Header Ads

RrR కీర్తి సురేష్ నటించనుందా.? RrR లో ఎవరి పక్కన హీరోయిన్ గా నటించనుంది..?

మహానటి సినిమా లో సావిత్రమ్మ పాత్రకు ప్రాణం పోసింది కీర్తి సురేష్. మహానటి సినిమా మొదలు కాక ముందు, అసలు కీర్తి సురేష్ సావిత్రి గారి పాత్ర చేయడానికి సరిపోతుందా లేదా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేసారు. సావిత్రి గారి పాత్ర లో కీర్తి సురేష్ ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము అనే విధంగా నటించింది కీర్తి సురేష్,




కీర్తి సురేష్ నటించిన మొదటి తెలుగు సినిమా 'నేను శైలజ' సినిమా సూపర్ హిట్ అయ్యింది, ఆ తరువాత వచ్చిన 'నేను లోకల్' చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఈ సంవత్సరం సంక్రాంతి కి వచ్చిన 'అగ్న్యాతవాసి' చిత్ర ఘోర పరాజయం తో డీలా పడిపోయింది, కానీ 'మహానటి' సినిమా తో యెనలేని కీర్తి ప్రతిష్టలు అందుకుంది కీర్తి. ఆ తరువాత కీర్తి నటించిన తమిళ్ సినిమాలు తెలుగు లో అనువాదం అయ్యాయి. 'సామి-2', 'పందెం కోడి-2', 'సర్కార్' చిత్రాలు తెలుగు లో అంతంత మాత్రం గానే ఆడాయి, ఆ చిత్రాల్లో కీర్తి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు, అందుకనే ఆమె ఇక పైన ఒప్పుకొనే సినిమాల్లో తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఒప్పుకుంటా అంటుంది. రాజమౌళి తీస్తున్న చిత్రం లో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే రాజమౌళి సినిమా అంటే చాలా రోజులు పడుతుంది. వేరే సినిమాల్లో నటించాలి అంటే డేట్స్ కుదరడం కష్టం, అందుకే కీర్తి ఇంకా ఆలోచిస్తుంది అని చెక్కర్లు కొడుతున్న వార్త.

ఒక వేళ RrR లో కీర్తి సురేష్ నటిస్తే ఎవరి పక్కన జోడి గా నటిస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్న గా మారింది. త్వరలోనే రాజమౌళి, RrR లో నటించ బోయే నటి నటుల పూర్తి వివరాలు వెల్లడిస్తారు అని RrR చిత్ర యూనిట్ లో పని చేసే వారు తెలిపారు.

No comments