Header Ads

ఈ రోజు: 04-12-2018 (మంగళవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికిబాగుందంటే.?

మేషం:

తెల్లటి దుస్తులు ధరించడం వల్ల మంచి జరుగుతుంది,దాన ధర్మాలు చేస్తారు,ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి,ఆర్ధిక లవ దేవీలు మధ్యాహ్నం పూట పెట్టుకోకండి.
వృషభం:

నలుపు వస్త్రం తప్ప వేరే ఏ రంగు దుస్తులు అయిన ధరించవచ్చు,దాంపత్య జీవితాల్లో కొట్లాటలు వస్తాయి, అమ్మ నాన్న, బంధు మిత్రులతో తగాదాలు అవుతాయి,అనుకోని ప్రయాణాలు ఉంటాయి.

మిథునం:

నీలి రంగు దుస్తుల్ని ధరించండి,నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది,నూతన వ్యాపారాలు మొదలు పెట్టకండి, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

దాంపత్య జీవితాంలో అలజడి మొదలవుతుంది,ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తాయి,దాన ధర్మాలు చేస్తారు, అనుకోకుండా ఆప్తమైన వాళ్ళని కలుస్తారు, స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి.

సింహం:

ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని పాత వ్యవహారాలు చక్కబడతాయి. ఇతరుల వ్యవహారాలలో మౌనం పాటించడం మంచిది. దైవ కార్యక్రమాలను వాయిదా వేయకండి. జాగ్రత్తగా ఉండండి.

కన్య:

చిరు వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. కోళ్ళు, గొఱ్ఱెలు, మత్స్యు వ్యాపారస్తులకు ఆందోళన చికాకులు తప్పవు. మీ సృజనాత్మక శక్తికి, మీ తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది.

తుల:

సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. ముఖ్యమైన సాంప్రదాయాలు పాటిస్తారు. ఆత్మీయులకు మీ సమస్యలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉంది. నూతన వ్యాపారాలకు ప్రయత్నిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు.

వృశ్చికం:

బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధించగలుగుతారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు ఆహార వ్యవహారాలలో ఏకాగ్రత వహించండి.

ధనుస్సు:

మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశం కలిసి వస్తుంది. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతు, మార్పులు చేర్పులకు అనుకూలం. నూతన ఒప్పందాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పట్టుదలతో శ్రమిస్తే కానిపనులు నెరవేరగలవు.

మకరం:

ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. గృహమునకు కావాలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. నూతన పరిచయాలేర్పడతాయి.

కుంభం:

స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ కుటుంబీకులకు ప్రతి విషయం తెలియజేయటం మంచిది. కార్య సాధనలో ఆత్మవిశ్వాసం, మొండి ధైర్యంతో ముందుకు సాగండి.

మీనం:

ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. నూనె, ఎండుమిర్చి, పసుపు, దనియాలు, బెల్లం, శెనగ వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. నిర్మాణ పథకాలలో సంతృప్తి కానవస్తుంది.

No comments