Header Ads

అమర్ అక్బర్ ఆంటీనీ V/S టాక్సీవాలా!. రెండిట్లో ఏ మూవీ కి ఎక్కువ క్రేజ్ ఉంది?

'అమర్ అక్బర్ ఆంటోనీ', మరియు 'టాక్సీవాలా' మూవీ ట్రైలర్స్ విడుదల అయ్యాయి. 'అమర్ అక్బర్ ఆంటోనీ', 'టాక్సీవాలా' మూవీ ట్రైలర్స్ కు మంచి స్పందన వచ్చింది. 'రవితేజ' హీరో గా నటిస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం నవంబర్ 16 న విడుదల అవుతుంది. 'విజయ్ దేవరకొండ' నటించిన 'టాక్సీవాలా' చిత్రం నవంబర్ 17 న రిలీజ్ కానుంది, అయితే రెండు చిత్రాలు ఒక రోజు గ్యాప్ తో వస్తుండటం తో ఏ చిత్రం పై చేయి సాధిస్తుంది అనేది ఆసక్తి గా నెలకొంది.



అమర్ అక్బర్ ఆంటోనీ ట్రైలర్:

https://youtu.be/s3Q6AM4MDs4

వరుస పరాజయాలు చవి చుసిన 'శ్రీను వైట్ల', ఎలాగైనా 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం తో హిట్ కొట్టాలని చాలా కసిగా ఉన్నాడు, రవి తేజ నటించిన 'రాజా ది గ్రేట్' చిత్రం సూపర్ హిట్ అయ్యింది. 'రాజా ది గ్రేట్' చిత్రం తరువాత రవితేజ హీరో గా నటించిన 'టచ్ చేసి చూడు', 'నేల టికెట్' చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా విఫలమయ్యాయి. 'రవి తేజ', 'శ్రీను వైట్ల' కాంబినేషన్ లో ఇది వరకు వచ్చిన 'వెంకీ', 'దుబాయ్ శ్రీను' చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచిపోయాయి, మైత్రి మూవీ మేకర్స్ 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రాన్ని నిర్మించారు,'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం లో ఇలియానా హీరోయిన్ గా నటించింది, ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదల అవుతున్న ఈ చిత్రం, ఆ అంచనాలను అందుకొని విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

టాక్సీవాలా ట్రైలర్:

https://youtu.be/9KN3dbZVRwQ

'గీత గోవిందం' చిత్రం ఘన విజయం తరువాత, 'నోటా' మూవీ తో డిసాస్టర్ అందుకున్నాడు. 'టాక్సీవాలా' చిత్రం పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు 'విజయ్ దేవరకొండ'. ప్రస్తుతం తనకి ఉన్న క్రేజ్ కి హిట్ టాక్ వచ్చినా చాలు, కలెక్షన్స్ దున్నడం కాయం. డిఫరెంట్ కథ తో 'టాక్సీవాలా' ని తెరకెక్కించాం అని విజయ్ చెప్పాడు. UV క్రియేషన్స్ మరియు గీత ఆర్ట్స్ 'టాక్సీవాలా' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం లో 'ప్రియాంక జవాల్కర్' అనే తెలుగు అమ్మాయి విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం తో విజయ్ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వస్తాడని ఫాన్స్ నమ్మకంతో ఉన్నారు.

ఈ రెండు సినిమాల తరువాత 2.0 వరకు మారే ఇతర బడా సినిమాలు లేకపోవడం తో హిట్ టాక్ వస్తే ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ దెగ్గర దుమ్ము దులపడం పక్కా...

No comments