Header Ads

సంవత్సరం గడిచినా ఇంకా ఆ సినిమా మాయనుండి బయటికి రాలేకపోతున్నారు యువత..!! ఇలాంటి సినిమా మళ్ళీరాదుఅని జనాలు చెప్పుకొనేంత మాయ చేసింది ఆ సినిమా..

మళ్ళీరావా సినిమా విడుదల అయి నేటికీ సంవత్సరం అవుతుంది, సుమంత్ కెరీర్ లో ఒక మైలు రాయి గా నిలిచిపోయింది ఆ సినిమా, అందులో సుమంత్ నటన అమోఘం అనే చెప్పాలి, ఒక ప్రేమికుడిగా తను ఎంత బాగా నటించాలో, అంత బాగా నటించాడు. నేపధ్య సంగీతం, పాటలు మళ్ళీరావా సినిమాకు ఎంతో బలాన్ని చేకూర్చింది, ఈ సినిమాకు యువత ఎంతలా ఆకర్షితులయ్యారు అంటే మాటల్లో వర్ణించలేనంత.




మొదలు...

అంజలి: "నా మీద కోపం లేదా"....
కార్తీక్: నువ్వు నా దెగ్గర ఉన్నప్పుడు ఇష్ట పడ్డం, దూరంగా ఉన్నప్పుడు బాధ పడ్డం, దానికి మించి నాకేం తెలియదు అంజలి..

ఇలా ఒక డైలాగ్ తో మొదలవుతుంది సినిమా, ఆ తరువాత నుంచి మనం మనల్ని మైమరచిపోయి సినిమా లో పాత్రలతో పాటు ప్రయాణిస్తాం, సుమంత్ చాలా రోజుల తరువాత ఒక చక్కటి పాత్రలో నటించాడు, మళ్ళీరావా చిత్రం లో సుమంత్ తన పాత్రలో కేవలం నటించలేదు, జీవించేసాడు. సుమంత్ కళ్ళల్లో నీరు కారిన ప్రతి సారి ప్రేక్షకుల కళ్లలో నీళ్లు కారాయి అంటే ఆ సినిమా లో సుమంత్ నటన ప్రేక్షకులకు ఎంత దెగ్గర అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.

మళ్ళీరావా సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆకాంక్ష సింగ్ కూడా తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది, ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటదనేది ఈ సినిమా ద్వారా తెలియజేసారు.మళ్ళీరావా చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ కి చిత్ర సీమ నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి.

సుమంత్ కెరీర్ ని మళ్ళీరావా కు ముందు, మళ్ళీరావా కు తరువాత అని విభజించవచ్చు. దెగ్గర అయిన ప్రతిసారి ఏదో ఒక రూపం లో ఎలా దూరం అవుతున్నారు అనే నేపధ్యాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. ఇప్పటికీ మళ్ళీరావా చిత్రం లోని పాటలు ప్రేక్షకులని కట్టిపడేస్తాయి. మళ్ళీరావా సినిమా కు సంగీతం అందించిన శ్రవణ్ భరద్వాజ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

మళ్ళీరావా చిత్రం లో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు వచ్చింది. మళ్ళీరావా సినిమాని చూసిన ప్రతిఒక్కరికి ఒక మంచి క్లాసికల్ చిత్రాన్నిచూసిన అనుభూతి కలుగుతుంది.

No comments