Header Ads

జూనియర్. ఎన్.టీ.ఆర్ చెల్లెలు రాజకీయాల్లోకి ప్రవేశించనుందా?

నందమూరి హరికృష్ణ గారు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి అందరికి తెలుసు. ఆయన మరణం నందమూరి ఫామిలీ, అభిమానులకే కాదు టీడీపీ పార్టీ సభ్యులకు కూడా తీరని లోటే. అందుకే టీడీపీ సభ్యులు హరికృష్ణ గారి కుటుంబం నుండి అనగా, హరి కృష్ణ గారి కూతుర్ని లేదా కుమారులు అయిన జూనియర్. ఎన్.టీ.ఆర్, కళ్యాణ్రామ్ లలో ఒకరిని ఎమ్మెల్యే గా నిలబెట్టాలని చూస్తున్నారు, జూనియర్. ఎన్.టీ.ఆర్ కు ప్రస్తుతం రాజకీయాల మీద ఆసక్తి లేదు, కళ్యాణ్ రామ్ కి కూడా ఎమ్మెల్యే గా పోటీ చేయాలనే ఆలోచన లేదు.



దివంగత నేత హరి కృష్ణ గారి కూతురు సుహాసిని రాజకీయ రంగ ప్రవేశం చేయనుందా?

ఇక హరికృష్ణ కుమార్తె అయిన సుహాసిని ని టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గా పోటీ చేయమని అడిగినట్టు తెలుస్తుంది. కూకట్‌పల్లి స్థానం నుండి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. అయితే ఈ స్థానంలో కార్పోరేటర్ మందాడి శ్రీనివాసరావు కూడ పోటీకి సై అంటున్నారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఈ జిల్లా నుండి పెద్దిరెడ్డి గతంలో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. కూకట్‌పల్లి నుండి సుహాసినిని బరిలోకి దింపడానికి పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ, కుటుంబ సభ్యులు ఒప్పుకొంటే కూకట్‌పల్లి నుండి సుహాసినిని బరిలికో దింపే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. టీడీపీ కి బాగా పట్టు ఉన్న ఏరియా లలో ఒకటి అయిన కూకట్‌పల్లి నుండి ఆమెను బరిలోకి దింపే ఆలోచన ఉన్నట్టు ఒక టీడీపీ నేత ఒక న్యూస్ ఛానల్ తో జరిగిన ఇంటర్వ్యూ లో చెప్పాడు, ఈ విషయం అయి చంద్రబాబు ని కూడా సంప్రదించినట్టు, ఆయన సానుకూలంగా స్పందించారని వివరించాడు.

ఒక వేళా కూకట్ పల్లి నుండి కుదరకపోతే లింగంపల్లి నుండి పోటీ చేపిస్తామ్ అని చెబుతున్నారు, కానీ నందమూరి కుటుంబం నుండి ఇంకా ఎటువంటి వార్త అందలేదు, ఒక వేళా సుహాసిని ఎమ్మెల్యే గా పోటీ చేస్తే జూనియర్. ఎన్.టీ.ఆర్ ప్రచారం చేస్తాడో లేదో వేచి చూడాలి, ఇటీవల జరిగిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం విజయోత్సవ వేడుక లో బాలయ్య బాబు, నేను ఉన్న నా అన్నయ్య కుటుంబానికి అంటూ ముందుకు వచ్చాడు. జూనియర్. ఎన్.టీ.ఆర్ బాలకృష్ణ తిరిగి కలవడం తో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

No comments