Header Ads

జ‌నం మెచ్చిన క‌లెక్ట‌ర్లు - కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసిన 10 మంది వీరే

ఈ దేశంలో సివిల్ స‌ర్వీసెస్ అంటేనే విప‌రీత‌మైన క్రేజ్‌. ఆ స‌ర్వీసుకు ఉన్న ప‌వ‌ర్ అలాంటిది. చ‌దువులో ఎక్స్‌ప‌ర్ట్స్ క‌లిగిన వారంతా క‌ల‌లు క‌నేది ఒక్క‌సారైనా క‌లెక్ట‌ర్ కావాల‌ని. అధికారం, ప్ర‌జ‌లు, పాల‌కుల‌తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం ఈ ఒక్క‌దానికే ఎక్కువ‌గా వుంటుంది. అందుకే దానికంత‌టి క్రేజ్‌. జిల్లా స్థాయిల‌లో ప‌రిపాల‌న అంతా క‌లెక్ట‌ర్ చేతుల్లోనే న‌డుస్తుంటుంది. ఏ నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా..ఏది అమ‌లు చేయాల‌న్నా..ఏ చ‌ర్య తీసుకోవాల‌న్నా..అన్నీ తానై వ్య‌వ‌హ‌రించే ఒకే ఒక్క అధికారి ఎవ‌రైనా ఉన్నారంటే..అది ఐఏఎస్ మాత్ర‌మే. ఐటీ , హెల్త్ , మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్ సెక్టార్లు ల‌క్ష‌ల్లో జీతాలు ఇస్తామ‌ని ఊరిస్తున్నా..అవ‌కాశాలు క‌ల్పిస్తున్నా ఇండియ‌న్స్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. హోదా, ద‌ర్పం, గౌర‌వం , భ‌ద్ర‌త‌, బాస్ కావాల‌నుకుంటే క‌లెక్ట‌ర్ అనిపించు కోవాల్సిందే.
ఆంగ్లేయుల ప‌రిపాలించిన పాపానికి క‌లెక్ట‌ర్ల వ్య‌వ‌స్థ‌కు అప్ప‌టి నుండే ప్ర‌యారిటీ పెరుగుతూ వ‌స్తోంది. జిల్లా పరిపాల‌నాధికారే కాదు ఏకంగా జిల్లా న్యాయ‌మూర్తి కూడా. ప్ర‌జలు ఎన్నుకున్న ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఐదేళ్ల పాటు మాత్ర‌మే ప‌వ‌ర్ వుంటుంది..కానీ రిటైర్ అయ్యేదాకా వీరు ప‌వ‌ర్‌ను ఎంజాయ్ చేస్తారు. ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ త‌మ డాబును, ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. సివిల్ స‌ర్వీసెస్ ప‌రంగా చూస్తే ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ ఎస్‌, ఐఆర్ ఎస్‌..స‌ర్వీసులున్నా ఎక్కువ ప‌వ‌ర్ ఉన్న‌ది .ఎక్కువ‌గా డిమాండ్ ఉన్న స‌ర్వీస్ ఏది అంటే అది ఐఏఎస్ మాత్ర‌మే. ప్ర‌తి ఏటా ల‌క్ష‌లాది మంది క‌లెక్ట‌ర్లు కావాల‌ని క‌ల‌లు కంటారు. వేలాది మంది రేయింబ‌వ‌ళ్లు గ‌దుల్లో బందీ అయి చ‌దువుకుంటారు. తీరా చూస్తే కేవ‌లం దేశ వ్యాప్తంగా ఓ 800 నుంచి 900 దాకా వుంటారంతే. హెవీ కాంపిటిష‌న్‌. త‌ట్టుకోలేనంత ఒత్తిడి.

రాజ‌కీయ‌ప‌ర‌మైన జోక్యం ఎక్కువైంది ఈ మ‌ధ్య‌న‌. సివిల్ స‌ర్వీసెంట్స్‌కు గౌర‌వం కూడా ఇవ్వ‌డం లేదు కొంద‌రు రాజ‌కీయ నేత‌లు. క‌లెక్ట‌ర్ కు ఉన్న ప‌వ‌ర్ ఏమిటో, త‌న‌కున్న బాధ్య‌తలు, విధులు ఏమిటో గుర్తెరిగిన కొంద‌రు క‌లెక్ట‌ర్లు చెడుగుడు ఆడిన సంద‌ర్బాలు చాలా ఉన్నాయి. 80 శాతంకు పైగా క‌లెక్ట‌ర్లుగా ప‌నిచేస్తున్న వారంతా అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న వారే. వారికి ప్ర‌జ‌లు ఏమై పోతేనేం ప‌ట్టింపు లేదు. ఎంత సేపు మ‌నకు బుగ్గ కారుందా..నా వెనుక సెక్యూరిటీ ఉందా..త‌న‌కు స‌లాం చేస్తున్నారా లేదా అనే చూస్తున్నారు. వీరిలో కొంద‌రు గ‌ర్వంగా ఫీల‌వుతే..ఇంకొంద‌రు మాత్రం ప్ర‌జ‌ల మ‌నుషుల్లో దేవుళ్లుగా కొల‌వ‌బ‌డుతున్నారు. వారిలో శంక‌ర‌న్‌, అనంత‌రాము, వ‌లేవాన్‌, పూనం మాల‌కొండ‌య్య‌, శైల‌జా రామ‌య్య‌ర్‌, స్మితా స‌బ‌ర్వాల్‌, క్రిష్ణ బాస్క‌ర్‌, ముర‌ళి లాంటి వారున్నారు. వీరంతా సింప్లిసిటీని ప్ర‌ద‌ర్శిస్తున్న వారే.

తెలంగాణ రాష్ట్రంలో యంగెస్ట్ క‌లెక్ట‌ర్‌గా దేవ‌ర‌కొండ క్రిష్ణ భాస్క‌ర్‌కు పేరుంది. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా అధికారుల‌ను, సిబ్బందిని నిల‌దీస్తారు. విధుల‌కు ఎగ‌నామం పెడుతూ ..వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ముచ్చెమ‌ట‌లు పోయిస్తున్నారు. గ‌తంలో క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేశారు. క‌రీంన‌గ‌ర్ ఉమ్మ‌డి జిల్లాలో ఆయ‌న పేరెత్తితే చాలు అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. వైద్యం ప్ర‌జ‌ల‌కు అందేలా చూస్తున్నారు. తానే ఎవ‌రికీ తెలియ‌కుండా ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను త‌నిఖీ చేస్తున్నారు. అప్ప‌టిక‌ప్పుడు విధుల‌కు ఆల‌స్యంగా వ‌చ్చే వారిని ముచ్చెమ‌ట‌లు పోయిస్తున్నారు. అక్క‌డిక‌క్క‌డే స‌స్పెండ్ చేస్తున్నారు. డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఇత‌ర సిబ్బంది నిర్ల‌క్ష్యం వ‌హిస్తే స‌హించేది లేదంటూ హెచ్చ‌రిస్తున్నారు. గ్రీవెన్స్ డే సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల‌ను స్వీక‌రిస్తున్నారు.

శ్వేతా మ‌హంతి..మాజీ డీజీపీగా రిటైర్ అయిన మ‌హంతి కూతురు. కొత్త‌గా ఏర్పాటైన వ‌న‌ప‌ర్తి జిల్లా క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. వ‌స్తూనే పాల‌న‌ను గాడిలో పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేశారు. విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఎక్క‌డ ఏ స‌మ‌స్య వ‌చ్చినా త‌న‌కు నేరుగా చెప్పే అవ‌కాశాన్ని క‌ల్పించారు. విధుల‌కు ఎగ‌నామం పెట్టే వారిని క‌ఠినంగా శిక్షించారు. లేటుగా హాజ‌రయ్యే వారిని ముప్పు తిప్ప‌లు పెట్టారు. ప్ర‌జ‌ల కోసం ..ప్ర‌జా సేవ‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇటీవ‌ల సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వ‌హించారు. గ్రీవెన్స్ డే సంద‌ర్బంగా వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను స్వయంగా ప‌రిశీలించి..చ‌ర్య‌లు తీసుకుంటారు. ఎవ్వ‌రైనా ఒక్క ఉత్త‌రం రాస్తే చాలు..వెంట‌నే స్పందిస్తారు. ఆమె ప్ర‌జ‌ల మ‌నిషిగా పేరు తెచ్చుకున్నారు. గ‌తంలో క‌రీంన‌గ‌ర్‌, మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసిన స్మితా స‌బ‌ర్వాల్ ముచ్చెమ‌ట‌లు పోయించారు. పాల‌కుల‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌కుండా ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో వ‌లేవాన్ ప్ర‌కాశం జిల్లా క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. ఆయ‌న ఎవ్వ‌రినీ ప‌ట్టించు కోలేదు. జ‌నంలో క‌లిసి పోయారు. సామాన్యుడు ఎక్క‌డ క‌నిపిస్తే అక్క‌డ వాలిపోయారు. ఆయ‌నను బ‌దిలీ చేస్తే ..జ‌న‌మంతా ధ‌ర్నా చేశారు. ఇదీ ఆయ‌న‌కున్న క్రెడిట్‌. గిరిధ‌ర్ ..పేరు చెబితే చాలు అధికారులు ద‌డ‌ద‌డ‌లాడి పోతారు. అంత‌లా ఆయ‌న ప‌నిచేశారు.

ఇక దేశ వ్యాప్తంగా 2017లో 10 మంది క‌లెక్ట‌ర్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసింది. అత్యున్న‌త‌మైన స‌ర్వీసులు అందించ‌డ‌మే కాకుండా వినూత్నంగా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినందుకు వారిని ఘ‌నంగా స‌త్క‌రించింది. వారిలో కేర‌ళ‌కు చెందిన ప్ర‌శాంత్ నాయ‌ర్ ఒక‌రు. 2007 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈ క‌లెక్ట‌ర్ ప్ర‌జ‌ల కోసం ప‌నిచేశారు. వారి మెప్పు పొందారు. సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీశారు. పోమా తుడు ..ఒడిస్సాకు చెందిన ఈ క‌లెక్ట‌ర్ నౌపాడా జిల్లా క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. జ‌నం కోసం ఆమె బ‌తికారు. గ్రీవెన్స్ సెల్ ద్వారా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్క‌రించారు. ప్ర‌జ‌ల మ‌నిషిగా పేరొందారు. సురేంద్ర కుమార్ సోలంకి..రాజ‌స్తాన్‌కు చెందిన ఈ ఐఏఎస్ జ‌నం మెచ్చిన దేవుడిగా ప‌నిచేశారు. మీర్ మ‌హ‌మూద్ అలీ..ఈ యంగ్ ఐఏఎస్ ఆఫీస‌ర్ కు ప్ర‌జ‌లంటే అభిమానం. స‌ర్వీస్ అంటే పిచ్చి. కేర‌ళ‌కు చెందిన ఈ అధికారి క‌న్నూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా ..ప్లాస్టిక్ వినియోగం లేని జిల్లాగా మార్చేశాడు. ఎక్క‌డ చెత్త క‌నిపించినా ఆయ‌న తీసి వేస్తారు. ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త కోసం పాటుప‌డుతున్నారు. ప‌రిక‌పాండ్ల న‌ర‌హ‌రి మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి. ఆయ‌న కూడా ప్ర‌జ‌ల మ‌నిషిగా పేరు తెచ్చుకున్నారు.

భార‌తీ హొలికేరి..ఈ యంగెస్ట్ ఐఏఎస్ అధికారి వెరీ వెరీ స్పెష‌ల్‌. చంటి పిల్ల‌లు, త‌ల్లుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లాలోని అన్ని గ్రామాల్లో, పీహెచ్‌సీల్లో భోజ‌న ఏర్పాట్లు చేశారు. వైద్యం కోసం వ‌చ్చే ఏ రోగికి క‌ష్టం క‌ల‌గ కూడ‌ద‌న్న ఆమె ఆలోచ‌న ఎంద‌రికో స్ఫూర్తిగా నిలిచింది. పీఎస్ ప్ర‌ద్యుమ్న‌..ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ని ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మైన పేరు. ప‌రిపాల‌న‌లో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు ఈ ఐఏఎస్‌. ప్ర‌తి కుటుంబానికి టాయిలెట్ ఉండాల‌ని ..ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేశారు. స‌క్సెస్ అయ్యారు. ఇపుడు ఆయ‌న పేరు అక్క‌డ మారుమ్రోగుతోంది. సౌర‌భ్ కుమార్‌..ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో గొప్ప‌నైన ప‌రిపాల‌నాద‌క్షుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న కూడా ప్ర‌జా సేవ‌కు అంకిత‌మ‌య్యారు. రోనాల్డ్ రోస్‌..మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ గా నిజాయితీ క‌లిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప‌చ్చ‌ద‌నం ..హ‌రిత‌హారంకు ప్ర‌త్యేక‌త ఇచ్చారు. స‌క్సెస్ ఫుల్ క‌లెక్ట‌ర్‌గా పేరొందారు.

కేర‌ళ‌లోని సేలం జిల్లా క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న రోహిణి ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే అధికారిణిగా త‌క్క‌వ స‌మ‌యంలోనే గుర్తింపు పొందారు. ఆ జిల్లా ప్ర‌జ‌ల‌కు ఆమె ఓ దేవ‌త‌. ఎక్క‌డా డాబు..ద‌ర్పం ప్ర‌ద‌ర్శ‌కుండా ..సామాన్య‌మైన ..సాధార‌ణ జీవితాన్ని గుడుపుతూ..ప్ర‌జ‌ల మెప్పు పొందారు. అన్ని శాఖ‌ల‌ను గాడిలో పెట్టారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆమె ప‌నితీరును మెచ్చుకున్నారు. ఇలాంటి డైన‌మిక్ క‌లెక్ట‌ర్లు తెలంగాణ‌లోని అన్ని జిల్లాల‌కు వుంటే దేశంలో మ‌న‌మే నెంబ‌ర్ వ‌న్‌గా నిలుస్తాం క‌దూ..ఏమైనా ప్ర‌జ‌ల‌ను ప్రేమించే వాళ్లు కావాలి.

No comments