కట్నం డబ్బుల కోసం భార్య నాలుక కోసేసిన భర్త. ఎవరో తెలుసా?
కట్నం కోసం జనాలను వేదించే వాళ్ళ సంఖ్యా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. కట్నం కోసం కట్టుకున్న భార్యలను వేదించాలి అనే ఆలోచన ఎవడికి వచ్చిందో కానీ, కట్నం కోసం వేధింపులు అనేవి సహజం అయిపోయాయి. అసలు కట్నం ఎందుకు ఇవ్వాలి అని చాలా మంది అంటూవుంటారు. అదొక ఆచారం లాగ తయారు అయ్యింది. అమ్మాయి కి పెళ్లి అయ్యాక అత్త గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో పంపకుండా, బంగారం, డబ్బులు, సామాన్లు ఇచ్చి పంపిస్తారు తల్లి తండ్రులు. ఇది కేవలం తల్లి తండ్రులకి తమ అమ్మాయి మీద ఉన్న ప్రేమ నే, కానీ దీనికి కట్నం అని ఒక పేరు పెట్టి, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్లకు కట్నం ఇవ్వాలి అనేట్టుగా మార్చారు.
డబ్బుల కోసం ఆశ పడి పెళ్లి చేసుకొని, డబ్బుల కోసం కట్టుకున్న భార్యను హింసిస్తూ ఉంటారు కొందరు మృగాలు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం జరిగింది. కట్నం కోసం జరిగిన గొడవలో ఓ భర్త తన భార్య నాలుకను కోసేశాడు. కాన్పూర్ కు చెందిన ఆకాశ్ కట్నం కోసం గత 10 రోజుల నుంచి భార్యను గృహ నిర్భంధం చేశాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి అక్కడికి వచ్చి ఆమెను విడిపించాడని పోలీసులు తెలిపారు. తర్వాత జరిగిన గొడవలో నిందితుడు ఆకాశ్ భార్య నాలుకను కోసేశాడని.. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పారు. ఘటనకు సంబంధించి భర్త ఆకాశ్ పై కేసు నమోదు చేశామన్నారు. అయితే కంప్లైంట్ చేసిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకోలేదని.. నిందితుడి తండ్రి పోలీస్ కావడంతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. దీంతో ఘటన పై స్పందించిన సీనియర్ పోలీస్ సూపరిండెంట్.. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందరు డబ్బుల కోసం కట్టుకున్న భార్యను వేధించరు. కొన్ని కొన్ని ఇళ్లల్లో భార్యలే భర్తలను వేధిస్తూ ఉంటారు. కానీ అలంటి విషయాలు బయటికి రావు, కానీ భార్యలను వేదించే భర్తల సంఖ్యా ఎక్కువగానే ఉంటాది.
Great post and success for you..
ReplyDeleteKontraktor Pameran
Kontraktor Booth Pameran
Jasa Pembuatan Booth
Jasa Dekorasi Booth Pameran