Header Ads

కంప్యూట‌ర్లు, స్మార్ట్‌ఫోన్ల‌లో నిత్యం మ‌న‌కు ఎదుర‌య్యే ఈ ప‌దాల అర్థాలు మీకు తెలుసా..?

నేటి త‌రుణంలో కంప్యూట‌ర్‌, స్మార్ట్‌ఫోన్ అనేవి నిత్యం మ‌న జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు స్మార్ట్‌ఫోన్ల‌తో జ‌నాలు కాల‌క్షేపం చేస్తున్నారు. ఇక ఉద్యోగులు అయితే కంప్యూట‌ర్ కీ బోర్డు, మౌస్‌తో కుస్తీలు ప‌డుతున్నారు. చాలా రంగాల్లో ఇప్పుడు కంప్యూట‌ర్ వాడ‌కం ఎక్కువైంది. అలాగే జ‌నాలు కూడా స్మార్ట్‌ఫోన్ల‌ను ఎక్కువ‌గా వాడుతున్నారు. అయితే వీటిని వాడే సంద‌ర్భంలో చాలా మందికి ప‌లు ప‌దాలు కామ‌న్‌గా తార‌స‌ప‌డుతుంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
E-Mail
దీన్నే electronic mail అని కూడా అంటారు. e-mail కు పూర్తి రూప‌మే electronic mail. నేడు అనేక మంది చాలా మెయిల్ స‌ర్వీసుల‌ను వాడుతున్నారు. వాటిల్లో గూగుల్‌కు చెందిన జీమెయిల్ ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. ఆ త‌రువాత యాహూ, హాట్‌మెయిల్ వంటి మెయిల్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకుంటున్నారు.

WWW
దీని పూర్తి పేరు world wide web. ఏ వెబ్‌సైట్ అడ్రస్ అయినా దీంతోనే మొద‌ల‌వుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు... www.google.com, www.yahoo.com ఇలా అన్న‌మాట‌. వెబ్ సైట్ అడ్ర‌స్‌ల‌కు ముందుగా ఇది వ‌స్తుంది. దీన్ని ప్రిఫిక్స్ అంటారు.

HTML
hypertext markup language కి సంక్షిప్త రూప‌మే html. ఇదొక వెబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌. దీన్ని వెబ్ పేజీల‌ను క్రియేట్ చేసేందుకు వాడుతారు. మ‌నం ద‌ర్శించే చాలా వ‌ర‌కు వెబ్‌సైట్ల‌లో ఈ కోడ్‌ను ఉప‌యోగించి క్రియేట్ చేసిన వెబ్ పేజీలు ఉంటాయి.

HTTP
hypertext transfer protocol అనే ప‌దానికి సంక్షిప్త రూప‌మే http. ఇది కూడా వెబ్‌సైట్ అడ్ర‌స్‌ల‌లో ముందు ఉంటుంది. పైన చెప్పిన wwwకు ముందు దీన్ని వాడ‌తారు. http://www.yahoo.com ఇందుకు ఉదాహ‌ర‌ణగా చెప్పుకోవ‌చ్చు.

URL
uniform resource locator అనే ప‌దానికి సంక్షిప్త రూపంగా url ను వాడుతారు. ఏదైనా వెబ్‌సైట్ అడ్ర‌స్‌ను url అని పిలుస్తారు.

FTP
file transfer protocol అనే ప‌దానికి సంక్షిప్త రూపంగా ftp ని వాడుతారు. వెబ్‌సైట్ నిర్వాహ‌కులు త‌మ సైట్ల‌లోకి పెద్ద ఎత్తున ఫైల్స్‌ను అప్‌లోడ్ చేసేందుకు ftp ఉప‌యోగ‌ప‌డుతుంది.

AI
artificial intelligence అనే ప‌దానికి సంక్షిప్త రూప‌మే AI. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూట‌ర్లు, ప‌లు గ్యాడ్జెట్ల‌లో ఉండే డిజిట‌ల్ వాయిస్ అసిస్టెంట్లు ఈ కోవ‌కు చెందుతాయి. వాటిని AI టెక్నాల‌జీ స‌హాయంతో రూపొందిస్తారు.

E-Commerce
electronic commerce అనే ప‌దానికి సంక్షిప్త రూపంగా దీన్ని వాడుతారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌, స్నాప్‌డీల్ వంటి ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్లు ఈ కోవ‌కు చెందుతాయి. ఆన్‌లైన్ షాపింగ్ అనే ప‌దానికి ప్ర‌తిరూపమే ఈ-కామ‌ర్స్.

E-Business
electronic business అనే ప‌దం దీనికి పూర్తి పేరు. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ల‌ను నిర్వ‌హించే వారు చేసేది ఈ-బిజినెస్ అని చెప్పుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లో చేసే వ్యాపారం ఏదైనా ఈ కోవ‌కు చెందుతుంది.

E-Money
దీని పూర్తి పేరు electronic money. ఆన్‌లైన్‌లో మ‌నం పంపుకునే డ‌బ్బును ఈ-మ‌నీగా వ్య‌వ‌హ‌రిస్తారు. బిల్లు చెల్లింపులు ఆన్‌లైన్‌లో చేసినా అది ఈ-మ‌నీ యే అవుతుంది.

Internet
చాలా మందికి ఇంట‌ర్నెట్ అంటే తెలుసు. కానీ దీనికి కూడా పూర్తి పేరు ఉంటుంద‌ని ఎవ‌రికీ తెలియ‌దు. ఇంట‌ర్నెట్ పూర్తి పేరు international network. ఇంట‌ర్నెట్ అంటే ఏమిటో అంద‌రికీ తెలుసు క‌దా. అందులో మ‌నం చాలా ప‌నులు చేసుకోవ‌చ్చు. ఇది అంద‌రికీ తెలిసిందే.

Ernet
education and research network అనే ప‌దం దీనికి పూర్తి పేరు. సాధార‌ణంగా పలు యూనివ‌ర్సిటీల‌కు చెందిన వెబ్‌సైట్ల అడ్ర‌స్‌ల‌లో ఎర్నెట్ అని ఉంటుంది. అంటే అక్క‌డ చ‌దువుతోపాటు రీసెర్చ్ కూడా చేస్తార‌న్న‌మాట‌.

DVD
చాలా మందికి డీవీడీల గురించి తెలుసు. వీటిల్లో మ‌నం పాట‌ల‌ను, సాఫ్ట్‌వేర్ల‌ను, ఫొటోలు, వీడియోల‌ను స్టోర్ చేసుకోవ‌చ్చు. అయితే దీనికి పూర్తి పేరు digital versatile disc.

BPO
దీని పూర్తి పేరు business process outsourcing. అంటే చాలా కంపెనీలు త‌మ వ్యాపార నిర్వ‌హ‌ణ కోసం కాంట్రాక్టు సంస్థ‌ల‌పై ఆధార ప‌డ‌తాయి. సొంతంగా ఉద్యోగుల‌ను నియ‌మించుకోవు. కాంట్రాక్టు సంస్థ‌ల ఉద్యోగుల‌ను ఔట్‌సోర్సింగ్ విధానంలో తీసుకుని ప‌నిచేయించుకుంటాయి.

KPO
దీన్నే knowledge process outsourcing అని కూడా అంటారు. అంటే.. కంపెనీలు వ్యాపార నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన ముఖ్య‌మైన స‌మాచారాన్ని ఔట్ సోర్సింగ్ ద్వారా ప్రాసెస్ చేస్తాయి.

ALGOL
algorithmic language ప‌దానికి సంక్షిప్త రూప‌మే algol. మొట్ట‌మొద‌టి సారిగా వచ్చిన కంప్యూట‌ర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌. దీన్ని అనుస‌రించే ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ల‌ను త‌యారు చేశారు.

CDN
content distribution network అనే ప‌దానికి సంక్షిప్త రూప‌మే ఈ ప‌దం. దీని అర్థం ఏమిటంటే... ఇంట‌ర్నెట్‌లో స‌మాచారం వెదికే యూజర్ లొకేష‌న్‌, భాష‌, ఇత‌ర అంశాల ఆధారంగా స‌ర్వ‌ర్లు వెబ్‌పేజీల‌ను క్రియేట్ చేసి యూజ‌ర్‌కు అందిస్తాయి. దీన్నే సీడీఎన్ అంటారు.

No comments