Header Ads

కౌశల్ PMO బాగోతం బయట పెట్టిన మూర్తి గారు. బిగ్ బాస్ కాదు బిగ్ బోగస్ అంటున్న జర్నలిస్ట్ మూర్తి.!!

కౌశల్, బిగ్ బాస్-2 తెలుగు విజేత, బిగ్ బాస్ షో ద్వారా అశేషమైన ఆదరణ పొందాడు కౌశల్. కౌశల్ కి ఉన్న క్రేజ్ గురుంచి మాటల్లో చెప్పలేం, ప్రస్తుతం కౌశల్, జర్నలిస్ట్ మూర్తి గారి వల్ల చిక్కుల్లో పడ్డాడు అనిపిస్తుంది. అసలేం జరిగిందంటే.




బిగ్ బాస్ కాదు బిగ్ బోగస్ అంటున్న జర్నలిస్ట్ మూర్తి:

కౌశల్ కి PMO (ప్రధాన మంత్రి కార్యాలయం) నుండి కాల్ వచ్చిందా అనే విషయం మీద మూర్తి గారు విశ్లేషణ చేసి, PMO ఆఫీస్ నుండి కౌశల్ కి ఎటువంటి కాల్ రాలేదు అని తేల్చేసాడు, PMO ఆఫీస్ వాళ్ళు ఒక పత్రం విడుదల చేసారు, దాన్ని అందరి ముందు బయట పెట్టారు జర్నలిస్ట్ మూర్తి. కౌశల్ తో లైవ్ ఇంటర్వ్యూ లోనే ఈ బాగోతం ని బయట పెట్టారు. ఈ విషయం అయి కౌశల్ ని అడిగితే, "నాకు PMO నుండి కాల్ వచ్చింది అని మా నాన్న గారు చెప్పారు, నేను అందరికి అదే చెప్పాను, ప్రధాన మంత్రి నుండి కాల్ వచ్చిందని నేను చెప్పలేదు, మా నాన్న గారికి కాల్ చేసిన వ్యక్తి ప్రధాన మంత్రి దెగ్గర వర్క్ చేస్తాడు. మీ ఛానల్ నుండి ఎవరైనా వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి కి కాల్ చేస్తే, పలానా ఛానల్ నుండి కాల్ వచ్చిందని చెబుతాడు కానీ, పలానా వ్యక్తి చేసాడు అని చెప్పడు, నేను కూడా అదే చెప్పాను, ఇందులో తప్పేముంది", అని కౌశల్, మూర్తి కి సమాధానం ఇచ్చాడు.

మొత్తానికి కౌశల్ కి PMO ఆఫీస్ నుండి కాల్ వచ్చిందనే విషయం లో నిజం లేదని మూర్తి గారు బయట పెట్టేసారు.

కౌశల్ కి ఫోన్ చేసిన వ్యక్తి మాట్లాడుతూ: "నేను PMO ఆఫీస్ లో పని చెయ్యట్లేదు, కానీ ప్రధాన మంత్రి దెగ్గర పని చేస్తున్నా, నేను చెప్పిన విషయం కౌశల్ వాళ్ళ నాన్నకు సరిగ్గా అర్ధం కాక పోయి ఉండొచ్చు, అందుకే ఇలా జరిగింది, కౌశల్ మంచితనం నాకు నచ్చింది, కౌశల్ ని ప్రధాన మంత్రి దెగ్గరకు తీసుకువెళ్లాలి అనుకున్న. నేను ఇండిపెండెంట్ గా ప్రధాన మంత్రితో దెగ్గర పని చేస్తున్నా కాబట్టి, ప్రధాన మంత్రి కార్యాలయం లో నన్ను పరిగణలోకి తీసుకోరు" అంటూ ఆ వ్యక్తి చెప్పాడు. మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి కౌశల్ కి మచ్చ తెచ్చే లాగ మారింది ఈ ఘటన, ప్రస్తుతం సోషల్ మీడియా లో కౌశల్ మీద చర్చ ఒక రేంజ్ లో సాగుతుంది. రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని విషయాలు బయట పడతాయో చూడాలి.

Watch Video:

https://www.youtube.com/watch?v=7GX3UT21PhE&fbclid=IwAR3eSE0sl7TgV59g1x-rPYHW4DSlYOQ7zPCy1TNG1KnijDyv7gMPS5h0xLg

No comments