అనుబంధం జీ తెలుగు కుటుంబం - లాభాల బాట పట్టిస్తున్న అనురాధ
ఆసియా ఖండంలో అత్యధిక ఛానల్స్ కలిగిన జీ గ్రూప్ ఎంటర్ టైన్ మెంట్ తెలుగు వినోదరంగంలో దూసుకెళుతోంది. తెలుగు వారి లోగిళ్లలో భాగమై సక్సెస్ బాటలో పయనిస్తోంది. మార్కెట్లో తనకు ఎదురే లేకుండా చేసుకుంటూ ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉంటోంది. దీని వెనుక జీ గ్రూపు సంస్థల ఛైర్మన్ సుభాష్ చంద్ర కృషి వుంది. సీరియల్స్, ఎంటర్ టైన్ మెంట్ , ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేలా పిల్లలు, పెద్దలు, మహిళలు, అన్ని వర్గాల వారికి ఆహ్లాదం కలిగించేలా జీ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు రూపొందిస్తోంది. సౌత్ ఇండియా జీ గ్రూపు ఛానల్స్‌కు బిజినెస్ హెడ్‌గా అనురాధ ఉన్నారు. సెంట్రల్ యూనివర్శిటీలో కమ్యూనికేషన్స్‌లో పట్టా పుచ్చుకున్న ఆమె క్రియేటివిటీకి పెద్దపీట వేస్తారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తయారు చేసి మార్కెటింగ్ పరంగా సక్సెస్ బాట పట్టించేలా చేయడంలో ఆమె ముందు వరుసలో నిలుస్తున్నారు.
స్టార్, మా, జెమిని, ఇతర ఛానళ్లు ఎన్నో తెలుగు వినోద రంగంలో కొలువు తీరాయి. వాటన్నింటిని తట్టుకుని జీ తెలుగు ఛానల్ నిలబడింది. కొన్నేళ్లుగా తన రేటింగ్‌ను పదిలంగా కాపాడుకుంటూ వస్తోంది. జీ వసుధైక కుటుంబంగా పేరు తెచ్చుకుంది. సిబ్బందికి పూర్తి స్వేచ్ఛనిస్తూ పనిలో నాణ్యతను పాటిస్తూ ప్రోగ్రాంలను అన్ని వర్గాలకు నచ్చేలా రూపొందించడంలో జీ తెలుగుకి సాటి లేరనే చెప్పాలి. మహిళలను , పిల్లలను టార్గెట్ చేస్తూ కార్యక్రమాలను టెలికాస్ట్ చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందుతోంది. దీని వెనుకాల అనురాధ ఎనలేని కృషి ఉంది.
ఇటీవల ముద్ద మందారం సీరియల్ ఆల్ టైం రికార్డును బ్రేక్ చేసింది. నూతన అధ్యాయానికి తెర లేపింది. 1200ల ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా టెలికాస్ట్ అవుతోంది. ఎక్సెల్ గ్రూపు ఆధ్యర్యంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజేస్ ద్వారా జీ తెలుగు ఛానల్ తెలుగు వారి మనసు దోచుకుంటోంది. 2004లో జీ గ్రూపు బెంగాలి, గుజరాతీ, మరాఠీ, పంజాబీ భాషల్లో ఛానల్స్ ప్రారంభించింది. అదే సమయంలో ఆగష్టు 2007లో ఆల్ఫా టీవీ పేరుతో ఏపీలో స్టార్ట్ చేసింది. హిందీ సినిమాలను తెలుగులోకి డబ్ చేస్తూ టెలికాస్ట్ చేసింది. డిసెంబర్ 2005లో పాపులర్ ప్రోగ్రాంలకు శ్రీకారం చుట్టింది. గోల్డ్ రష్ పేరుతో ఉదయభాను యాంకర్‌గా టెలికాస్ట్ చేసిన ఈ కార్యక్రమం కొద్ది కాలంలోనే పాపులర్ అయ్యింది. నిశ్శబ్ధం ప్రోగ్రామ్స్ 1.24 రేటింగ్ వారంలో..వారాంతంలో 1.86 రేటింగ్‌తో సరిపెట్టుకుంది. మాస్కు దగ్గరగా, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా కార్యక్రమాలను రూపొందించాలని జీ యాజమాన్యం నిర్ణయించింది. 2006లో ఫేమస్ గాయని సునీత ప్రయోక్తగా చేపట్టిన సరిగమప కార్యక్రమం రికార్డులను తిరగ రాసింది.
జీ తెలుగు ఛానల్‌కు ఎనలేని పేరు తీసుకు వచ్చింది. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడం దీని ఉద్ధేశం. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్లు కోటి, రమణ గోగుల జడ్జీలుగా వ్యవహరించారు. 35 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. 2005 లో జీ తెలుగు లిటిల్ ఛాంప్స్ ప్రోగ్రాంను అనౌన్స్ చేసింది. ఇండియన్ ఐడల్ కారుణ్య యాంకర్‌గా చిన్న పిల్లల కోసం ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసింది. ఈ రెండూ ప్రోగ్రామ్స్ తో రేటింగ్‌లో జీ తెలుగు తన స్థానాన్ని పదిలం చేసుకుంది. సౌతిండియాలో బిజినెస్ పరంగా తన వాటాను దక్కించు కోవాలనే ఉద్ధేశంతో మహిళలను కేంద్రంగా చేసుకుని కార్యక్రమాలను రూపొందించడం ప్రారంభించింది. మీ ఇంటి వంట పేరుతో టెలికాస్ట్ చేసిన ఈ ప్రోగ్రాం 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టించింది. సుమలత దీనికి ప్రయోక్తగా వ్యవహరించారు. మధ్యాహ్నం స్లాట్‌లో జీ తెలుగు రేటింగ్‌లో దూసుకెళ్లింది. దీంతో జీ తెలుగు ప్రోగ్రాం దెబ్బకు ఈటీవీ, జెమిని, మాటీవీ తోపాటు తెలుగు న్యూస్ ఛానల్స్ వంటల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి.
కేవలం పెద్దల కోసం అర్ధరాత్రి మిడ్నైట్ మసాలా పేరుతో ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేసింది. అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయంటూ అభ్యంతరాలు రావడంతో దానికి పుల్ స్టాప్ పెట్టారు. ఈ ప్రోగ్రాంకు విపరీతమైన రేటింగ్ వచ్చింది. 2007 నుండి డిసెంబర్ 2008 వరకు ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ అయ్యింది. 2.0 రేటింగ్ స్వంతం చేసుకుంది. మా, ఈటీవీలను దాటేసింది ఈ రేటింగ్. సుమలత యాంకర్‌గా ప్రముఖ జ్యోతిష్కులు వక్కంతం చంద్రమౌళితో శ్రీకరం శుభకరం పేరుతో మరో కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసింది. ఇది పూర్తిగా లైవ్ ప్రోగ్రాం. విపరీతైన క్రేజ్ వచ్చింది. దీనిని మిగతా ఛాన్సల్ ఫాలో అయ్యేలా చేసింది. ఈ కార్యక్రమాలన్నీ అజయ్ కుమార్ హెడ్‌గా ఉన్నప్పుడు జరిగాయి. ఆ తర్వాత వాల్డ్ డిస్నీ కంపెనీతో పాటు పీయర్ల మీడియా లో పనిచేసిన సంజయ్ రెడ్డి 2008లో జీ ఛానల్స్‌కు సౌత్ ఇండియా హెడ్‌గా ఉన్నారు. న్యూసోప్స్, చిల్డ్రన్స్ ప్రోగ్రాంపై దృష్టి కేంద్రీకరించారు.
2015లో జీ తెలుగు 10 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎందరో ప్రతిభ కలిగిన వారు ఈ ఛానల్ ద్వారా మార్కెట్లో పేరు సంపాదించారు. నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. విపరీతమైన క్రేజ్‌ను స్వంతం చేసుకున్నారు. ఒకానొక సమయంలో సినిమా నటీనటులతో పోటీ పడ్డారు. యాంకర్స్‌గా ఉన్న కొందరు సినిమా రంగంలో అవకాశాలు దక్కించుకున్నారు. టాలెంట్ కలిగిన వారిని ప్రోత్సహించి సక్సెస్ అయ్యేలా జీ తెలుగు కృషి చేసింది.
2007 అక్టోబర్ 15న జీ గ్రూపు తన ఛానల్స్ లోగో కలర్స్‌ను మార్చేసింది. నీలి రంగు ఉండేలా లోగో మార్చేసింది. డిసెంబర్ 31న జీ తెలుగు ఛానల్స్ హెచ్ ఢీ ఛానల్స్‌గా మారాయి. జీ గోల్డెన్ అవార్డులను ప్రకటించింది. దీనిని సినీ నటుడు డాక్టర్ చిరంజీవి ప్రారంభించారు. ప్రముఖ నటి సమంతా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. స్టార్, మా, జెమిని, ఈటీవీలను తట్టుకుని ఎప్పికప్పుడు ప్రోగ్రామ్స్‌కు ప్రాణం పోస్తోంది జీ తెలుగు. ప్రస్తుతం అనురాధ గూడూరు సౌత్ ఇండియా బిజినెస్ హెడ్‌గా ఉన్నారు. ఆమె ఆధ్వర్యంలో వారెవ్వా, రక్త సంబంధం, గుండమ్మ కథ, గృహ ప్రవేశం, బతుకు జెట్కా బండి, తెనాలి రామకృష్ణ, కుంకుమ భాగ్య, గంగ మంగ, అమెరికా అమ్మాయి, ముద్ద మందారం, నా కోడలు బంగారం, మాటే మంత్రం, కళ్యాణ వైభోగం , ముత్యాల ముగ్గు, సూర్య వంశం సీరియల్స్ పాపులర్ అయ్యాయి. సరిగమపను రిపీట్ చేస్తోంది.
తెలుగుదనం ఉట్టి పడేలా..తెలుగు వారు గర్వపడేలా..తెలుగు ఇంటిల్లి పాది ఆనందించేలా జీ తెలుగు కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఎంటర్ టైన్ మెంట్ రంగంలో జీ తెలుగు ఓ సంచలనం. ప్రతి కుటుంబంలో జీ సీరియల్ వచ్చేలా చేయడంలో జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ సక్సెస్ అయ్యారు. ఆమె ఏది చేపట్టినా అది సక్సెస్సే. మిగతా ఛానల్స్ భారీ ఆఫర్లు ఇచ్చినా ఆమె మాత్రం జీ తెలుగు ఛానల్‌కే అంకితమయ్యారు. అంతలా లీనమయ్యారు. ఉత్తమ తెలుగు కుటుంబంగా ప్రకటించిన అవార్డును ముద్దమందారం సీరియల్ టీం స్వంతం చేసుకుంది. రిచ్‌నెస్ ఉట్టి పడేలా ప్రోగ్రామ్స్ ఆకట్టుకునేలా చేస్తున్న జీ తెలుగు ఛానల్ రాబోయే రోజుల్లో తన రికార్డ్‌ను తానే అధిగమించనుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

Post a Comment