Header Ads

రికార్డులు తిర‌గ‌రాసిన త‌లైవా పేట్ట‌ - ర‌జ‌నీకి 68 ఏళ్లు

త‌మిళుల ఆరాధ్య న‌టుడు..అంతా ప్రేమ‌గా పిలుచుకునే త‌లైవా ..ర‌జ‌నీకాంత్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పేట్ట సినిమా టీజ‌ర్ రికార్డుల‌ను షేక్ చేస్తోంది. మ‌రోసారి ఈ సూప‌ర్‌స్టార్ త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించాడు. సినిమా సినిమాకు కొత్త మేన‌రిజంను ప్ర‌ద‌ర్శించే త‌లైవా..ఈసారి అడుగులో అడుగులు వేసుకుంటూ వ‌చ్చే సీన్‌తో విడుద‌లైంది. ఈ టీజ‌ర్‌ను ల‌క్ష‌లాది మంది ప్ర‌పంచ వ్యాప్తంగా వీక్షిస్తూనే ఉన్నారు. యూట్యూబ్‌లో వ్యూవ‌ర్స్ సంఖ్య పెరుగుతోంది. హీరోయిజం చెక్కు చెద‌ర‌కుండా ..మేన‌రిజం పండేలా ..నాయ‌కుడిలా వ‌స్తుంటే అనిరుధ్ ర‌విచంద‌ర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా చేసింది. త‌మిళ‌నాట ఈ టీజ‌ర్ ఓ సంచ‌ల‌నం.
ఈ మూవీలో ర‌జ‌నీకాంత్ రెండు పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ చిత్రాన్ని క‌ళానిధి మార‌న్ నిర్మిస్తున్నారు. త‌లైవాతో కొత్త ద‌నాన్ని కోరుకుంటున్నారు. డిఫ‌రెంట్ స్టోరీస్ వుండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే యంగెస్ట్ డైరెక్ట‌ర్స్‌కు త‌న‌తో సినిమా తీసేందుకు అవ‌కాశం ఇచ్చారు. అంత‌కు ముందు కాలా సినిమాకు రంజిత్ - పాను ఎంచుకుంటే..ఈసారి అరుణ్ ప్ర‌భు పురుషోత్త‌మ‌న్‌, అట్లీ, కార్తీక్ సుబ్బ‌రాజులు త‌లైవాకు త‌మ క‌థ‌లు వినిపించారు. రజ‌నీ మాత్రం కార్తీక్ సుబ్బ‌రాజుకే ఛాన్స్ ఇచ్చారు. పేట్ట వ‌చ్చే సంక్రాంతి పండుగ రోజు ప్రపంచ మంత‌టా విడుద‌ల చేయాల‌ని ఇప్ప‌టికే నిర్మాత ప్లాన్ చేశారు. ఇప్ప‌టికే శాటిలైట్ , ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్మేసిన‌ట్టు సినిమా వ‌ర్గాల అంచ‌నా. పిబ్ర‌వ‌రి 23న స‌న్ పిక్చ‌ర్స్ త‌లైవాతో కార్తీక్ డైరెక్ష‌న్‌లో సినిమా తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అప్ప‌టి నుంచి నేటి దాకా రోజు రోజుకు అంచ‌నాలు పెరుగుతూ వ‌చ్చాయి. నేటితో 68 సంవ‌త్స‌రాలు నిండిన ఈ త‌మిళ న‌టుడు చూస్తే..మాట్లాడితే..అద్దాలు మారిస్తే..న‌డుచుకుంటూ వ‌స్తే చ‌ప్ప‌ట్లే చ‌ప్ప‌ట్లు..ఈల‌లు..పూజ‌లు..పాలాభిషేకాలు. ఇంకా సినిమా రిలీజ్‌కు టైం ఉన్నా..టీజ‌ర్ కోసం లక్ష‌లాది మంది వెయిట్ చేశారు. 2014లో ఈ డైరెక్ట‌ర్ ఒక‌సారి ర‌జ‌నీని క‌లిశారు. త‌న‌కు సినిమా తీయాల‌ని ఉంద‌ని చెప్పారు.

నాలుగేళ్ల త‌ర్వాత కార్తిక్‌కు అవ‌కాశం చిక్కింది. న్యూ లుక్స్‌తో..జ‌నం జేజేలు ప‌లుకుతున్న‌ట్లు..న‌డిచి వ‌స్తుంటే..సీన్‌తో టీజ‌ర్ రిలీజ్ చేశారు. ర‌జ‌నీ మేన‌రిజం మ‌రోసారి మెస్మ‌రైజ్ చేస్తుందంటూ ఇప్ప‌టికే త‌మిళ‌నాట భారీ టాక్. ఎక్క‌డ చూసినా పేట్ట సినిమా పోస్ట‌ర్లు వెలిశాయి.ఇప్ప‌టికే శంక‌ర్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన 2.0 సినిమా రికార్డులు తిర‌గ రాస్తోంది. పేట్ట కూడా అదే బాట‌లో న‌డిచేలా ఉంది. ఫ్యాన్స్ ర‌జ‌నీకి ..జై త‌లైవా అంటూ నినదిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా సంత‌కం చేశాడు. స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ పీటర్ హెయిన్ జాయిన్ అయ్యాడు. నేపాల్‌లో..నార్త్ ఇండియాలో షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. సెప్టెంబ‌ర్ 7న ర‌జ‌నీ సినిమాకు డైరెక్ట‌ర్ పేట్ట అని పేరు పెట్టారు. తిర్రు, వివేక్ హ‌ర్ష‌న్ లు సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్‌, ఎడిట‌ర్లుగా ఎంపిక చేశారు.

విజ‌య్ సేతుప‌థి ప్ర‌ధాన రోల్ పోషిస్తున్నారు. ఫ‌హాద్ ఫాసిల్‌, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, బాబ్బీ సింహా, స‌న‌త్, గురు సోమ‌సుంద‌రం, రామ్‌దాస్‌, ష‌బ్బీర్ క‌ల్ల‌ర‌క్క‌ల్‌, దీప‌క్ ప‌ర‌మేష్‌, ఆదిత్య శివ్ పింక్‌, మ‌నికంద‌న్‌, ఆచారిలు ఇత‌ర పాత్ర‌ల్లో పోషిస్తున్నారు. దీపికా ప‌దుకొనే, అంజ‌లితో పాటు సిమ్రాన్ , త్రిష కూడా న‌టిస్తున్నారు. శ‌శికుమార్‌, మహేంద్ర‌న్‌లు కూడా ఇందులో పాత్ర‌ధారులే. 2019 జ‌న‌వ‌రి 11న పెట్టా సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్మాత నిర్ణ‌యించారు. సోని మ్యూజిక్ ఆడియో రిలీజ్ చేస్తోంది. త‌లైవా ఓ బ్రాండ్‌. వంద‌ల కోట్ల వ‌ర్షం కురిపించే ద‌మ్మున్న నాయ‌కుడు..న‌టుడు ర‌జ‌నీకాంత్‌. పేట్టా సినిమా ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో వ‌సూళ్ల ప‌రంగా ఏ రేంజ్ బ్రేక్ చేయ‌నుందో వేచి చూడాల్సిందే.

No comments