Header Ads

భార్య భర్తలు సంతోషంగా కలిసుండాలంటే ఏం చెయ్యాలి.?

భార్య భర్తల మధ్య ఏవో ఒక కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి, కొట్లాటలు జరిగితేనే ప్రేమ ఉన్నట్టు అని కొందరు అంటుంటారు.




అసలు భార్య భర్తల మధ్య తగాదాలు ఎప్పుడు వస్తాయి.?

భార్య భర్తల మధ్య తగాదాలు రావడానికి ముఖ్య కారణం, 'నీ మాట నేనెందుకు వినాలి'. భార్య మాట భర్త అయిన వినాలి, లేకుంటే భర్త మాట భార్య అయిన వినాలి. ఇరువురిలో ఎవ్వరు వెనక్కి తగ్గకున్న మొదలయ్యేది తగాదాలే.

ఒక వేళ కొట్లాట అయితే ఎవరు ముందుగా మాట్లాడాలి.?

సామాన్యంగా అబ్బాయిలకు కోపం ఎక్కువ, అమ్మాయిలకు అలిగే స్వభావం ఎక్కువ. కనుక అబ్బాయి తన కోపం తగ్గించుకొని అమ్మాయి ని క్షమాపణ కోరి కలుపుకొని పోవాలి.

కట్నం కోసం పెళ్ళాన్ని వేధిస్తున్నారా.?

అసలు మొగవాళ్ళు ముందు చేసే తప్పు ఏంటంటే, కట్నం కోసం పెళ్ళాన్ని వేధించడం, మీకు వచ్చే జీతం సరిపోకనో, లేక దుబారా ఖర్చులకి చేతిలో డబ్బులు ఆడకనో మీరు కట్నం డబ్బులు అని పెళ్ళాన్ని హింసించడం మొదలుపెడతారు. "సొంత డబ్బులతో ఒక కుటుంబాన్ని పోషించే స్తోమత లేని వాడు పెళ్లి చేసుకోడానికి అర్హుడు కాడు. అర్హుడు కాకపోయినా ఒక వేళ పెళ్లి చేసుకున్నా, కట్నం కోసం వేధించిన సమయం లో భార్య దృష్టిలో చెడ్డ వాడు అవుతాడు, కట్నం కోసం భర్త పెట్టే బాధలు తట్టుకోలేక ఇంట్లో వాళ్లకు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకొనే యువతుల సంఖ్యా చాలా ఎక్కువ, అందుకే కట్నం కోసం భార్యలను హింసించడం మానేయండి.

భర్త స్తోమత, స్థాయి తెలిసినప్పుడు.?

భర్త ఎంత అయితే సంపాదిస్తున్నాడో, సంపాదించిన దానితో తృప్తి పడాలి, అతని స్తోమత కి మించి అతనితో ఖర్చులు పెట్టించినా, అనవసరమైన వస్తువులు తెమ్మని విసిగించినా, భర్తకు కోపం వచ్చి కొట్లాటలకు దారితీస్తుంది.

భార్యను కచ్చితంగా షాపింగ్ లకి తీసుకెళ్లాలా?

పెళ్లి కి ముందు, ప్రతి అబ్బాయి తప్పక ఈ విషయం గురించి ఆలోచిస్తాడు, కానీ అమ్మాయిలను కచ్చితంగా షాపింగ్ లకి తీసుకు వెళ్ళాలి అని రూల్ ఏం లేదు, ఆడవాళ్ళకి దుస్తుల మీద మమకారం ఎక్కువే, కానీ వంటలో కారం పొడి అవసరానికి తగ్గట్టుగా ఎలా వేసుకుంటామో, ఆడవాళ్ళూ కూడా అవసరానికి తగ్గట్టుగానే దుస్తులు కొంటారు, కేవలం కొంత మంది మాత్రమే అనవసరంగా కొంటూ ఉంటారు, వారిని ఉదాహరణగా చూపించి, అందరిని అనడం సబబు కాదు.

ఆఫీస్ పనుల్లో మునిగిపోకుండా.!

కష్ట పడి పెళ్ళాన్ని, పిల్లల్ని, తల్లి తండ్రులను బాగా చూసుకోవాలి అని మగవాళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ ఇంటికి వచ్చాక పిల్లలతో, భార్య తో సరదాగా సమయాన్ని గడిపితే, తగాదాలకు దారి అనేది ఉండదు.

No comments