Header Ads

కొత్త ఇండ్లలో నివాసం ఉండే ముందు గృహ ప్రవేశం ఎందుకు చేస్తారో తెలుసా..? ఎలా వచ్చిందంటే.?

ఇప్పుడంటే ఎవరైనా కొత్తగా ఇంట్లో నివాసం ఉండాల్సి వస్తే.. కొత్తింటికి చాలా సింపుల్‌గా వెళ్తున్నారు. కానీ ఒకప్పుడు అలా కాదు. ఆ ఇంటికి గృహ ప్రవేశం చేసే వారు. అనంతరం అందులో ఉండేవారు. అయితే ఇప్పుడీ పద్ధతి లేదు. అసలు గృహ ప్రవేశం అన్నది తగ్గిపోయింది. అయితే అసలు ఈ గృహ ప్రవేశం అన్నది ఎందుకు చేస్తారో, దాని వెనుక ఉన్న కారణం ఏమిటో మీకు తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.




ఏ ఇంటికైనా అది ఉన్న స్థలం ముఖ్యం. ఆ స్థలమే ఆ ఇంటిపై ప్రభావం చూపుతుంది. అందులో ఉండే వ్యక్తుల జీవితాన్ని అది ప్రభావితం చేస్తుంది. దీనికి తోడు ఖాళీగా ఉన్న ఇంట్లో దుష్టశక్తులు నివాసం ఉంటాయట. వాటిని తరిమికొట్టాలంటే శాస్త్రోక్తంగా పూజలు చేయాలి. అలా పూజలు చేస్తే కొత్త ఇండ్లలో ఉండే దుష్ట శక్తులు పోతాయి. అనంతరం అందులో నివాసం ఉండవచ్చు. అందుకే గృహ ప్రవేశం చేస్తారు. ఆ సందర్భంగా పూజలు చేస్తారు. అనంతరం ఇండ్లలోకి ప్రవేశిస్తారు.
ఇక గృహ ప్రవేశం వెనుక ఉన్న మరో కారణం ఏమిటంటే… ఏ మనిషికైనా కోపం, మదం, మాత్స్యర్యం అనే గుణాలు ఉంటాయి. వీటిని పారదోలి అందరితో కలసి మెలసి ఉంటూ, తోటి వారికి సహాయం చేసేలా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించేందుకే గృహ ప్రవేశం చేస్తారు. కనీసం కొత్త ఇంట్లో అయినా ముందు చెప్పిన విధంగా సుఖవంతమైన లైఫ్‌ను గడపాలని కోరుకుంటారు. అందుకే చాలా మంది గృహ ప్రవేశం చేస్తారు..! ఇవీ.. గృహ ప్రవేశం వెనుక ఉన్న అసలు కారణాలు..!

తల్లిదండ్రులతో గృహ ప్రవేశం చేయించొచ్చా.?

ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన గృహ యజమానులు చేస్తారు కదా! అప్పుడు మీ పేరు, నక్షత్రం ఆధారంగా ముహూర్తం నిర్ణయించి ఉంటారు. ఇప్పుడు గృహ ప్రవేశ సమయానికి ఎవరైతే పూజలో కూర్చుంటారో వారి నామ నక్షత్రాల్లోని మొదటి అక్షరాలను తీసుకుని ముహూర్తం నిర్ణయించుకోవాలి. ఈ లెక్కన తల్లిదండ్రులు, అత్తామామలు, అన్నా వదినలు... ఎవరైనా సరే గృహ ప్రవేశం చేయొచ్చు. సిద్ధాంతి గారిని సంప్రదించండి, తగు సూచనలు చేస్తారు.

No comments