Header Ads

లాటరి డెబ్భతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇంతకీ ఎవరంటే..?

రాత్రికి రాత్రి కోటీశ్వరులు అనే పదం చాలా అరుదుగా వింటూ ఉంటాం, ముఖ్యంగా సినిమాల్లో ఈ పదాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ నిజ జీవితం లో రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అవ్వాలి అంటే ఏ బ్యాంకు కైనా, కోటీశ్వరుడింటికైనా కన్నం వేయాలి, లేకుంటే లాటరి అయినా తగలాలి, కన్నాలు వేసి దొరికితే జైలు పాలే. కానీ లాటరి మార్గం లో పైసలు వస్తే అవి మనకే.. కానీ లాటరి మార్గం లో పైసల్ అంత సులువుగా రావు, బీభత్సమైన లక్ ఉంటేనే వస్తాయి. అందరూ అంబానీలు కాకపోయినా కనీస సౌకర్యాలైనా కోరుకుంటారు. దానికోసం కష్టపడుతుంటారు. లక్ష్మీ దేవి అంత తొందరగా అందరి తలుపూ తట్టదు. దానిక్కూడా పెట్టిపుట్టాలంటారు. ఎన్ని రోజులు కష్టపడతాము. ఒకసారి అదృష్టాన్ని కూడా పరీక్షించుకుందామనుకున్నాడో ఏమో ఏకంగా 3 లాటరీ టికెట్లు కొన్నాడు. ఒక్కటన్నా తగలకపోద్దా.. నా లక్కు మారకపోద్దా అని ఎదురు చూశాడు.




ఒకటి కాదు రెండు కాదు.. మూడూ తగిలాయి. సులువుగా కోట్లు సంపాదించేశాడు. ఒక్కరోజులో కోటీశ్వరుడు.. కాదు కొన్ని కోట్లకు అధిపతి అయ్యాడు అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన రాబర్ట్ స్టీవర్ట్. కేవలం 24 గంటల వ్యవధిలో మూడు లాటరీలు గెలుచుకుని ఏకంగా 50 లక్షల 600 డాలర్లు (సుమారు రూ.36.24 కోట్లు) గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 2న రాబర్ట్‌కు స్క్రాచ్ లాటరీ గేమ్‌లో 50 లక్షల డాలర్ల (రూ.36.2 కోట్లు) జాక్‌పాట్ తగిలింది. రెండోసారి 500 డాలర్లు(సుమారు రూ.36,380) రాగా, మూడో సారి 100 డాలర్లు( రూ7,276) గెలుచుకున్నాడు.



ఇంత పెద్ద మొత్తం గెలుచుకున్న రాబర్ట్.. న్యూజెర్సీ లాటరీ నిర్వాహకులతో తన పేరు బయటకు చెప్పవద్దని కోరాడు. దీంతో కొంతకాలం ఆగిన లాటరీ నిర్వాహకులు ఇటీవలే రాబర్ట్ పేరుని బయటపెట్టారు. కాగా రాబర్ట్ ఇంతకు ముందు ఇదే ఏడాది మొదట్లో కూడా లాటరీ ద్వారా 2,500 డాలర్లు ( రూ. 1.81 లక్షలు) లాటరీలో గెలుచుకున్నాడు. వద్దంటే వచ్చి పడుతున్న డబ్బుతో అన్నీ సమకూర్చుకున్నాడు. ఇతగాడి పని తీరే బాగుంది, లాటరి లో డబ్బులు సంపాదించడం, సంతోషంగా జీవితం గడపడం, కానీ ప్రతి ఒక్కరికి ఇతగిడికి ఉన్నంత లక్ ఉండదు కదా....

ప్రస్తుతం ఇతగాడు చిన్నపాటి సెలబ్రిటీ ఐపోయాడు సోషల్ మీడియా లో, నీ పేరు మీద మాకు ఒక లాటరి వేయొచ్చు కదా అని బంధువులు, ఇంటి పక్కన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, నెటిజన్లు అందరు రాబర్ట్ ని అడుగుతున్నారు.


No comments