Header Ads

నాకు సహకరిస్తే నెలకు RS.2,50,000 ఇస్తా అన్నాడు, పిల్లోల్ల కోసం తప్పలేదు, అందుకే ఒప్పుకున్నా:

19 సంవత్సరాల వయసుకే పెళ్లి చేసారు.

నా పేరు శాంతి, ఊరు గుంటూరు. నాకు పెళ్లి అయి 10 సంవత్సరాలు అవుతుంది, నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు పెళ్లి చేసారు, మా ఆయన నాకంటే 10 సంవత్సరాలు పెద్ద, పెళ్లి అయిన 4 సంవత్సరాల వరకు బాగున్నాం, పెళ్ళైన 4 సంవత్సరాలకే నాకు 3 పిల్లలు పుట్టారు, ముగ్గురు అబ్బాయిలే.




అక్రమ సంబంధం పెట్టుకున్న, విడాకులు ఇవ్వు:

ఏమైందో ఏంటో తెలీదు కానీ, మా అయన నా పైన కోపడటం మొదలెట్టాడు, ప్రతి చిన్న విషయానికి కసిరించుకోడం, తిట్టడం మొదలెట్టాడు, ఇలాగె ఓక రెండు సంవత్సరాలు చేసాడు. అప్పటికే మాకు పెళ్లి అయి 6 సంవత్సరాలు అయ్యింది, మా ఆయన కావాలనే చేస్తున్నాడని నాకు అనిపించింది, వెంటనే అయన దెగ్గరికి వెళ్లి డివోర్స్ కావాలా అని అడిగా, అడిగిన వెంటనే సంతోషం తో పొంగిపోయి "అవును నాకు డివోర్స్ కావాలి, నీతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు, రెండేళ్ళనుండి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న, ఇప్పుడు నువ్వు నాకు విడాకులు ఇస్తే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా" అని నా మొకం మీదే చెప్పాడు మా ఆయన.

నీకంటే మంచి వాడిని చూసి పెళ్లి చేసుకుంటా:

ఆయన కోరిక మేరకే నేను విడాకులు తీసుకొని పిల్లోలని తీసుకొని ఆయనకు దూరంగా వెళ్ళిపోయా, వెళ్తూ వెళ్తూ కోపంలో నీకంటే మంచి వాడిని చూసి పెళ్లిచేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయా, విడాకులుతీసుకున్న మరుసటి రోజే ఇంకో అమ్మాయి ని పెళ్లి చేసుకున్నాడు.

ఉద్యోగం కోసం హైదరాబాద్ కు:

పిల్లోళ్లకి తోడుగా ఒకరు ఉంటె బాగుంటుంది అని నేను అనుకున్న, అప్పటికి నాకు 25 సంవత్సరాలు, ఇంట్లో వాళ్ళు కూడా ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే అభ్యంతరం చెప్పలేదు, కానీ నాకంటూ ఓక మంచి ఉద్యోగం వచ్చాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న, పిల్లోళ్లని గుంటూరు లో మా అమ్మ వాళ్ల ఇంట్లో విడిచి పెట్టి హైదరాబాద్ కి ఉద్యోగం కోసం బయల్దేరాను.

నేను చెప్పింది చేస్తే నెలకు RS.2,50,000 ఇస్తా:

అక్కడ మా ఫ్రెండ్ ఒక్క అమ్మాయి వాళ్ళ ఆఫీస్ లో నాకు ఉద్యోగం చూసింది, ఇంటర్వ్యూ కి హాజరు అవ్వు, నువ్వు కచ్చితంగా సెలెక్ట్ అవుతావు అని మా ఫ్రెండ్ చెప్పింది. ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు నా ఫామిలీ డీటెయిల్స్ అడిగాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పా, నేను విడాకులు తీసుకున్నా అని చెప్పిన వెంటనే, మీరు నుండి నువ్వు అనే పిలుపుకి వచ్చాడు, ఇంటర్వ్యూ అంతా అయిపోయాక, నువ్వు సెలెక్ట్ అయ్యావ్. కానీ, నాకు సహకరిస్తే నెలకు RS.2,50,000. ఇస్తా, లేదంటే నీకు ఈ ఉద్యోగం దక్కదు అని చెప్పాడు. అతను ఆలా అడిగిన వెంటనే తనని చెప్పుతో కొట్టాలనిపించింది, కానీ ముగ్గురు పిల్లోలా బాగోగులు చూసుకోవాలి అంటే నాకు మంచి ఉద్యోగం తప్పని సరిగా కావాలి, చేస్తుంది తప్పని తెలిసిన తప్పలేదు.

నన్ను పెళ్లి చేసుకుంటావా?

4 సంవత్సరాల పాటు అతనితో తిరిగా, పిల్లలు ముగ్గురిని మంచి హాస్టల్ లో చేర్పించా, చాలా మంది నన్ను చాలా రకాలుగా అనుకున్నారు, కానీ నేను పట్టించుకోలేదు. అతను నాతో తప్ప వేరే అమ్మాయి తో మాట్లాడేవాడు కాదు, డ్యూటీ సమయాల్లో నన్ను అస్సలు ఇబ్బంది పెట్టే వాడు కాదు. ఇటీవల, నన్ను పెళ్లిచేసుకుంటావా అని అడిగాడు, నాకు ఒక్కసారిగా మాటలు రాలేదు, "నీ పిల్లలని నా పిల్లలుగా చూసుకుంటా, నీకు జీవితాంతం అండగా ఉంటా, ఇంటర్వ్యూ చేసిన రోజు తను కావాలనే ఆలా మాట్లాడినా అని, పిల్లోళ్ల కోసం పరాయి మొగాడితొ తిరగడానికి సిద్ధ పడ్డావ్ చూడు, అక్కడే నువ్వు నాకు నచ్చావ్. ఆ రోజు ఆలా మాట్లాడినందుకు నన్ను క్షమించు, నా ప్రేమను అంగీకరించి నన్ను పెళ్లి చేసుకో" అని అన్నాడు.

No comments