Header Ads

విమానం కొనాలన్న కలని నెరవేర్చుకున్నాడు ఒక రైతు.!

విమానం ఎక్కాలి అని చాలా మందికి ఉంటుంది, డొమెస్టిక్ లెవెల్ లో విమానాలు ఎక్కువ అయ్యేసరికి కొన్ని మార్గాల్లో విమాన చార్జీలు తగ్గు ముఖం పట్టాయి, దాంతో మధ్య తరగతి వాడు విమానాలు ఎక్కడానికి ఆసక్తి కనబరుస్తున్నారు, కానీ విమానం నే కొనాలి అనే కల తీరడం కొంచం కష్టమే, కానీ ఆ కల ని ఒక వ్యక్తి నెరవేర్చుకున్నారు తన జీవితంలో ఎలాగైనా విమానం కొనుక్కోవాలనే తపన ఉన్న ఓ వెల్లుల్లి రైతు, విమానం కొనుక్కొనే స్థోమత లేక దాని ఆకృతిలో కనిపించేలా ఓ నిర్మాణాన్ని రూపొందించుకుంటున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! చైనాకు చెందిన ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఆ దేశానికి చెందిన జు యే అనే వెల్లుల్లి రైతు విమాన ప్రతిరూపాన్ని నిర్మించుకుంటున్నాడు. తన జీవితంలో ఎప్పటికైనా విమానం కొనాలనేది అతని కల. అందులో భాగంగానే ఎయిర్‌బస్‌ ఏ320 విమానాన్ని పోలి ఉండే నమూనా తయారు చేయించుకుంటున్నాడు. రెండేళ్ల నుంచి సాగుతున్న దీని నిర్మాణం దాదాపు తుదిదశకు చేరింది. ఇందుకోసం రైతు ఇప్పటి వరకూ 2.6 మిలియన్‌ యువాన్లు (రూ.2 కోట్లు)వెచ్చించాడు.124 అడుగుల పొడవు, 118 అడుగుల వెడల్పుతో 40 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ విమానం గాలిలోకి ఎగరలేకపోయినా.. తన కల నెరవేరుతున్నందుకు తృప్తిగా ఉందని జు యే అన్నాడు. నిర్మాణం పూర్తయ్యాక దీనిలో ఓ రెస్టారెంటును పెడతానని చెబుతున్నాడు.




విమానం ని పోలి ఉండే రెస్టారెంట్ అంటే కచ్చితంగా జనాకర్షణ ఉంటుంది, కనుక తాను పెట్టిన పెట్టుబడి కి తాను అనుకున్న విమానం ఆ కాకుండా, పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోడానికి రెస్టారెంట్ ఉపయోగ పడుతుంది, కోరిక బలమైనది అయితే ఏదైనా సాదించ వచ్చు అని మరో సారి నిరూపించాడు, అయితే ఇతని మార్గం లోనే కొంత మంది వ్యాపారవేత్తలు పయనం అవుతున్నారని తెలుస్తుంది, వాళ్ళు కూడా విమానము మాదిరిగా రెస్టారెంట్స్ ని కట్టి లాభాలు తెచ్చుకోవాలని చూస్తున్నారు. వ్యాపారవేత్తల ఆలోచనలు ఎంత చురుకుగా ఉంటాయి అంటే, డబ్బు వస్తుంది అనే మార్గాల్లో పెట్టు బడులు పెట్టడానికి వెనకాడరు. అందుకేనేమో వ్యాపార వేత్తలతో తెలివిగా మాట్లాడిన తప్పే అంటారు. అయితే ఈ రైతు లాగానే సామాన్య వ్యక్తులు కూడా ఇదే తరహాలో చేయాలి అనుకుంటున్నారు, ఎందుకంటె కార్, బైక్ లు కొనాలని చాల మందికి ఉంటుంది, కానీ ఫ్లైట్ లు కొనాలని కొంత మందికే ఉంటుంది, ఏదైనా మొదలు పెడితే అనుసరించడం మన వాళ్ళకి అలవాటే, ఈ రైతు భావి తరాలకు ఆదర్శవంతంగా నిలిచిపోతాడు .

No comments