Header Ads

స‌బ్‌స్క్రైబ‌ర్స్‌లలో ఫ‌స్ట్ - బిజినెస్‌లో లాస్ట్ - ఏటికి ఎదురీదుతున్న వొడాఫోన్

టెలికాం రంగంలో ఒక‌ప్పుడు రారాజుగా వెలుగొందిన వొడా ఫోన్ చిత్ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కోంటోంది. ఏ వ్యాపారానికైనా వినియోగ‌దారులే కీల‌కం. ఎంత మంది పెరిగితే అంత ఆదాయం వ‌స్తుంద‌న్న‌ది జ‌గ‌మెరిగిన వ్యాపార ర‌హ‌స్యం. కానీ ఇక్క‌డ మాత్రం సీన్ రివ‌ర్స్ అయింది. స‌బ్ స్క్రైబ‌ర్స్ కోట్ల‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ టెలికాం మార్కెట్లో రోజు రోజుకు న‌ష్టాలు చ‌వి చూస్తోంది. వేరెవ్వ‌ర్ యు గో..అవ‌ర్ నెట్‌వ‌ర్స్ ఈజ్ ఫాలో అన్న యాడ్ కోట్లాది అభిమానుల మ‌న‌సుల‌ను చూర‌గొంది. ఆ యాడ్‌లో న‌టించిన హ‌చ్ డాగ్‌కు కోట్లాది మంది ఫ్యాన్స్‌గా మారారు. అంత‌గా పాపుల‌ర్ అయ్యిందీ ఈ యాడ్‌. కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్టింది.

కేవ‌లం ఆ డాగ్ కోసమ‌ని ఈ టెలికాం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌ను ఎంచుకున్నారంటే అతిశ‌యోక్తి కాదేమో. ఇండియ‌న్ యాడ్స్ చ‌రిత్ర‌లో రిల‌య‌న్స్ కంపెనీ ఆధ్వ‌ర్యంలో మొద‌టిసారి విడుద‌ల చేసిన ఓన్లీ విమ‌ల్ యాడ్ రికార్డ్ బ్రేక్ క్రియేట్ చేసింది. కోట్లాది రూపాయ‌ల బిజినెస్ చేసింది. ఆ త‌ర్వాత అంత‌గా ఇండియ‌న్స్ ను ఆక‌ట్టుకున్న యాడ్ ఏద‌న్నా ఉందంటే ..వొడా ఫోన్ క్రియేట్ చేసిన యాడ్‌. హ‌చ్ నుంచి వొడాఫోన్ గా మారాక‌..వ‌చ్చిన యాడ్స్‌ల‌లో హ‌చ్ డాగ్‌కే ఎక్కువ పాపులారిటీ ల‌భించింది. ట్రేడ్ అన‌లిస్టుల అంచ‌నాలు త‌ల‌కిందులుగా మారాయి. ఈ కంపెనీని అంచ‌నా వేయ‌డంలో . ఇండియా టెలికం మార్కెట్‌ను మూడు కంపెనీలు జియో, ఎయిర్ టెల్‌, వొడాఫోన్ శాసిస్తున్నాయి. ఏ కంపెనీ ముందంజ‌లో ఉంద‌ని చెప్ప‌డానికి వీలు లేకుండా పోయింది. గ‌త ఆరు నెల‌ల కింద‌టి వ‌ర‌కు చూస్తే ఎయిర్‌టెల్ టాప్ వ‌న్‌లో ఉండేది..జియో రిల‌య‌న్స్ వ‌చ్చాక మిగ‌తా కంపెనీల‌కు స్థానాలు లేకుండా పోయాయి.
టాటా వంటి అతి పెద్ద కంపెనీనే జియో దెబ్బ‌కు మూసుకోవాల్సి వ‌చ్చింది. దీంతో పాటు ఎయిర్‌సెల్‌, యూనినార్ కంపెనీలు కూడా దుకాణం స‌ర్దేశాయి. కంపెనీలు లాభాలు గ‌డించాలంటే టారిఫ్ ముఖ్యం. దీనిపైనే రిల‌య‌న్స్ కాన్‌సెంట్రేష‌న్ చేసింది. టారిఫ్ వార్‌ను త‌ట్టుకోలేక వొడాఫోన్ , ఐడియాలో విలీన‌మైంది. బీఎస్ ఎన్ ఎల్ ఉన్నా లేన‌ట్టే అయింది. ప్ర‌స్తుతం మూడు కంపెనీలు జియో, ఎయిర్‌టెల్‌, ఐడియాల మ‌ధ్యే నెల‌కొంది. వొడా , ఐడియా క‌లిశాక 43.5 కోట్ల మంది క‌స్ట‌మ‌ర్ల‌తో ముందంజ‌లో ఉన్నా జియో 26.1 కోట్ల‌తో దూసుకు వ‌స్తోంది. 40 కోట్ల స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ 4, 970 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని స్వ‌యంగా ఐడియా- వొడాఫోన్ ప్ర‌క‌టించింది. దీనికి భిన్నంగా 681 కోట్ల లాభాల‌ను జియో రిల‌య‌న్స్ లాభాల‌ను గ‌డించి మార్కెట్ వ‌ర్గాల అంచనాల‌ను అమాంతం పెంచేసింది. మరో పోటీ కంపెనీ ఎయిర్‌టెల్ ఆదాయం 11 శాతానికి ప‌డిపోయింది. 23 లక్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోయింది. వీరిలో ఎక్కువ‌గా జియో కంపెనీకి మారారు. కొత్త‌గా 1.3 కోట్ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు వ‌చ్చి చేరారు. దీనిని బ‌ట్టి చూస్తే ఏ కంపెనీ ఎక్కువో చెప్ప‌డం క‌ష్టం.

డేటా విష‌యంలో..నెట్ క‌నెక్టివిటీ..స‌ర్వీసింగ్..మోనిట‌రింగ్ విష‌యంలో జియో టాప్ పొజిష‌న్‌లో ఉంది. రాబోయే రోజుల్లో ఐడియా..ఈ టెలికాం దిగ్గ‌జాన్ని త‌ట్టుకుంటుందా..ఎయిర్‌టెల్ ఇలాగే పోరాడుతుందా తెలుస్తుంది. మొత్తం మీద మార్కెట్ వ‌ర్గాల అంచ‌నాల ప్ర‌కారం జియో రిల‌య‌న్స్ ఇంకాస్త ముందుకు వెళుతుందే త‌ప్పా వెన‌క్కి త‌గ్గ‌ద‌న్న వాస్త‌వం బోధ‌ప‌డుతోంది.

No comments