Header Ads

2.0 ని మించిన క్రేజ్ ని సంపాదించుకున్న రజినీకాంత్ నెక్స్ట్ సినిమా..!! సోషల్ మీడియా ని ఊపేస్తున్న పెట్టా.?

2.0 సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్స్ సృష్టిస్తున్న ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాతి చిత్రం అయిన'పెట్టా' సినిమా క్రేజ్ ఇప్పుడు ఆకాశాన్ని అంటింది. కబాలి సినిమా కి ఏ రేంజ్ హైప్ అయితే వచ్చిందో తమిళ్ నాడు లో, ఇప్పుడు పెట్టా కి కూడా అదే రేంజ్ హైప్ వచ్చింది తమిళ్ నాడు లో. ఇటీవల పెట్టా సినిమాలోని రెండు సాంగ్స్ ని చిత్ర యూనిట్ విడుదల చేసారు. 'మాస్ మరణం' , 'ఉల్లాలా' సాంగ్స్ ని విడుదల చేసారు, అనిరుద్ పెట్టా సినిమాకి సంగీతం అందించాడు. విడుదల అయిన రెండు పాటలకి విపరీతమైన స్పందన వచ్చింది. రజినీకాంత్ అభిమానులనే కాదు, సినిమా లవర్స్ ని, మ్యూజిక్ లవర్స్ ని పెట్టా సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.




పెట్టా సినిమా లో రజినీకాంత్ తో పాటు, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధికి కూడా నటిస్తున్నారు. ఇటీవలే వీరి పాత్రలను ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్స్ ని విడుదల చేసారు పెట్టా మూవీ టీం. సన్ పిక్చర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న పెట్టా మూవీ కి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా పెట్టా మూవీ ట్రైలర్ కానీ టీజర్ కానీ విడుదల అవ్వనున్నట్టు సమాచారం.

తమిళ్ నాడు లో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది పెట్టా మూవీ, సంక్రాంతికి అజిత్ హీరో గా నటిస్తున్న 'విశ్వాసం' మూవీ కూడా విడుదల కానుంది. అయితే పెట్టా మూవీ తెలుగు లో వస్తే ఇప్పటికే సంక్రాంతి కి తెలుగు లో వస్తున్న 'వినయ విధేయ రామ', ఎన్టీఆర్ బయోపిక్ 'కథానాయకుడు', 'F2' చిత్రాలకు గట్టి పోటీనిస్తాది. '2.0' చిత్రం కేవలం నైజాం ఏరియా లోనే విడుదల అయిన వారం లో 20CR కి పైగా షేర్ ని వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక పెట్టా మూవీ కూడా సంక్రాంతి కి విడుదల అయితే నైజాం, ఈస్ట్ గోదావరి, నెల్లూరు ప్రాంతాలలో మన తెలుగు సినిమాలకు గట్టి పోటీనివ్వడం కాయం.

No comments