Header Ads

14 -12-2018 శుక్రవారం రాసి ఫలాలు.!!

మేషం :

ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ముఖ్యం. వృత్తి వ్యాపారాలు అన్నివిధాలా కలసివస్తాయి. మీ నిర్ణయాలకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. బంధువుల రాకపోకలు అధికంగా ఉంటాయి. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి.
వృషభం:

స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉన్నా రాబడి విషయంలో సంతృప్తి, పురోభివృద్ధి పొందుతారు. ఇతరులకు హామీలు ఇచ్చే విషయంలోనూ, మధ్యవర్తిత్వ వ్యవహారాలకు దూరంగా ఉండటం అన్నివిధాలా మంచిది. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా ఒత్తిడి, పనిభారం తప్పవు.

మిథునం:

వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి, చేపట్టిన పనులలో సానుకూలతలు ఉంటాయి. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. షేర్ మార్కెట్ రంగాల వారికి మెలకువ అవసరం. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షలలో సఫలీకృతులు కాగలరు. ఖర్చులు అధికం అవుతాయి.

కర్కాటకం : 

ఆస్తి వ్యవహారాలలో ముఖ్యుల మధ్య అవగాహన లోపించటంతో ఒత్తిడికి లోనవుతారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు శుభదాయకం. విద్యార్థులకు విద్యా విషయాలపట్ల ఆసక్తి సన్నగిల్లటంతో ఒత్తిడి, మందలింపులు అధికమవుతాయి.

సింహం :

గృహానికి కావలసిన విలువైన వస్తువులు అమర్చుకుంటారు. వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లను తట్టుకుంటారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

కన్య:

ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగస్తుల హోదా పెరగటంతోపాటు బరువు బాధ్యతలు అధికం అవుతాయి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి.  దీర్ఘకాలిక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం స్ఫురిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.

తుల:

ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. రావలసిన ధనం కొంత మొత్తమైనా చేతికి అందుతుంది.  సాహసించి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. ఆపత్సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహిస్తారు.

వృశ్చికం :

విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. వస్త్ర, బంగారు, ఫ్యాన్సీ, బేకరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు.

ధనుస్సు :

లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల వ్యవహారాలలో పునరాలోచన మంచిది. మీ జీవిత భాగస్వామి సలహా మీకు ఎంతగానో నచ్చుతుంది. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తం అవసరం. స్త్రీలకు ఆరోగ్యంలో మెలకువ అవసరం.

మకరం: 

బ్యాంక్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. మీ ఆశయ సాధనకు ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాలు చికాకులను కలిగిస్తాయి. వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

కుంభం : 

రుణం తీర్చేందుకు చేసే ప్రయత్నం వాయిదా పడుతుంది. ప్రేమికులకు ఓర్పు, సంయమనం చాలా అవసరం. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావటంతో సంతృప్తి చెందుతారు. స్త్రీలు అపరిచితులను అతిగా విశ్వసించటంవల్ల ఆశాభంగానికి గురికాక తప్పదు.

మీనం : 

నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరుల వాహనం నడపటంవల్ల అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.  శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది.

No comments