Header Ads

హీరో విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి తరుచు వైజాగ్ కి వెళ్ళడానికి కారణం ఏంటి.?

ఇటీవల కాలం లో మన హీరో లు తరుచు వైజాగ్ కి వెళ్లి వస్తున్నారు, ముఖ్యంగా బడా హీరో లు అయిన వెంకటేష్, నాగార్జున, చిరంజీవి ఎక్కువగా వెళ్లి వస్తున్నారని సమాచారం, సామాన్యంగా వైజాగ్ లో షూటింగ్స్ బాగానే జరుగుతాయి, షూటింగ్స్ కోసం వెళ్తున్నారు అనుకుంటే పొరబడినట్టే.



వైజాగ్ లో ఒక వెల్‌నెస్ సెంటర్ ఉంది. రిలాక్స్ అయ్యేందుకు, పని ఒత్తిడి తగ్గించుకునేందుకు వైజాగ్ లోని వెల్‌నెస్ సెంటర్ కు వెళ్లి వస్తున్నారట, ముందు బెంగుళూరు లో వెల్‌నెస్ సెంటర్ కు ఎక్కువగా వెళ్లే వాళ్ళు మన హీరోస్, కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రం లోనే ఒక మంచి వెల్‌నెస్ సెంటర్ ఉండటం తో, మన హీరో లందరు వైజాగ్ లోని వెల్‌నెస్ సెంటర్ కు వెళ్ళడానికే ఎక్కువ ప్రాధ్యాన్యం ఇస్తున్నారని సమాచారం.

హోటల్ నుండి వెల్‌నెస్ సెంటర్ కు:

ఇప్పుడు ఉన్న వెల్‌నెస్ సెంటర్ లో ముందు హోటల్ ఉండేది అని, అయితే అది పెద్దగా నడవకపోవడం తో దాన్ని వెల్‌నెస్ సెంటర్ కింద మార్చరట. వెంకటేష్, నాగార్జున, చిరంజీవి లాంటి వాళ్ళు తరచు తమ వెల్‌నెస్ సెంటర్ కి వస్తారని వెల్‌నెస్ సెంటర్ వాళ్ళు కూడా అనుకోని ఉండరు, మొత్తానికి వైజాగ్ కి మన స్టార్ హీరో లు బాగా అలవాటు పడ్డారని అర్ధం అయ్యింది.

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నాడు, సినిమా పేరు F2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్), సంక్రాంతి కి F2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సై రా నరసింహా రెడ్డి సినిమా తో మెగా స్టార్ చిరంజీవి సమ్మర్ లో మన ముందుకు రానున్నాడు, భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా, ఎన్ని రికార్డు లను తిరగరాస్తుందో వేచి చూడాలి. ఇక దేవదాస్ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్నారు కింగ్ నాగార్జున, త్వరలోనే ఒక పెద్ద ప్రాజెక్ట్ ని ప్రకటించబోతున్నారని సమాచారం, అక్కినేని వారి సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ సినెమా గా ఈ సినిమా నిలవనుందని సమాచారం.

No comments