Header Ads

గ్లాస్ వాటర్ ఇచ్చినందుకు ఆ మహిళకి ఎంత టిప్ ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు.?

ఒక సర్వర్ కి మనం మహా అయితే ఒక 10,20,30 మహా అయితే ఒక 50 రూపాయిలు టిప్ గా ఇస్తాం, కొంత మంది ధనవంతులు 1000 రూపాయిల నుండి 10000 రూపాయిల వరకు టిప్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయ్, కానీ ఒక అమ్మాయి కి 7 లక్షల రూపాయిలు టిప్ ఇవ్వడం అంటే అది వింత అనే చెప్పొచ్చు.




వివరాల్లోకెళితే, అమెరికాలోని ‘ సూప్ డాగ్స్’ రెస్టారెంట్‌కు ఒక వ్యక్తి వెళ్లాడు, అక్కడ వాటర్ ఆర్డర్ ఇవ్వగా. సర్వర్ ‌గా ఉన్న అలైనా కస్టర్ అనే అమ్మాయి అతనికి సర్వ్ చేసింది. అతను నీళ్లు తాగి వెళ్లిపోయాడు. వెంటనే అలైనా గ్లాస్ తీసుకుందామని టేబుల్ దగ్గరకు వెళ్లి చూడగా డాలర్ నోట్ల కట్ట కనిపించింది పక్కనే ఓ లెటర్(చిట్టి) కూడా ఉంది.

ఆ లెటర్ లో ఏమని రాసి ఉంది అంటే.

‘‘రుచికరమైన వాటర్ సర్వ్ చేసినందుకు కృతజ్ఞతలు అని రాసి వుంది ఆ డబ్బును మొత్తం లెక్కపెట్టగా 10 వేల డాలర్లు ( భారత కరెన్సీలో రూ.7 లక్షలు) ఉన్నాయి, ఆ అమ్మాయి ఆనందం తో ఉబ్బితబ్బిపోయింది, హోటల్ సిబ్బంది, పక్కన ఉన్న జనాలు అందరూ ఆశ్చర్య పోయారు, వెంటనే అతగాడు మళ్ళి హోటల్ కి వచ్చి ఆ అమ్మాయి కి హాగ్ ఇచ్చాడు, ఈ డబ్బులు నీకే. వృధా చెయ్యకు అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆ వ్యక్తి ఎవరంటే.?

యూట్యూబ్ లో 11 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్న 'మిస్టర్ బీస్ట్‌'గా గుర్తింపు పొందిన 'జిమ్మీ డొనాల్డ్‌సన్' ఆ డబ్బును ఇచ్చాడు, దాంతో సోషల్ మీడియా అంతా ఈ టాపిక్ వైరల్ అయిపోయింది, ఈ డబ్బుని తన స్నేహితులతో పాటు, తనతో పనిచేస్తోన్న, చదువుకుంటున్న వారికి ఇస్తానంటోంది కస్టర్.

సోషల్ మీడియా లో ప్రతి ఒక్కరు జిమ్మీ డొనాల్డ్‌సన్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కస్టర్ కు అదృష్ట రేఖ బాగా ఉంది.

No comments