Header Ads

మెస్సేజింగ్‌లో వాట్స‌ప్‌దే జోరు

టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ ప్ర‌పంచం మారి పోతోంది. క్ష‌ణాల్లో కొత్త ప‌రికం..కొత్త ఆవిష్క‌ర‌ణ జ‌రుగుతోంది. యూత్ ఐకాన్స్ గా ఎదుగుతున్నారు. న్యూ వేవ్స్‌..న్యూ లుక్స్‌తో..న్యూ ఐడియాస్‌కు ప‌దును పెడుతూ త‌మ‌ను తాము ఆవిష్క‌రించుకునే ప్ర‌య‌త్నంలో మునిగి తేలుతున్నారు. ఇదో మంచి ప‌రిణామం. ప్ర‌తిభావంతుల‌కు..క్రియేటివిటీ క‌లిగిన వారికి స్వ‌ర్గ‌ధామంగా టెక్నాల‌జీ ప్ర‌స్తుతం అప‌రిమిత‌మైన అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంది. కావాల్సింద‌ల్లా క‌ష్ట‌ప‌డ‌ట‌మే.
ఒక‌ప్పుడు నోట్ల క‌ట్ట‌ల‌ను చూసి ఆశ్చ‌ర్య పోయే వారు. ఇపుడు ఆ సీన్ మారింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించి..మార్కెట్‌ను ఏలుతున్న డాల‌ర్ల‌ను ఈజీగా సంపాదించేస్తున్నారు. ఇందులో మ‌న వాళ్లే టాప్‌. ఇండియ‌న్స్‌, తెలుగు, త‌మిళియ‌న్స్ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. ఐటీ అంటేనే బెంగ‌ళూరుకు పేరుండేది. చంద్ర‌బాబు పుణ్య‌మా అని సైబ‌ర్ సిటీ ఐటీ సెక్టార్‌లో రికార్డులు బ్రేక్ చేస్తోంది. గూగుల్‌, వాట్స‌ప్‌, ఫేస్ బుక్‌, త‌దిత‌ర బ‌డా ఐటీ కంపెనీలు ఇక్క‌డే త‌మ రీజిన‌ల్ ఆఫీసుల‌ను తెరిచాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, జెన్ ప్యాక్ట్‌, క్యాప్ జెమినీ, టీసీఎస్ , త‌దిత‌ర కంపెనీల‌న్నీ హైద‌రాబాద్‌ను ఎంచుకున్నాయి. బీపీఓ, కేపీఓ, సాఫ్ట్ వేర్‌, హార్డ్ వేర్ తో పాటు డిజిట‌ల్ మీడియా ప‌రంగా ఈ న‌గ‌రం దూసుకు వెళుతోంది. ఇంట‌ర్నెట్ వాడ‌కం కోట్ల‌కు చేరింది. ప్ర‌తి ఒక్క‌రు మొబైల్‌లోనే జీవిస్తున్నారు. దానిని వాడ‌క‌పోతే చ‌నిపోతామ‌నే రీతికి అడిక్ట్ అయ్యారు.

అంత‌లా కనెక్ట్ కావ‌డంతో ఐటీ , టెలికాం దిగ్గ‌జాల‌న్నీ రోజుకో ఆఫ‌ర్ల‌తో ..కొత్త కొత్త టెక్నాల‌జీతో క‌స్ట‌మ‌ర్ల‌ను, నెటిజ‌న్ల‌ను నిద్ర‌పోనీయ‌కుండా చేస్తున్నాయి. ఆర్కూట్ , ఎఫ్‌బీ ల‌ను కాద‌ని వాట్స్ అప్ యాప్ ను కోట్ల‌ల్లో యూజ‌ర్స్ వాడుతున్నారు. ట్విట్ట‌ర్ ..వాట్స్ యాప్ టెక్సింగ్ మెస్సేజెస్‌లో పోటీ ప‌డుతుంటే..ఫోటోల విష‌యంలో ఇన్‌స్టా గ్రాం దూసుకెళుతోంది..వీడియోల ప‌రంగా యూట్యూబ్ రారాజుగా వెలుగుతోంది. మెస్సేజెస్‌తో పాటు వాయిస్ రికార్డింగ్‌, వీడియోల షేరింగ్ విష‌యంలో వాట్స్ అప్ మిలియ‌న్స్‌ను ఎప్పుడో దాటేసింది. దానిని త‌ట్టుకోవ‌డం ఎవ్వ‌రి త‌రం కావ‌డం లేదు. దిగ్గ‌జ సోష‌ల్ మీడియా కంపెనీల‌న్నీ చ‌తికిల ప‌డ్డాయి. కోట్లాది స‌భ్యుల‌ను క‌లిగిన వాట్స్ అప్‌ను స్వంతం చేసుకునేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ పోటీ నెల‌కొన‌గా ఫేస్ బుక్ చేజిక్కించుకుంది.

ఇక కోట్లాది వీడియాలోను క‌లిగి ఉన్న యూట్యూబ్‌ను గూగుల్ కంపెనీ స్వంతం చేసుకుని..త‌న వాటాను కాపాడుకుంది. ప్ర‌తి దానికి మెస్సేజే కీల‌కం కాబోతోంది. దీంతో కంపెనీలు, వ్య‌క్తులు ..ఇలా ప్ర‌తి ఒక్క‌రు దీనిమీదే ఆధార‌ప‌డి కార్య‌క‌లాపాలు, లావాదేవీలు..భావోద్వేగాల‌ను పంచుకుంటున్నారు. ఇత‌రులతో షేర్ చేసుకుంటున్నారు. వీట‌న్నింటికి ఈజీగా వేదిక‌గా వాట్స్ అప్ నిలిచింది. ఫేస్ బుక్ మెస్సెంజ‌ర్‌, ఇన్‌స్టా గ్రాం మెస్సెంజ‌ర్స్ కూడా వాట్స్ అప్‌తో పోటీ ప‌డుతున్నాయి. ఇండియా వ‌ర‌కు వ‌స్తే 91 శాతం మొబైల్ యూజ‌ర్స్ మెస్సేజెస్ కోసం వీటిపైనే ఆధార‌ప‌డుతున్నార‌నేది అంచ‌నా. యాప్స్ మార్కెటింగ్‌, క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌ల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి ఈ కంపెనీలు. డిజిట‌ల్ మార్కెటింగ్ రంగం ఇండియాలో శ‌ర‌వేగంగా వృద్ధి చెందుతోంది. 34 శాతం మంది ఇంట‌ర్నెట్ వాడుతుంటే ఎక్కువ శాతం మెస్సేజింగ్ మీదే ఆధార‌ప‌డుతున్నారు.

46 కోట్ల మంది మొబైల్ యూజర్లు..వీరంతా మెస్సేజింగ్‌లోనే ..మొబైల్స్‌లోనే గ‌డుపుతున్నారు. ప్ర‌పంచంలోనే మూడో అతి పెద్ద సోష‌ల్ మీడియా సంస్థ‌గా వాట్స్ అప్ చేరుకుంది. సో ..రాబోయే రోజుల్లో మెస్సేజింగ్ ఆధారంగా సేవ‌లు అందించే కంపెనీల‌కే ఫ్యూచ‌ర్ ఉంటుంద‌న్న‌ది మార్కెట్ వ‌ర్గాల భావ‌న‌. ఒక ఆలోచ‌న‌..ఒక డైలాగ్‌..ఒక పాట‌..ఓ దృశ్యం ఏది చెప్పాల‌న్నా..ఏది పంచుకోవాల‌న్నా ..మెస్సేజింగ్ కీల‌కం. ఇపుడు అదే ప్ర‌భంజ‌నం సృష్టిస్తూ ..నెటిజ‌న్ల‌ను ..మొబైల్ యూజ‌ర్ల‌ను కునుకు లేకుండా చేస్తోంది.

No comments