Header Ads

RRR కధ ఇదే అని చెక్కర్లు కొడుతున్న వార్త, ఇదే నిజమైతే బాగుండు అంటున్న అభిమానులు..RRR చిత్రకధ మీకోసం.!

రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ , జూనియర్ ఎన్.టీ.ఆర్ నటిస్తున్న చిత్ర ప్రారంభోత్సవ వేడుక 11-11-2019 న ఉదయం 11:00 కి జరగనుంది, మొదటి సారిగా మెగా వారసుడు, నందమూరి వారసుడు కలిసి నటించబోతున్నారు, టాలీవుడ్ లో ది బిగ్గెస్ట్ ముల్టీస్టార్ర్ర్ మూవీ ఇదేనని చెప్పొచ్చు. బాహుబలి వంటి బడా చిత్రం తరువాత రాజమౌళి తీస్తున్న చిత్రం ఇదే కాబట్టి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది, 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం 2020 లో విడుదల కానుంది. ఈ చిత్ర కధ గురుంచి రోజుకొక వార్త బైటికి వస్తుంది . ప్రస్తుతం ఈ చిత్రం బ్రిటీషర్ల కాలం నాటి నేపధ్యం లో తెరకెక్కిస్తున్నారని సమాచారం.




దేశం మీద భక్తి తో బ్రిటీషర్ల మీద పోరాటం చేసే యోధులుగా రామ్ చరణ్ , జూనియర్ ఎన్.టీ.ఆర్ నటిస్తారు అని సమాచారం. అయితే బ్రిటిష్ వారి సంపదను కొల్లగొట్టే దొంగ పాత్రలో ఈ చిత్రంలో ఎన్టీఆర్ కనిపిస్తారని , బ్రిటిష్ వారిని ముప్పతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లుతాగించే పాత్రలో యంగ్ టైగర్ రోల్ కీలకంగా ఉంటుందని. బ్రిటిష్ ప్రభుత్వంలో పని చేసే పోలీస్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడని, అయితే బ్రిటిష్ వారి తరుపున పని చేస్తున్నా నరనరాల్లో దేశ భక్తితో ఉండే పాత్రలో చరణ్ కన్పిస్తాడని టాక్ వినిపిస్తోంది.. అయితే సినిమా క్లైమాక్స్ మాత్రం ఎంతో ఉద్వేగభరితంగా ఉంటుందని దేశం కోసం ఏదైనా చేయడానికి సిద్దపడే ఓ ఇద్దరు యోధుల వీర గాధ ఇదని తెలుస్తోంది..మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందొ కానీ మొత్తానికి ఈ స్టొరీ లైన్ మాత్రం అభిమానులని షేక్ చేస్తోంది. నిజంగానే ఈ స్టోరీ లైన్ నిజమైతే 'సై రా నరసింహా రెడ్డి' తరహాలో ఉండబోతుందా లేక దానికి కొనసాగింపుగా ఉంటుందా అనే సందేహాలు మొదలయ్యాయి,

>మెగా స్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న చిత్రం 'సై రా నరసింహా రెడ్డి', లెజెండరీ యాక్టర్ 'అమితాబ్ బచ్చన్', 'కిచ్చ సుదీప్', 'మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి', 'నయనతార' ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి 'సురేందర్ రెడ్డి' దర్శకత్వం వహిస్తున్నాడు, మెగా స్టార్ 'చిరంజీవి' పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ కి విశేషమైన స్పందన వచ్చింది. ఒక వేళా రాజమౌళి తీయబోయే సినిమా ఇదే తరహాలో ఉంటే సినిమా ఓ రేంజ్ లో ఉంటదని, నేషనల్ లెవెల్ లో 'రామ్ చరణ్', 'జూనియర్' ఫేమస్ అయిపోతారని అభిమానులు సంతోష పడుతున్నారు.

No comments