Header Ads

ఈ రోజు: 18-12-2018 (మంగవారం)రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికిబాగుందంటే.?

మేషం :

రచనా వ్యాసంగాలను సాగిస్తారు. గృహాలంకరణలకు ప్రాముఖ్యతనిస్తారు. ఉపయుక్తమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సరస్వతి తిలకం నుదుటున ధరించండి.
మిథునం:

అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు, దుడుకుతనం కలిగి ఉంటారు. చెల్లింపుల విషయమై ఎక్కువగా ఆలోచిస్తారు. ఉత్తమమని భావించిన వ్యవహారాలలో ఇతరులకు జోక్యం తగ్గించడం మంచింది. నాగసింధూరం నుదుటున ధరించండి. నరదృష్టి తొలగుతుంది.

వృషభం:

మీ అభిప్రాయాలతో పెద్దలు కూడా ఏకీభవిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సంతాన విషయమై శ్రద్ధను కనబరుస్తారు. కళాసాహిత్యరంగాల పట్ల మక్కువ మరింతగా పెరుగుతుంది. సుగంధసిద్ధ గంధాక్షితలు పూజలో ఉపయోగించండి.

కర్కాటకం :

శ్రేయోభిలాషులతో చర్చలు సాగిస్తారు. ఆహార నియమాలను పాటించడం చెప్పదగిన సూచన. ప్రయాణాలు లాభిస్తాయి. పరిమళ గంధాన్ని అష్టములికా తైలంలో కొద్దిగా వేసిఉదయం, సాయంత్రం దీపారాధన చేయండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఆర్థికపరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రజాసంబంధాలను మరింతగా వృద్ధి చేసుకుంటారు.ఆశించిన ఋణాలను అందుకుంటారు. ప్రతి విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు.

సింహం :

వాహన మరమ్మత్తులు చేస్తారు. విశాల హృదయంతో వ్యవహరిస్తారు. అందరి పట్ల సమ న్యాయాన్ని కనబరుస్తారు. మంచి వ్యక్తిగా గుర్తింపును పొందుతారు. శుభాకార్యయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార సంస్థలు, గృహంలో దైవికంతో ధూపం వేస్తే అన్నివిధాలా శుభప్రధం.

కన్య :

స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ కుటుంబీకులకు ప్రతి విషయం తెలియజేయటం మంచిది. కార్య సాధనలో ఆత్మవిశ్వాసం, మొండి ధైర్యంతో ముందుకు సాగండి.

తుల :

సొంత నిర్ణయాలను తీసుకుంటారు. దారీతెన్నూ లేని వ్యవహారాలను ఒక గాడిలో పెట్టడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సెంటిమెంట్ విషయాలు కలిసి వస్తాయి. వాహనయోగ సూచన. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి.

వృశ్చికం :

నూతన రంగాల వారితో పరిచయాలు ఏర్పడతాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటారు. ఉత్తరప్రత్యుత్తరాలను సాగిస్తారు. బంధువుల రాక ఆనందానికి కారణమవుతుంది. లక్ష్మీచందనంతో మీ ఇష్ట దైవానికి అభిషేకం చేయండి. స్వార్థ ప్రపంచాన్ని చూసి నివ్వేరపోతారు. పార్ట్ టైం ఉద్యోగాలను సాధించుకోగలుగుతారు.

ధనుస్సు :

క్రీడాకారులు మంచి ఫలితాలను సాధించగలరు. దీక్షా కార్యక్రమాలు చేపడతారు. కప్పు సాంబ్రాణి, అష్టములికా గుగ్గిలంతో వ్యాపార స్థలం, గృహంలో ధూపం వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారపరంగా తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. మిత్రుల సలహాలు, సూచనలను పాటిస్తారు. త్రిశూల్ పొగ వేయటం వల్ల అన్ని విషయాలలో విజయప్రాప్తి కలుగుతుంది.

మకరం :

వినోదాలు, విలాసాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఖర్చులు ఆలోచింప చేస్తాయి. ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. పరిమళ గంధాన్ని అష్టములికా తైలంలో కొద్దిగా వేసి ఉదయం, సాయంత్రం దీపారాధన చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి.

కుంభం :

ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. నూనె, ఎండుమిర్చి, పసుపు, దనియాలు, బెల్లం, శెనగ వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. నిర్మాణ పథకాలలో సంతృప్తి కానవస్తుంది.

మీనం :

శుభవార్తలు వింటారు. సలహాలు, సూచనలు ఇచ్చేవారు అధికంగా ఉంటారు. నిష్కారణంగా నిందారోపణలకు గురి చేస్తున్న వారికి గుర్తిస్తారు. ప్రచారంలో ఉన్న పుకార్లు నిజమని నమ్ముతారు. నాగబంధం ఉపయోగించండి.

No comments