Header Ads

ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి గురించి ఈ 4 విషయాలు తెలుసా..? ఈ రోజు “అన్నం” ఎందుకు వండకూడదుఅంటే..?

ఒక్క ఏడాదిలో వచ్చే  ఇరవైనాలుగు ఏకాదశులులో ప్రతి ఏకాదశీ పవిత్రమైనదే..వాటిల్లో ప్రత్యేకమైన  ఏకాదశులు నాలుగు.  వాటిల్లో ఒకటే వైకుంఠ ఏకాదశి..ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు..హిందువులకు  అత్యంత పవిత్రమైన ఈ ఏకాదశి రోజున వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఉత్తరద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని ఆ రోజు భక్తులు ఎంతో ఆరాటపడతారు.అసలు ఈ రోజుకు ఎందుకు అంత ప్రాధాన్యం ..ముక్కోటి ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు అంటారు.దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా..?
ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతోపాటు శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోనూ ప్రాత:కాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరచుకుంటుంది. దీనికే వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు.
దేవతలు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. కాలకూటవిషాన్ని పరమేశ్వరుడు తన గరళాన బంధించింది ఆ రోజే.
మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశినాడే అనేది ఒక విశ్వాసం.
వైకుంఠ ఏకాదశిని స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు.దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని అంటారు.

ముక్కోటి ఏకాదశి నాడు అన్నం ముట్టకూడదంటారు ఎందుకు?

వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు అనే దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా.. ముర అనే రాక్షసుడు అన్నం రూపంలో ఉంటాడని ఒక విశ్వాసం అయితే, ఇంకొక కథ ప్రకారం బ్రహ్మ తలనుంచి ఒక స్వేద బిందువు నేలమీదపడి వెంటనే రాక్షస రూపం దాల్చింది. ‘‘ఓ బ్రహ్మదేవ, నాకు నివాస స్థానం చూపించు’’ అని ఆ రాక్షస రూపం ప్రార్థించింది. ఏకాదశినాడు మానవులు భుజించే వరి అన్నంలో ప్రవేశించి తద్వారా వారి ఉదరాల్లో స్థావరం ఏర్పర్చుకోమని బ్రహ్మ ఆ రాక్షస రూపానికి వరం ఇచ్చాడు. అందుకే ఈ రోజు శ్రీ మహావిష్ణువును షోడ శోపచారాలతో ఆరాధించి, చాలామంది ఉపవాసం చేస్తారు..ముక్కోటి ఏకాదశి సందర్భముగా దేవాలయములు అన్నీ కిక్కిరిసిపోతున్నాయి, సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి, అందులో ముక్కోటి ఏకాదశి కి ప్రత్యేక స్థానం ఉంది, ముక్కోటి ఏకాదశి పర్వదినాన భక్తులు చెయ్యవలసిన పనులు:

  • ముక్కోటి ఏకాదశి రోజున చన్నీటి తల స్థానం చేయాలి.

  • తెల్లవారు జామునే ఉత్తర ద్వారంగా శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలి, ఉత్తర ద్వారంగా శ్రీ మహా విష్ణువుని దర్శించుకుంటే సకల పాపములు తొలగి పోతాయి.

  • ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే సమస్య దోషాలు తొలగి పోయి, ఐశ్వర్యం కలిసి వస్తుందట.

ముక్కోటి ఏకాదశి పర్వదినాన భక్తులు భారీ సంఖ్యలో విష్ణు దేవుని రూపాలు అయిన వెంకటేశ్వర స్వామి, రామ స్వామి మరియు మిగిలిన అవతారాల మూర్తులు ఉన్న దేవాలయాలకు వెళ్తారు, శ్రీ మహా విష్ణువుని దేవాలయాలు అన్నీ భక్త జనం తో కిక్కిరిసిపోతాయి, ముఖ్యంగా మన తిరుమల లో భక్త జనం తండోప తండాలుగా తరలి వస్తారు స్వామి దర్శనార్థం.

ముక్కోటి ఏకాదశి ఇంత విశిష్టతను దక్కించుకోడానికి గల కారణం :

ముక్కోటి ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు ఒక శక్తిగా అవతరించి మురాసురుడు అనే రాక్షసుడిని అంతమొందించి భూమి ని కాపాడటం జరిగింది. మూరాసురుడిని అంతమొందించిన తరువాత భూమి మీదకు శ్రీ విష్ణువు సకల దేవతలతో అడుగుపెట్టారని, అందుకే ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ఆయన ఆ పూజలను స్వయంగా స్వీకరిస్తారు అని భక్తుల నమ్మకం, అందుకే ముక్కోటి ఏకాదశి అంటే భక్త జనానికి అంత ప్రీతి.

No comments