Header Ads

“నాగుల చవితి” అని పుట్టలో పాలు పోయడానికి వెళ్లారు…పాము బయటకొచ్చే సరికి ఏమైందో తెలుసా..? [VIDEO]

పుట్టలో పాలు పొస్తుంటే నాగదేవత ప్రత్యక్షం కావడం,భక్తుల కోరికలు తీర్చడం సినిమాల్లో చూస్తుంటాం.సరిగ్గా అలాగే ప్రత్యక్షమయింది పాము ఒకచోట.కానీ పామును చూడగానే భక్తులు భయంతో పారిపోయారు . నాగుల చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పుట్టల వద్ద సందడి నెలకొంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలో పుట్ట వద్ద పూజలు చేసి.. పాలు, గుడ్లు వేయగానే ఓ పాము బయటకు వచ్చింది. అయితే, మరికొందరు దానిని వీడియో తీసి షేర్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు వాట్సాప్‌లో వైరల్‌గా మారింది.




నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు వెళ్లిన భక్తులకు ఊహించని షాక్‌ తగిలింది.పుట్టలో పాలు పోస్తుండగా ,లోపలున్న పాము ఒకటి బయటకు వచ్చింది. ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో భక్తులు అక్కడ నుంచి పరుగులు తీసారు..ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో చోటుచేసుకుంది. నాగులచవితి పర్వదినం సందర్భంగా మహిళలు… పుట్టలో పాలు పోసేందుకు వచ్చారు. పూజల చేసిన అనంతరం పుట్టలో పాలు పోయడంతో ఒక్కసారిగా పాము బయటకు వచ్చింది. దీంతో బిత్తరపోయిన మహిళలు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు.మరికొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లొడ్ చేసారు.తమ పూజలకు కరుణించి నాగారాజే ప్రత్యక్ష్యం అయ్యాడని కొందరి భావించారు,

మరోవైపు పండగలు రాగానే పుట్టల్లో పాలు పోసి వాటిని బతకనివ్వట్లేదని కొందరు గగ్గోలు పెడుతుంటే..ఈ ఘటన లోపలున్న వాటిని ప్రశాంతంగా బతకనివ్వకపోతే అవి మాత్రం ఎక్కడికెళతాయి..అంటూ ప్రశ్నిస్తున్నారు.

Watch Video Here:

https://youtu.be/0KMML2Fe6og

No comments