Header Ads

ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోతే చెప్పుతో కొట్టండి అంటూ చెప్పులు పంచుతున్న M.L.A అభ్యర్థి.!

తెలంగాణ రాష్త్ర ఎన్నికలు దేగ్గర్లోనె ఉన్నాయ్, నామినేషన్ ల ప్రక్రియ మొదలయ్యి, ఎవరి ప్రచారం లో వాళ్ళు బిజీ గా ఉన్నారు. జగిత్యాల జిల్లా లోని కోరట్ల నియోజకవర్గం లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి చెప్పులు పంచుతూ తనకు వోట్ లు వేయమని కోరుతున్నాడు.




ఔను మీరు చదివింది నిజమే, కోరట్ల నియోజకవర్గం లో ఆకుల హనుమంత్ అనే వ్యక్తి M.L.A గా స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేస్తున్నాడు. ఎన్నికల ప్రచారం లో భాగం గా, నియోజక వర్గ ప్రజలకు చెప్పులు పంచి, వోట్ లు వేసి నన్ను గెలిపియ్యండి, ఒక వేళా మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోక పోతే ఇవే చెప్పులతో నన్ను కొట్టండి, ఎక్కడ పడితే అక్కడ కొట్టండి, నిలదియ్యండి, నేను నియోజక వర్గ అభివృద్ధికి తోడ్పడుతా, ఒక వేళా అభివృద్ధి చేయలేక పోతే, వెంటనే రాజీనామా చేస్తా అంటూ ప్రచారం చేస్తున్నాడు ఆకుల హనుమంత్. ఈ ప్రచారం విచిత్రంగా ఉన్నా, రానున్న రోజుల్లో చాలా మంది ఇటు వంటి ప్రచారాలే చేస్తారు. ఓటర్ లకు నమ్మకం కలగాలి అంటే ఇటువంటివి చేసి తీరాలి, ఆకుల హనుమంత్ చెప్పులు పంచుతున్నప్పుడు వీడియో తీసి సోషల్ మీడియా లో పెట్టారు, ఆ వీడియో ఇప్పుడు రాష్ట్రమంతటా వైరల్ అయ్యింది.

అయితే కోరట్ల నియోజక వర్గం లో గెలవడం అంత సులువైన విషయం కాదు. కోరుట్ల లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సిట్టింగ్ M.L.A సీనియర్ నేత అయిన 'విద్య సాగర్ రావు' గారికి మంచి బలగం, పేరు ఉంది. సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయిన ఆకుల హనుమంత్, నిజ జీవితం లో కూడా అలాగే పాపులర్ అయి, M.L.A గా గెలుస్తాడా లేదో వేచి చూడాలి.

Tweet:

https://twitter.com/Ashi_IndiaToday/status/1065617457434509313

No comments