Header Ads

ఈ రోజు: 03-12-2018 రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?

మేషం:

ప్రయాణాలలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. మిత్రుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. వైద్యులు విశ్రాంతి పొందుతారు. కుటుంబ సమస్యలను పట్టించుకోకుండా ఇతరులకు సహాయం చేస్తారు.




వృషభం:

ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఖర్చులు పెరిగినా ఆర్థిక స్థితిలో ఏమాత్రం లోటుండదు. రాజకీయాలలో ఊహించని అవరోధాలు తలెత్తిన నెమ్మదిగా సమసి పోతాయి. గతకాలం జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిదని గమనించండి.

మిథునం:

వ్యాపార వ్యవహారాలలో దక్షత చూపుతారు. స్త్రీలు పట్టుదలతో సామర్ధ్యాన్ని రెట్టింపు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెద్దలను, ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది.

కర్కాటకం:

నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల రాకతో సందడి కానవస్తుంది. కోళ్ళు, గొఱ్ఱె, మత్య్సు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమికులకు కొత్తకొత్త ఆలోచనలు వస్తాయి. రావలసిన బకాయిలు వాయిదా పడుట వలన ఆందోళనకు గురువుతారు.

సింహం:

చిరు వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. కోళ్ళు, గొఱ్ఱెలు, మత్స్యు వ్యాపారస్తులకు ఆందోళన చికాకులు తప్పవు. మీ సృజనాత్మక శక్తికి, మీ తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది.

కన్య:

ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని పాత వ్యవహారాలు చక్కబడతాయి. ఇతరుల వ్యవహారాలలో మౌనం పాటించడం మంచిది. దైవ కార్యక్రమాలను వాయిదా వేయకండి. జాగ్రత్తగా ఉండండి.

తుల:

సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. ముఖ్యమైన సాంప్రదాయాలు పాటిస్తారు. ఆత్మీయులకు మీ సమస్యలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉంది. నూతన వ్యాపారాలకు ప్రయత్నిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు.

వృశ్చికం:

స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ కుటుంబీకులకు ప్రతి విషయం తెలియజేయటం మంచిది. కార్య సాధనలో ఆత్మవిశ్వాసం, మొండి ధైర్యంతో ముందుకు సాగండి.

ధనుస్సు:

మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశం కలిసి వస్తుంది. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతు, మార్పులు చేర్పులకు అనుకూలం. నూతన ఒప్పందాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పట్టుదలతో శ్రమిస్తే కానిపనులు నెరవేరగలవు.

మకరం:

ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. నూనె, ఎండుమిర్చి, పసుపు, దనియాలు, బెల్లం, శెనగ వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. నిర్మాణ పథకాలలో సంతృప్తి కానవస్తుంది.

కుంభం:

బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధించగలుగుతారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు ఆహార వ్యవహారాలలో ఏకాగ్రత వహించండి.

మీనం:

ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. గృహమునకు కావాలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. నూతన పరిచయాలేర్పడతాయి.

No comments