బేబీ కు మేమున్నాం అని ముందుకొచ్చిన మెగా స్టార్ చిరంజీవి.!!
తెలుగు ప్రజలకు ఒకప్పుడు బేబీ అనే పేరు వినిపిస్తే బేబీ అంటే పాప అనే వాళ్ళు, సంగీత ప్రియులకు బేబీ అంటే జస్టిన్ బీబెర్ పాడిన బేబీ పాట గుర్తు వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం బేబీ అనే పేరు వింటే, ప్రేమికుడు చిత్రం లోని 'ఓ చెలియా నా ప్రియా సఖియా' పాట పాడిన బేబీ నే గుర్తుకు వస్తారు. చదువు రాకపోయినా. సంగీత జ్ఞానం లేకపోయినా, కేవలం తన స్వరం తో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను మంత్ర ముగ్దుల్ని చేసేసింది, ఆమె పాడిన పాట సోషల్ మీడియా లో వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే, ఏ.ఆర్.రెహమాన్ మొదలు సంగీత దర్శకుడు కోటి, మెగా స్టార్ చిరంజీవి గారి వరకు అందరూ బేబీ ని మెచ్చుకున్నారు. సంగీత దర్శకుడు కోటి, బేబీ కు సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఇస్తా అని హామీ ఇచ్చారు. మెగా స్టార్ చిరంజీవి, బేబీ ని ఇంటికి ఆహ్వానించాడు, సంగీత దర్శకుడు కోటి తో కలిసి మెగా స్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు బేబీ.
Post a Comment