Header Ads

కాలేజీ డ్రాప‌వుట్స్‌ - స‌క్సెస్‌లో గ్రేట్..స‌క్సెస్ ఇచ్చే కిక్ ఏదీ ఇవ్వ‌దు.!!

స‌క్సెస్ ఇచ్చే కిక్ ఏదీ ఇవ్వ‌దు ఈ ప్ర‌పంచంలో. చ‌దువు ఎలా బ‌త‌కాలో నేర్పుతుంది. కానీ ఎలా డ‌బ్బులు సంపాదించాలో నేర్ప‌దు. దానిని మ‌న‌మే సంపాదించు కోవాలి స్వంతంగా. సొసైటీని ఇంప్రెస్ చేస్తున్న వాళ్లు, వ్యాపార ప‌రంగా స‌క్సెస్ అయిన వారు, పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించిన వాళ్ల‌ను చూస్తే ఎక్కువ మంది చ‌దువును మ‌ధ్య‌లో ఆపేసిన వాళ్లే అగుపిస్తారు. చ‌దువు వేరు..వ్యాపారం వేరు. గెలుపు కూడా వేరే. కోట్లాది అభిమానులు సంపాదించుకున్న ఆట‌గాళ్లు సైతం కొంద‌రు చ‌దువులో వెనుక‌బ‌డితే..మ‌రికొంద‌రు చ‌దువుకు దూర‌మైన వాళ్లున్నారు. స‌క్సెస్ సాధించాలంటే చ‌దువు కోవాల్సిన ప‌నిలేదు.. డిఫ‌రెంట్‌గా ఆలోచించాలి. భిన్నమైన దారుల‌ను వెత‌కాలి. అంద‌రికంటే ముందంజ‌లో ఉండాలి. కొన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో త‌మ‌కు తాము బ్రాండ్‌గా ఎద‌గాలి. ఇదే విజ‌య‌మంటే. సంపూర్ణ‌మైన స‌క్సెస్ అంటే. అలాంటి వారిలో ఆపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్‌, ఫేస్ బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు జుకెర్ బ‌ర్గ్‌. వీళ్లిద్ద‌రు పెద్ద‌గా చ‌దువు కోలేదు..కాలేజ్ డ్రాప‌వుట్స్‌.
వీరి లాగానే ఇండియాకు చెందిన కాలేజీని మ‌ధ్య‌లో మానేసి ఆంట్ర‌ప్రెన్యూర్లుగా రాణిస్తూ ఔరా అనేలా చేస్తున్నారు. ప‌ద‌మూడేళ్ల‌కే డిజైన‌ర్ అయ్యాడు జ‌లంధ‌ర్ కు చెందిన వ‌రుణ్ షూర్‌. కాలేజీకి వెళ్లి మ‌ధ్య‌లో ఆపేశాడు. వెబ్ డిజైన‌ర్‌గా ఎక్స్‌ప‌ర్ట్. స్వంతంగా ఓ ప్రోగ్రాంను త‌యారు చేశాడు. వెబ్ అప్లికేష‌న్స్‌ను రూపొందించాడు. ఎవ‌రైనా ఈజీగా వాడుకునేలా ఓ ప్లాట్‌ఫాం త‌యారు చేశాడు. వెబ్ బేస్డ్ టికెట్ స‌పోర్ట్ సిస్టంతో 2001లో క‌యాకో కంపెనీని స్థాపించాడు. అత‌డికి అపుడు 17 ఏళ్లు..అదే క‌వ‌కో ఇన్ఫోటెక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఐటీ రంగంలో లీడింగ్ ఐటీ ప్రొడ‌క్ట్ అందించే కంపెనీల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ కాలేజీ డ్రాప‌వుట్ ద‌గ్గ‌ర కొంత మందికి ఉపాధి దొరుకుతోంది.

దీప‌క్ ర‌వీంద్ర‌న్ కంప్యూట‌ర్ సైన్స్ డ్రాప‌వుట్ ఇండియ‌న్ ఎడ్యూకేష‌న్ సిస్టంలో ఎదుర‌య్యే ప్రాబ‌ల్స్‌కు సులువుగా ప‌రిష్కారం చూపేలా రూపొందించిన యాప్ రికార్డ్ బ్రేక్ చేసింది. సిల‌బీ పేరుతో పుస్త‌కం కూడా రాశాడు. క్వెస్ట్ టెక్నాల‌జీస్ రూపొందించాడు. క్వ‌శ్చ‌న్స్‌కు ఆన్స‌ర్స్ ఇచ్చేలా యాప్ త‌యారు చేశాడు. ఇన్నోజ్ టెక్నాల‌జీస్ ఎస్సెమ్మెస్ గ్యాన్ ఈ రెండూ మోర్ పాపుల‌ర్. లుక్ అప్ పేరుతో కామ‌ర్స్ మెస్సేజింగ్ యాప్ కు విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. బిజినెస్ షాప్స్ నిర్వ‌హించే వాళ్ల‌కు చాలా సౌక‌ర్య‌వంతంగా వుంటోంది.

ఈజీ ఛార్జ్ పేరు ఎప్పుడైనా విన్నారా. ఏదైనా రీఛార్జ్ చేయాలంటే డ‌బ్బులు ఇవ్వాల్సిందే. ఏ బిల్లులు చెల్లించాల‌న్నా దుకాణానికి వెళ్లాల్సిందే. ఇపుడు ఆ క‌ష్టం లేకుండా చేశారు కునాల్ షా..సందీప్ టాండ‌న్‌. వీరిద్ద‌రు త‌యారు చేసిన ఫ్రీఛార్జ్ మార్కెట్‌లో దూసుకెళుతోంది. 2010లో ఏర్పాటు చేసిన ఈ కంపెనీని స్నాప్ డీల్ కాన్‌సెంట్రేష‌న్ చేసింది. వీరిద్ద‌రూ కాలేజీ డ్రాప‌వుట్స్‌.

మ‌హేష్ మూర్తి గుర్తున్నాడా..మ‌నోడే. 13 ఏళ్ల నుండి స్టార్ట‌ప్స్‌కు ఫండింగ్ చేయ‌డంతో పాటు మార్కెటింగ్ చేస్తున్నాడు. 19 ఏళ్లుగా డిజిట‌ల్ మీడియాలో ఉన్నాడు. ఉస్మానియా యూనివ‌ర్శిటీలో చ‌దువు పూర్తి చేయ‌కుండానే బ‌య‌ట‌కు వ‌చ్చాడు. వ్యాక్యూమ్ క్లీన‌ర్స్ ను ఇంటి ఇంటికి తిరుగుతూ అమ్మాడు. యూనిలివ‌ర్ త‌యారు చేసిన మూర్తి క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా అవార్డు పొందాడు. ది ఎకాన‌మిస్ట్‌, పెప్సీ, ఎంటీవీ ల‌కు షార్ట్ స్టోరీస్ రాసే స్థాయికి చేరుకున్నాడు. క‌మ‌ర్షియ‌ల్ గా మాంచి క్లిక్ అయ్యాయి. పిన్‌స్ట్రామ్ కంపెనీని స్థాపిస్తే త‌క్కువ టైంలో పాపుల‌ర్ అయ్యింది. మూర్తి కూడా కాలేజ్ డ్రాప‌వుటే.

ఇండియాలో మోస్ట్ పాపుల‌ర్ వెబ్ సైట్ ఏది అంటే రియ‌ల్ ఎస్టేట్‌కు సంబంధించి ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది హౌసింగ్ . కామ్ . దీనిని స్తాపించింది రాహుల్ యాద‌వ్‌. ఐఐటీ ముంబయి స్టూడెంట్‌. నాల్గో సంవ‌త్స‌రంలోనే చ‌ద‌వ‌కుండా బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. ఇదో అత్యంత న‌మ్మ‌క‌మైన కంపెనీగా తీర్చిదిద్దాడు. ఇల్లు, ప్లాట్‌, ఫ్లాట్ ఏది కావాల‌న్నా న‌మ్మ‌కంగా దీని ద్వారా కొనుగోలు చేసేలా రూపొందించాడు. త‌న వ‌ద్ద ప‌నిచేసే ఉద్యోగ‌స్తుల‌కు త‌న కంపెనీ ఆదాయంలో స‌గం వాటా ఇచ్చాడు.

భ‌వీన్ తుర‌క్కియా..డైరెక్టీ సిఇఓ. ఇంట‌ర్నెట్‌లో డొమైన్ నేమ్స్ రిజిస్ట‌ర్ చేసే కంపెనీ ఇది. దీనిని 1998లో స్థాపించాడు. నెట్‌లో వ‌స్తున్న మార్పుల‌ను ముందుగానే ప‌సిగ‌ట్టాడు. గ్లోబ‌ల్ వెబ్ ప్రొడ‌క్ట్స్‌ను డీల్ చేస్తోంది. 12 వ త‌ర‌గ‌తిలో డ్రాప‌వుట్‌. ప‌ల్ల‌వ్ నందిని..కో ఫౌండ‌ర్ అండ్ సిఇఓ ఫ్యుసియ‌న్ చార్ట్స్‌, రాజోర్‌ఫ్లో, కొలాబియ‌న్ . 16 ఏళ్ల‌ప్పుడు 2001లో వీటిని ఏర్పాటు చేశాడు. స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌గా డేటా విజువ‌లైజేష‌న్ ప్రొడ‌క్ట్స్‌ను సేల్ చేస్తోంది. నాస్కాం ఎమ‌ర్జ్ 50 మంది వ్యాపార‌వేత్త‌ల‌ను ప్ర‌క‌టిస్తే అందులో భ‌వీన్ కూడా ఒక‌రు.

యూనివ‌ర్శిటీ డ్రాప‌వుట్ ఇత‌ను కూడా. వెబ్ అండ్ మొబైల్ బేస్డ్ కోడ్‌ను ఇన్‌స్టాల్ చేస్తే చాలు ఇబ్బందులు తొల‌గి పోతాయి. ఆంట్ర‌ప్రెన్యూర్‌గా అభిషేక్ గుప్తా పేరొందారు. ఫ్రాంక్లీ.మి. ఐడియా వుంటే చాలు ఇంప్లిమెంటేష‌న్ చేసేలా ఫ్లాట్‌ఫారం త‌యారు చేశాడు. ఇత‌ను కూడా ఐఐటీ డ్రాప‌వుట్‌. ఎలాంటి కోడింగ్ లేకుండానే వెబ్ సైట్ల‌లలో యాడ్స్‌ను పోస్ట్ చేయ‌డం ద్వారా డ‌బ్బులు సంపాదించే మార్గాన్ని డెవ‌ల‌ప్ చేశాడు అంకిత్ ఒబేరాయ్‌. అత‌డు త‌యారు చేసిన యాడ్‌పుష్ అప్ మ‌రింత పాపుల‌ర్ పొందింది. మ‌హ‌రాజా అగ‌ర్స‌న్ కాలేజీ డ్రాప‌వుట్‌. ఇన్నోబుజ్ కంపెనీకి ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్‌గా ఉన్నారు.

No comments