Header Ads

మహేష్ బాబు థియేటర్ పైన సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ.!!

రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఏ నిమిషం లో ఎలాంటి ట్వీట్ వేస్తాడో ఎవరికి తెలియదు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి బడా హీరో ల మీద నిత్యం కామెంట్స్ చేస్తూ ఉంటాడు, ఇప్పుడు తాజాగా మహేష్ బాబు థియేటర్ మీద కామెంట్ చేసాడు.


రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చూసి చాల మంది షాక్ అయ్యారు

ఎప్పుడు నెగిటివ్ గా ట్వీట్ వేసే రామ్ గోపాల్ వర్మ, పాజిటివ్ గా ట్వీట్ వేయడం తో చాలా మంది షాక్ అయ్యారు. అసలు రామ్ గోపాల్ వర్మ వేసిన ట్వీట్:" ఇప్పుడే AMB సినిమాస్ చూసాను, రెండవ తారీకు ఓపెన్ కానుంది, థియేటర్ మహేష్ బాబు లాగానే అందగా, చాలా బాగుంది, ఈ థియేటర్ ఒక కొత్త అనుభూతి ని అందిస్తుందని" వర్మ ట్వీట్ వేశారు.

7 స్క్రీన్ లతో అత్యాధునిక టెక్నాలజీ తో AMB సినిమాస్ ని నిర్మించారు, 2.0 సినిమా తోనే రిలీజ్ కావల్సిన ఈ సినిమా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడాల్సి వచ్చింది. ఏషియన్ సినిమాస్ తో కలిసి మహేష్ బాబు ఈ మల్టీప్లెక్స్ ని నిర్మించాడు, రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో AMB సినిమాస్ ముల్టీప్లెక్స్ ను నిర్మించాలని మహేష్ బాబు ఆలోచన. ఐటీ కారిడార్ గా పేరు ఉన్న గచ్చిబౌలి లో ఏ.ఏం.బి సినిమాస్ ఉండటం వల్ల మల్టీప్లెక్స్ రెవిన్యూ బాగుంటుందని నమ్ముతున్నారు. ఏడు స్క్రీన్లు, 1600 సీట్లు ఈ మ‌ల్టీప్లెక్స్ ప్ర‌త్యేకత‌. ల‌గ్జ‌రీ క్లాస్ కూడా ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు AMB సినిమాస్ మల్టీప్లెక్స్ ని బాగా ప్రమోట్ చేస్తున్నారు, సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటాది. హైదరాబాద్ లో ప్రసాద్స్ థియేటర్ ఏ రేంజ్ లో అయితే పాపులర్ అయ్యిందో, AMB సినిమాస్ కూడా అంతే పాపులర్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన 'భరత్ అనే నేను' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా షేర్ ని సాధించింది, మహేష్ బాబు 25 వ చిత్రం అయిన 'మహర్షి' వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న విడుదల కానుంది.

No comments