Header Ads

టాప్-10 ఇండియన్ తెలుగు సినిమాల్లో ఆ రెండు.!! ఒకటి మహానటి అయితే ఇంకొకటి.?

IMDB తాజాగా టాప్ 10 ఇండియన్ మూవీస్ 2018 లిస్ట్ ని విడుదల చేసింది, అందులో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయ్, ఈ సంవత్సరం విడుదలైన తెలుగు సినిమాల్లో మహానటి, భరత్ అనే నేను, రంగస్థలం, గీత గోవిందం, గూఢచారి సినిమాలు ఘన విజయాలు సాధించాయి. IMDB టాప్ 10 ఇండియన్ మూవీస్ 2018 లిస్ట్ లో మహానటి, రంగస్థలం చిత్రాలు చోటు దక్కిన్చుకున్నాయి.




మహానటి సినిమా లో సావిత్రమ్మ పాత్రలో ఒదిగిపోయింది కీర్తి సురేష్, నటన, సంగీతం, దర్శకత్వం ఇలా అన్ని రంగాల వారిని ఈ సినిమా ఆకట్టుకుంది. రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది రంగస్థలం, ఈ సంవత్సరం ఉగాది పండక్కి రిలీజ్ అయిన ఈ చిత్ర హవా సమ్మర్ సెలవులు ముగిసే వరకు నడిచింది, సంగీతం, నటి నటుల నటన, పాత కాలం నాటి పల్లెటూరి వాతావరణానికి కమర్షియల్ టచ్ ఇచ్చిన సుకుమార్ దర్శకత్వం, ఇలా అన్ని రంగాల వారిని రంగస్థలం ఆకట్టుకుంది.

మహానటి చిత్రం 4 వ స్థానం లో నిలవగా, రంగస్థలం 7 వ స్థానం లో నిలిచింది. IMDB టాప్ 10 ఇండియన్ మూవీస్ 2018 పూర్తి జాబితా మీ కోసం :

  •  సంజు (హిందీ)

  • రాజీ (హిందీ)

  • స్త్రీ (హిందీ)

  • రంగస్థలం (తెలుగు)

  • ప్యాడ్ మ్యాన్ (హిందీ)

  • బదాయి హో (హిందీ)

  • మహానటి (తెలుగు)

  • 96 (తమిళం)

  • రట్సాసన్ (తమిళం)

  • అంధాదున్ (హిందీ)

రెండు తమిళ్ సినిమాలు కూడా IMDB టాప్ 10 ఇండియన్ మూవీస్ 2018 లిస్ట్ లో చోటు సంపాదించుకున్నాయి. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 చిత్రం, విష్ణు విశాల్, అమలాపాల్ జంటగా నటించిన రట్సాసన్ చిత్రాలు టాప్ 3 లో స్థానం దక్కించుకున్నాయి. ఇక హిందీ చిత్రాల జాబితా కి వస్తే, ఈ సంవత్సరం ప్రేక్షకుల నుండి, విమర్శకుల మెప్పు పొందిన ఆయుష్మాన్ నటించిన రెండు సినిమాలు బదాయి హో, అంధాదున్ చిత్రాలు టాప్ 5 లిస్ట్ లో నిలిచాయి, అంధాదున్ సినిమా మొదటి స్థానం లో నిలవగా, బదాయి హో 5 వ స్థానం లో నిలిచింది.

No comments