Header Ads

అరెంజ్డ్ మ్యారేజ్ V/S లవ్ మ్యారేజ్.రెండిట్లో ఏది బెస్ట్..? తప్పక తెలుసుకోండి.?

పెళ్లి. పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోడమా ఆ లేక ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోడమా?. పెళ్ళికి ముందు చాలా మందికి ఉండే సందేహాలు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే యువత కు ఎక్కువ ఆసక్తి ఈ విషయం లో.




నాకు తెలిసిన ఒక 4 పెళ్లి అయిన జంటల కథలు :

1.) సాయి అనే వ్యక్తి, వాళ్ల ఇంట్లో వాళ్ళు చుసిన సంబంధం చేసుకున్నాడు, అమ్మాయి పేరు నవ్య, పెళ్లి అయిన రెండు నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు, నీ మాట నేనెందుకు వినాలి, నా మాట అంటే లెక్క లేదా అంటూ మొదలైంది, ఒక సంవత్సరం గడిచిన వాళ్ళ మధ్య కొట్లాటలు తగ్గలేదు, ఇద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. కానీ పాప కోసం కూడా ఆలోచించకుండా విడాకులు తీసుకున్నారు .

2.) షోయబ్ అనే వ్యక్తి స్వాతి అనే అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, షోయబ్ ముస్లిం అబ్బాయి, స్వాతి బ్రాహ్మిన్ అమ్మాయి. ఇరువురి ఇంట్లో వాళ్ళ ప్రేమను ఒప్పుకోలేదు, కిందా మీద పడి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది, సంతోషంగా ఉన్నారు, చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా, వాటిని పక్కన పెట్టి సంతోషంగా జీవిస్తున్నారు.


3.) శరత్ అనే అబ్బాయి ఇంట్లో వాళ్ళు చూపించిన అమ్మాయి ని పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయి పేరు ప్రీతీ. పెళ్లి అయిన తరువాత, ఇద్దరు సంతోషంగా కలిసి జీవిస్తున్నారు. పెళ్లి అయి రెండు సంవత్సరాలు అవుతున్న సంతోషంగా జీవిస్తున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు.



4.) గురు అనే అబ్బాయి, జాను అనే అమ్మాయి ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. జాను కి కూడా గురు అంటే ఇష్టమే. ఇద్దరు పెద్ద వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత జాను కి గురు కి ఒకటే కొట్లాటలు, చిన్న కొట్లాట కూడా పెద్దది అయ్యేది. జాను కి ఇక గురు తో కలిసి బ్రతకాలి అని అనిపియ్యలేదు, పెళ్లి అయిన సంవత్సరానికి విడాకులు తీసుకున్నారు, జాను మరొకరిని పెళ్లి చేసుకుంది. జాను ని తలుచుకుంటూ గురు పిచ్చోడు అయిపోయాడు.

ఇప్పుడు ఈ 4 కథల్లో పెద్దలు కుదిర్చిన రెండు పెళ్లిళ్లలో ఒకటి నిలబడింది, ఇంకొకటి ఫసక్. ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు పెళ్లిళ్లలో ఒకటి నిలబడింది, ఇంకొకటి ఫసక్. ఈ కాలం లో అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి, అప్పుడే ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా నిలబడేది.

No comments