Header Ads

తెలంగాణ‌లో నువ్వా నేనా - కుప్ప‌లు తెప్ప‌లుగా నోట్ల క‌ట్ట‌లు

29వ రాష్ట్రంలో జ‌రుగుత‌న్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొని ఉన్న‌ది. అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ..మ‌హాకూట‌మి, బీజేపీ, ఎంఐఎం, సీపీఎం, బీఎస్‌పీ, ఇంటి పార్టీ, ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నా ప్ర‌ధానంగా రెండు పార్టీల మ‌ధ్య‌నే వార్ ఉండ‌నుంది. ఉద‌యం ఏడు నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఓటు హ‌క్కు వినియోగించు కోనున్నారు. ఎలాగైనా గెలవాల‌న్న ఉద్ధేశంతో ఉన్న అన్ని పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థులు అంచ‌నాల‌కు మించి కోట్ల‌ల్లో ఖ‌ర్చు చేస్తున్నారు. ఒక‌రిపై మ‌రొక‌రు దాడులు చేసుకుంటూ..ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇండియాలోనే ఎన్న‌డూ లేనంత‌గా ఈసారి దేశం మొత్తం కొత్త‌గా ఏర్పాటైన తెలంగాణ‌పైనే దృష్టి కేంద్రీక‌రించింది.
ఎవ‌రు గెలుస్తార‌న్న దానిపై కోట్ల‌ల్లో బెట్టింగ్‌లు న‌డుస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. ఎన్నిక‌ల క‌మిష‌న్ మాత్రం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో 1821 మంది బ‌రిలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పోటీ ప్ర‌ధాన పార్టీల మ‌ధ్యే ఉంది. నిర్మ‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, మ‌హేశ్వ‌ర్‌రెడ్డిల మ‌ధ్యే పోటీ నెల‌కొన్న‌ది. ఆదిలాబాద్‌లో ఆప‌ద్ధ‌ర్మ మంత్రి జోగు రామ‌న్న‌, గండ్ర సుజాత‌ల మ‌ధ్య పోటీ ర‌సవ‌త్త‌రంగా మారింది. ముథోల్‌లో త్రిముఖ పోటీ ఉండ‌గా విఠ‌ల్ రెడ్డి, రామారావు ప‌టేల్‌, ర‌మాదేవిలు బ‌రిలో ఉన్నారు. ఖానాపూర్‌లో రేఖానాయ‌క్‌, ర‌మేష్ రాథోడ్ లు, సిర్పూర్‌లో కోన‌ప్ప‌, హ‌రీష్‌బాబుల మ‌ధ్యే పోటీ నెల‌కొంది. బోధ్‌లో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ సాగ‌నుంది. రాథోడ్ బాబురావు, సోయం బాపురావులు పోటీ చేస్తున్నారు. ఆసిఫాబాద్‌లో ఆత్రం స‌క్కు, కోవా ల‌క్ష్మితో సై అంటున్నారు. బెల్లంప‌ల్లిలో పోటీ ఉత్కంఠ‌ను రేపుతోంది. గుండా మ‌ల్లేష్‌, జి. వినోద్ పోటీలో ఉన్నారు. మంచిర్యాల‌లో టీఆర్ఎస్ ..మ‌హా కూట‌మి అభ్య‌ర్థుల మ‌ధ్యే పోటీ నెల‌కొంది. చెన్నూరులో ద్విముఖ పోటీ జ‌రుగుతోంది.

పోరుగ‌ల్లులో పోటా పోటీ - ఉద్య‌మాలకు పెట్టింది పేరైన వ‌రంగ‌ల్ జిల్లాలో పోటీ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక్క‌డ హేమాహేమీలు బ‌రిలో ఉన్నారు. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో దాస్యం విన‌య్ బాస్క‌ర్‌, రేవూరి ప్ర‌కాశ్ రెడ్డిల మ‌ధ్యే పోటీ ఉంది. వ‌ర్ద‌న్న‌పేట‌లో ఆరూరి ర‌మేష్‌, ఎన్ఆర్ ఐ ప‌గిడిపాటి దేవ‌య్యల మ‌ధ్యే పోటీ ఉన్న‌ది. ప‌ర‌కాల‌లో కొండా సురేఖ‌, చ‌ల్లా ధ‌ర్మారెడ్డిల మ‌ధ్య ద్విముఖ పోటీ జ‌ర‌గ‌నుంది. న‌ర్సంపేటలో పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, దొంతి మాధ‌వ‌రెడ్డి బ‌రిలో ఉన్నారు. స్టేష‌న్ ఘ‌న్ పూర్లో టి. రాజ‌య్య‌, సింగాపురం ఇందిర‌లు పోటీ చేస్తున్నారు. భూపాల‌ప‌ల్లిలో స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి, గండ్ర వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి, చందుప‌ట్ల కీర్తి రెడ్డిల మ‌ధ్యే ఉన్న‌ది. వ‌రంగ‌ల్ తూర్పులో న‌న్న‌పునేని న‌రేంద‌ర్ , వ‌ద్ది రాజు ర‌విచంద్ర‌ల మ‌ధ్య పోటీ నెల‌కొంది. ములుగులో సీత‌క్క‌, ఆజ్మీరా చందూలాల్ పోటీ చేస్తున్నారు. జ‌న‌గామ‌లో పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డిల మ‌ధ్యే పోటీ ఉంది. మ‌హ‌బూబాబాద్‌లో బానోతు శంక‌ర్ నాయ‌క్‌, పొరిక బ‌ల‌రాం నాయ‌క్‌లు బ‌రిలో నిలిచారు. డోర్న‌క‌ల్‌లో మాజీ మంత్రి రెడ్యా నాయ‌క్‌, రాంచంద్రు నాయ‌క్ ల మ‌ధ్యే పోటీ ఉంది. పాల‌కుర్తిలో ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, జంగా రాఘ‌వ‌రెడ్డిలు సై అంటున్నారు.

కాకా రేపుతున్న క‌రీంన‌గ‌ర్ జిల్లా - ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య పోరు జ‌రుగుతోంది. న‌ల్ల బంగారపు సిరుల‌కు ఈ ప్రాంతం పేరొందింది. ఇక్క‌డ పోటీ కాకా రేపుతోంది. మాన‌కొండూరులో ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌, ఆరేప‌ల్లి మోహ‌న్ ల మ‌ధ్యే పోటీ నెల‌కొంది. క‌రీంన‌గ‌ర్‌లో త్రిముఖ పోటీ ఉంది. గంగుల క‌మ‌లాక‌ర్‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌, సంజ‌య్ ల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోటీ జ‌ర‌గ‌నుంది. హుజూరాబాద్‌లో ఈటెల రాజేంద‌ర్‌, పాడి కౌశిక్ రెడ్డిల మ‌ధ్యే ఉంది. చొప్ప‌దండిలో బొడిగె శోభ‌, ర‌విశంక‌ర్‌, మేడిప‌ల్లి స‌త్యంల మ‌ధ్య త్రిముఖ పోరు సాగుతోంది. జ‌గిత్యాల‌లో జీవ‌న్ రెడ్డి, డాక్ట‌ర్ సంజ‌య్ లు సై అంటున్నారు. దీనిని ఎంపీ క‌విత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. కోరుట్ల‌లో క‌ల్వ‌కుంట్ల విద్యా సాగ‌ర్ రావు, జువ్వాది న‌ర‌సింగ‌రావు సై అంటున్నారు. పెద్ద‌ప‌ల్లిలో దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డి, విజ‌య‌రామారావుల మ‌ధ్యే ఉన్న‌ది. ధ‌ర్మ‌పురిలో అడ్లూరి లక్ష్మ‌ణ్‌, కొప్పుల ఈశ్వ‌ర్‌లు మ‌రోసారి త‌ల‌ప‌డుతున్నారు. మంథ‌నిలో పుట్ట మ‌ధు, దుద్ధిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబుల మ‌ధ్యే పోటీ నెల‌కొంది. రామగుండ‌లో ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌రుగుతోంది. సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ‌, మ‌క్కాన్ సింగ్‌ల మ‌ధ్య పోటీ జ‌రుగుతోంది. సిరిసిల్ల‌లో కేటీఆర్‌, కేకే మ‌హేంద‌ర్ రెడ్డిల మ‌ధ్య పోటీ నెల‌కొంది. వేముల‌వాడ‌లో చెన్న‌మ‌నేని ర‌మేష్ బాబు, ఆది శ్రీ‌నివాస్‌ల మ‌ధ్యే ఉన్న‌ది. హుస్నాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట్ రెడ్డి స‌తీష్‌బాబుల మ‌ధ్యే పోటీ జ‌రుగుతోంది.

అంద‌రి చూపు హైద‌రాబాద్ వైపు - తెలంగాణ కేపిట‌ల్ సిటీ. ఐటీ హ‌బ్‌గా పేరున్న హైద‌రాబాద్‌లో ఈసారి ఎన్నిక‌లు మ‌రింత టెన్ష‌న్‌కు గురిచేస్తున్నాయి. సికింద్రాబాద్‌లో ప‌ద్మారావు గౌడ్‌, కాసాని జ్ఞానేశ్వ‌ర్‌లు పోటీ చేస్తుండ‌గా, ఖైర‌తాబాద్‌లో త్రిముఖ పోటీ నెల‌కొంది. చింతల రామ‌చంద్రారెడ్డి, దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ఆచారి, దానం నాగేంద‌ర్ ల మ‌ధ్య పోరు జ‌రుగుతోంది. ముషీరాబాద్‌లో ల‌క్ష్మ‌ణ్‌, ముఠా గోపాల్‌లు బ‌రిలో ఉన్నారు. అనిల్ కుమార్ యాద‌వ్ పోటీ చేస్తున్నారు. జూబ్లిహిల్స్‌లో మాగంటి గోపీనాథ్‌, విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి ల మ‌ధ్యే పోటీ నెల‌కొంది. స‌న‌త్ న‌గ‌ర్‌లో త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, కూన వెంక‌టేశ్ గౌడ్‌ల మ‌ధ్య ద్విముఖ పోటీ నెల‌కొంది. నాంప‌ల్లిలో ఫిరోజ్‌ఖాన్‌, జాఫ‌ర్ హుస్సేన్‌ల మ‌ధ్య పోరు జ‌రుగుతోంది. గోషా మ‌హ‌ల్‌లో రాజాసింగ్‌, ముఖేష్ గౌడ్‌, ప్రేమ్ సింగ్ రాథోడ్‌ల మ‌ధ్య త్రిముఖ పోటీ నెల‌కొంది. అంబ‌ర్‌పేట‌లో కిష‌న్ రెడ్డి, వెంక‌ట్‌ష్‌ల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతోంది. కంటోన్నెంట్‌లో సాయ‌న్న‌, స‌త్య‌నారాయ‌ణ‌, చార్మినార్‌లో ముంతాజ్ అహ్మ‌ద్ ఖాన్‌, స‌లావుద్దీన్‌ల మ‌ధ్యే పోటీ ఉంది. కార్వాన్‌లో కౌస‌ర్ మోహియోద్దీన్‌, జీవ‌న్ సింగ్‌, హ‌జీ, అమ‌ర్ సింగ్‌లు పోటీ ప‌డుతున్నారు. మ‌ల‌క్ పేట‌లో అహ్మ‌ద్ బ‌లాలా, జితేంద్ర బ‌రిలో ఉన్నారు. చాంద్రాయ‌ణ‌గుట్ట‌లో అక్బ‌రుద్దీన్ ఓవైసీ, స‌య్య‌ద్ షెహ‌జాదీల మ‌ధ్య ద్విముఖ పోటీ నెల‌కొంది. యాకుత్ పూరాలో పాషా ఖాద్రీ, సామ సుంద‌ర్ రెడ్డి, రాజు, రూపారాజ్‌లు బ‌రిలో ఉన్నారు. బ‌హ‌దూర్ పూరాలో బ‌క్రీ, కాలేం బాబా, ఆలీల మ‌ధ్య పోటీ నెల‌కొంది.

ఆస‌క్తి రేపుతున్న నిజామాబాద్ - వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్న నిజామాబాద్ లో పోటీ పోరును త‌ల‌పింప చేస్తోంది. ఆర్మూర్లో ఆకుల ల‌లిత‌, జీవ‌న్ రెడ్డి, విన‌య్ కుమార్ రెడ్డిల మ‌ధ్య త్రిముఖ పోటీ నెల‌కొంది. బోధ‌న్‌లో ష‌కీల్ అమీర్‌, సుద‌ర్శ‌న్ రెడ్డి, బాల్కొండ‌లో ప్ర‌శాంత్ రెడ్డి, అనిల్ ఈర‌ప‌త్రి, రాజేశ్వ‌ర్‌, సునీల్ కుమార‌ల మ‌ధ్య చ‌తుర్ముఖ పోరు న‌డుస్తోంది. నిజామాబాద్ రూర‌ల్ లో బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్‌, భూప‌తి రెడ్డి మ‌ధ్య పోటీ నెల‌కొంది. నిజామాబాద్ అర్బ‌న్‌లో బిగాల గ‌ణేస్ గుప్తా, తాహెర్ బిన్‌, యెండం ల‌క్ష్మినారాయ‌ణ‌లు బ‌రిలో ఉన్నారు. ఎల్లారెడ్డిలో ఏనుగు ర‌వీంద‌ర్‌, సురేంద‌ర్‌, లక్ష్మారెడ్డిల మ‌ధ్యే నెల‌కొంది. బాన్సువాడ‌లో పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి, బాల‌రాజు, ప్ర‌కాశ్ ఉన్నారు. కామారెడ్డిలో గంప గోవ‌ర్ద‌న్‌, ష‌బ్బీర్ అలీ, ర‌మ‌ణారెడ్డిల మ‌ధ్య త్రిముఖ పోటీ జ‌రుగుతోంది. జుక్క‌ల్‌లో షిండే, గంగారాం సై అంటున్నారు.

న‌ల్ల‌గొండ‌లో నిలిచేదెవ్వ‌రు..? - ఉద్య‌మాల పురిటి గ‌డ్డ న‌ల్ల‌గొండ ఖిల్లా. న‌ల్లగొండ‌లో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, కంచ‌ర్ల భూపాల్ రెడ్డిల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. కోదాడ‌లో ప‌ద్మావ‌తి, మ‌ల్ల‌య్య యాద‌వ్‌, సూర్యాపేట‌లో జ‌గ‌దీశ్ రెడ్డి, వెంక‌టేశ్వ‌ర్ రావు, రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి బ‌రిలో నిలిచారు. మిర్యాల‌గూడ‌లో బాస్క‌ర్‌రావు, ఆర్‌.కృష్ణ‌య్య‌లు పోటీ ప‌డుతున్నారు. హుజూర్ న‌గ‌ర్‌లో ఉత్తం కుమార్ రెడ్డి, సైదిరెడ్డి తో సై అంటున్నారు. దేవ‌ర‌కొండ‌లో ర‌వీంద్ర కుమార్‌, బాబూనాయ‌క్‌లు బ‌రిలో నిలిచారు. నాగార్జున‌సాగ‌ర్‌లో జానారెడ్డి, నోముల న‌ర‌సింహ‌య్య‌, న‌కిరేక‌ల్ లో వీరేశం, లింగ‌య్య‌ల మ‌ధ్యే పోటీ నెల‌కొంది. భువ‌న‌గ‌రిలో పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డిల మ‌ధ్యే పోటీ ఉంది. మునుగోడులో ప్ర‌భాక‌ర్ రెడ్డి, రాజ‌గోపాల్ రెడ్డిలు బ‌రిలో ఉన్నారు. తుంగ‌తుర్తిలో గ్యాద‌రి కిషోర్ కుమార్‌, అద్దంకి ద‌యాక‌ర్ ల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు సాగుతోంది. ఆలేరులో గొంగ‌డి సునీత‌, భిక్ష‌మ‌య్య గౌడ్‌లు బ‌రిలో ఉన్నారు.

రంగారెడ్డి ర‌స‌వ‌త్త‌రం - తాండూరులో ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, పైల‌ట్ రోహిత్ రెడ్డిల మ‌ధ్య పోటీ నెల‌కొంది. చేవెళ్ల‌లో కేఎస్ ర‌త్నం, కాలె యాద‌య్య‌, మ‌హేశ్వ‌రంలో స‌బితా ఇంద్రా రెడ్డి, తీగ‌ల కృష్ణా రెడ్డిల మ‌ధ్య పోరు సాగుతోంది. వికారాబాద్‌లో ఆనంద్‌, గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌లు, కుత్బుల్లాపూర్‌లో జేపీ వివేకానంద‌, కూన శ్రీ‌శైలం గౌడ్‌ల మ‌ధ్య పోటీ నెల‌కొంది. ఎల్‌బీ న‌గ‌ర్‌లో సుధీర్ రెడ్డి, రామ్మోహ‌న్ గౌడ్‌, ఇబ్ర‌హీంప‌ట్నంలో కిష‌న్ రెడ్డి, సామ రంగారెడ్డి, మ‌ల్ రెడ్డి రంగారెడ్డిల మ‌ధ్య త్రిముఖ పోరు జ‌రుగ‌నుంది. మేడ్చెల్‌లో ఎంపీ మ‌ల్లారెడ్డి, కె. ల‌క్ష్మారెడ్డిల మ‌ధ్య పోటీ నెల‌కొంది. కూక‌ట్‌ప‌ల్లిలో సుహాసిని, కృష్ణారావు ఉన్నారు. మ‌ల్కాజ్ గిరిలో హ‌నుమంత‌రావు, రామ‌చంద్ర‌రావు, క‌పిల‌వాయి దిలీప్ కుమార్‌ల మ‌ధ్యే త్రిముఖ పోటీ జ‌రుగుతోంది. ఉప్ప‌ల్‌లో వీరేంద‌ర్‌గౌడ్‌, ప్ర‌భాక‌ర్‌, సుభాష్ రెడ్డిలు ఉన్నారు. రాజేంద్ర‌న‌గ‌ర్‌లో గ‌ణేశ్ గుప్తా, బ‌ద్దంబాల్ రెడ్డి, ర‌హ‌మ‌త్ బేగ్‌ల మ‌ధ్య త్రిముఖ పోటీ నెల‌కొంది. శేర్ లింగం ప‌ల్లిలో గాంధీ, ఆనంద్ ప్ర‌సాద్‌లు బ‌రిలో ఉన్నారు.

రాముని సాక్షిగా నిలిచేదెవ్వ‌రో - ఖ‌మ్మం జిల్లాలో ఈసారి గెలుపు ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి. పాలేరులో తుమ్మ‌ల‌, ఉపేంద‌ర్‌రెడ్డి మ‌ధ్య పోటీ ఉండ‌గా, ఖ‌మ్మంలో అజ‌య్‌, నామా నాగేశ్వ‌ర్‌రావు, స‌త్తుప‌ల్లిలో సండ్ర వెంక‌ట వీర‌య్య‌, పిడ‌మ‌ర్తి ర‌వి సై అంటున్నారు. మ‌ధిర‌లో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, క‌మ‌ల్ రాజ్‌మ‌ధ్య పోటీ నెల‌కొంది. కొత్త‌గూడెంలో జ‌ల‌గం వెంక‌ట్రావు, వ‌న‌మా వెంకటేశ్వ‌ర్‌రావులు బ‌రిలో ఉండ‌గా, ఇల్లెందులో క‌న‌క‌య్య‌, హ‌రిప్రియ పోటీ నెల‌కొంది. అశ్వారావుపేట‌లో తాటి వెంక‌టేశ్వ‌ర్లు, మెచ్చా నాగేశ్వ‌ర్‌రావుల మ‌ధ్య పోటీ జ‌రుగుతోంది. భ‌ద్రాచ‌లంలో వీర‌య్య‌, వెంక‌ట్రావు, బాబురావు ఉన్నారు. పిన‌పాక‌లో పాయం వెంక‌టేశ్వ‌ర్లు, కాంతారావుతో త‌ల‌ప‌డుతున్నారు. వైరాలో మ‌ద‌న్‌లాల్, బానోతు విజ‌య‌, రేష్మాబాయిల మ‌ధ్య త్రిముఖ పోటీ ఉంది.

అంద‌రి దృష్టి మెద‌క‌ప్‌పైనే - మెద‌క్ జిల్లాలో ఎవ‌రు గెలుస్తారో అన్న‌ది ఉత్కంఠ రేపుతోంది. సంగారెడ్డిలో జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, రాజేశ్వ‌ర్‌రావు బ‌రిలో ఉండ‌గా, ప‌టాన్ చెరులో మ‌హిపాల్ రెడ్డి, శ్రీ‌నివాస్ గౌడ్‌లు, నారాయ‌ణ్ ఖేడ్‌లో బూపాల్‌రెడ్డి, సంజీవ‌రెడ్డి, సురేష్ షెట్క‌ర్‌ల మ‌ధ్య పోటీ ఉంది. ఆందోల్‌లో క్రాంతి కిర‌ణ్‌, దామోద‌ర్ రాజ‌న‌ర‌సింహ‌లు బ‌రిలో ఉన్నారు. న‌ర్సాపూర్లో మ‌ద‌న్ రెడ్డి, సునీతా ల‌క్ష్మారెడ్డి, గ‌జ్వేల్‌లో సీఎం కేసీఆర్‌, వంటేరు ప్ర‌తాప్‌రెడ్డిల మ‌ధ్యే పోటీ నెల‌కొంది. మెద‌క్‌లో ప‌ద్మా దేవంద‌ర్ రెడ్డి, ఉపేంద‌ర్ రెడ్డి, మర్రి శ‌శిధ‌ర్ రెడ్డిలు పోటీ లో ఉన్నారు. దుబ్బాక‌లో రామ‌లింగారెడ్డి, ర‌ఘునంద‌న్ రావు,రాజ్ కుమార్‌, నాగేశ్వ‌ర్ రెడ్డిలు పోటీలో ఉన్నారు. సిద్దిపేట‌లో హ‌రీష్‌రావు, భ‌వానీ రెడ్డి, న‌రోత్తంరెడ్డిలు బ‌రిలో ఉన్నారు. జ‌హీరాబాద్‌లో గీతారెడ్డి, మానిక్ రావుతో త‌ల‌ప‌డుతున్నారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో మ‌హ‌రాజులు ఎవ్వ‌రో - ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఈసారి ఎన్నిక‌లు మ‌రింత టెన్ష‌న్‌కు గురి చేస్తున్నాయి. గ‌ద్వాల‌లో అత్తా అల్లుడి మ‌ధ్య పోరు సాగుతోంది. డీకే అరుణ‌, కృష్ణ మోహ‌న్‌రెడ్డి బ‌రిలో ఉన్నారు. ఆలంపూర్‌లో సంప‌త్, ఇబ్ర‌హీంలు పోటీ చేస్తుండ‌గా, దేవ‌ర‌క‌ద్ర‌లో డోకూరు ప‌వ‌న్ కుమార్ రెడ్డి, ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, వ‌న‌ప‌ర్తిలో చిన్నారెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, నాగ‌ర్ క‌ర్నూలులో నాగం జ‌నార్ద‌న్ రెడ్డి, మ‌ర్రి జ‌నార్ద‌న్ రెడ్డి, దిలీపాచారిల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు సాగుతోంది. జ‌డ్చ‌ర్ల‌లో ల‌క్ష్మారెడ్డి, మ‌ల్లు ర‌విల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో సాగుతోంది. క‌ల్వ‌కుర్తిలో వంశీచంద‌ర్ రెడ్డి, ఆచారి, జైపాల్ యాద‌వ్‌ల మ‌ధ్య త్రిముఖ పోటీ నెల‌కొంది. అచ్చంపేట‌లో గువ్వ‌ల బాల‌రాజు , చిక్కుడు వంశీ కృష్ణ బ‌రిలో ఉండ‌గా, కొల్లాపూర్లో జూప‌ల్లి కృష్ణారావు, సుధాక‌ర్‌రావు, హ‌ర్ష వ‌ర్ద‌న్ రెడ్డిల మ‌ధ్య త్రిముఖ పోరు సాగుతోంది. కొడంగ‌ల్‌లో రేవంత్ రెడ్డి, న‌రేందర్ రెడ్డిల మ‌ధ్య వార్ న‌డుస్తోంది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో చ‌తుర్ముఖ పోటీ నెల‌కొంది. ఎర్ర‌శేఖ‌ర్‌, శ్రీ‌నివాస్ గౌడ్‌, ఇబ్ర‌హీం,సుద‌ర్శ‌న్ రెడ్డిలు ఇక్క‌డ బ‌రిలో ఉన్నారు. నారాయ‌ణ‌పేట‌లో రాజేంద‌ర్ రెడ్డి, స‌రాఫ్ కృష్ణ‌, శివకుమార్ రెడ్డల మ‌ధ్య పోటీ నెల‌కొంది. మ‌క్త‌ల్‌లో చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి, కూట‌మి త‌ర‌పున ద‌యాక‌ర్ రెడ్డి, బీజేపీ నుండి కొండ‌య్య‌లు బ‌రిలో ఉన్నారు.షాద్ న‌గ‌ర్‌లో అంజ‌య్య యాద‌వ్‌, ప్ర‌తాప్ రెడ్డి, శ్రీ‌వ‌ర్ద‌న్ రెడ్డి, వీర్ల‌పల్లి శంక‌ర్ లు పోటీ చేస్తున్నారు.

మొత్తం మీద ఎన్నో ఆశ‌ల‌తో బ‌రిలోకి దిగిన అభ్య‌ర్థుల భ‌విష్య‌త్ 11న తేల్చేందుకు ఓట‌ర్లు రెడీ అయ్యారు. ఎవ‌రు గ‌ద్దె నెక్క బోతున్నార‌నేది ఇంకొన్ని గంట‌లు వేచి చూడాల్సిందే.

No comments