Header Ads

కాబోయే భార్య కి వాట్సాప్‌లో లో ఇడియట్ అని మెసేజ్ చేసినందుకు 4 లక్షల జరిమానా, 60 రోజుల జైలు శిక్ష.!!

మన దేశం లో సోషల్ మీడియా లో బూతులు మాట్లాడుకొనే వారి సంఖ్యా చాలా ఎక్కువ, ఒక వేళ మన దేశం లో కూడా అరబ్ దేశాల మాదిరి సోషల్ మీడియా లో నేర పూరిత పదాలు వాడే వారిని జైలు లో వేస్తే, దేశం లో సగానికి పైగా జనాభా జైలు లోనే ఉంటారు. ముఖ్యంగా హీరో ల కోసం. క్రికెటర్ ల కోసం, పొలిటిషన్స్ కోసం సోషల్ మీడియా లో ఒకరినొకరు ధూషించుంటారు మన దేశం లో, మనోళ్లు తెలివి మంతులు కాబట్టి బూతులు బాగా తిట్టాలి అంటే ఫేక్ అకౌంట్స్ క్రిఏట్ చేసుకొని బూతుల పురాణం మొదలెడతారు.




ఇడియట్ అన్నావ్, కోపమొచ్చింది, కంప్లైంట్ ఇచ్చా...

పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి కి ఇడియట్ అని మెసేజ్ చేసాడు ఒక ప్రబుద్దుడు, అతను ఆలా మెసేజ్ చేయగానే ఆ మెసేజ్ చూసి కోపం తో ఊగిపోయి కాబోయే భర్త మీదే పోలీస్ కేసు పెట్టింది ఆ అమ్మాయి. అసలు ఇడియట్ అని మెసేజ్ చేస్తేనే జైలు లో వేస్తారా ఎవరైనా అని మీరు అనుకోవచ్చు, కానీ దుబాయ్ లో అంతే. 6 నెలలు జైలు శిక్ష నే కాకుండా 20 వేల దీరామ్‌ల(4 లక్షల రూపాయిలు) జరిమాన విధించారు. తమాషా కోసం ఆమె ని ఇడియట్ అన్నందుకు సోషల్ మీడియా లో తమాషా అయ్యాడు.

దుబాయ్ లో రూల్స్ అండ్ రేగులేషన్స్ చాలా కఠినం గా ఉంటాయి, ఏ చిన్న తప్పు చేసిన భారీ మూల్యం చెల్లించక తప్పదు, సోషల్ మీడియా లో ఏవైనా తప్పుగా మాట్లాడుతూ మెసేజ్ లు చేస్తే, వాటి మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వారికి జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది.

దుబాయ్ లో ఇలాంటి ఘటనలు కొత్తేమి కాదు, ఇది వరకు చాలా మంది ఇలాగే జైలు పాలయ్యారు. అక్కడ రూల్స్ అండ్ రేగులేషన్స్ కి బయపడి వెనక్కి వచ్చే వారి సంఖ్యా చాలా ఎక్కువ.

No comments