‌గా తెచ్చుకున్నారు. ప‌లు దేశాల్లో ప‌ర్య‌టించాడు. పాకిస్తాన్‌లో మ‌నోడికి ఫ్యాన్స్ ఎక్కువ‌.

పండిట్ కుమార్ గాంధ‌ర్వ‌, పండిట్ హృద‌య‌నాథ్ మంగేష్క‌ర్‌, పండిట్ భీంసేన్ జోషి, పాక్ సింగ‌ర్ న‌స్ర‌త్ ఫ‌తేహలీఖాన్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. త‌న గానంతో ల‌క్ష‌లాది అభిమానుల‌ను సంపాదించుకున్న ఈ గాయ‌కుడు ..ఏది మాట్లాడినా..అది పాటే అవుతుంది. అద్భుత‌మై మ‌న‌ల్ని వెంటాడుతుంది..అదీ ఆయ‌న గొంతుకున్న ప్ర‌త్యేక‌త‌. భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ‌శ్రీ‌తో స‌త్క‌రించింది. 2006లో ఫ‌న్నా మూవీకి ఫిల్మ్ ఫేర్ అవార్డు ద‌క్కించుకున్నాడు. తెలుగులో మిర్చి సినిమాకు అవార్డు పొందారు. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను ఏర్పాటు చేసుకున్నారు కైలాష్ ఖేర్‌.

ఇంత‌గా పేరు పొందిన ఈ గాయ‌కుడు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. కోకో కోలా, సిటీబ్యాంక్‌, ఐపీఎల్ , హోండా మోటార్ సైకిల్ ..త‌దిత‌ర కంపెనీల‌కు జింగిల్స్ సైతం పాడారు కైలాష్‌. మ్యూజిక్ డైరెక్ట‌ర్ రెహ‌మ‌న్‌, ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత మెహ‌బూబ్ ల‌కు ఇష్ట‌మైన సింగ‌ర్‌గా ఖేర్ మారి పోయాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యో పిక్‌లో కైలాష్ పాడిన పాట దుమ్ము రేపుతోంది. మ‌రిన్ని పాట‌ల‌తో అల‌రించాల‌ని కోరుకుందాం.

No comments