Header Ads

అభిమానుల ప్రశ్నలకు ఘాటుగా సమాధానమిచ్చిన రేణు దేశాయ్. పిల్లల పెళ్లి గురుంచి ఇప్పుడు అడగవద్దు-రేణు దేశాయ్.!

పవన్ కళ్యాణ్ తొ విడాకుల తరువాత రేణు దేశాయ్, తన జీవితాన్ని పిల్లోళ్లతో సంతోషంగా గడుపుతుంది. సోషల్ మీడియా లో ఎక్కువ యాక్టీవ్ గా ఉండే రేణు దేశాయ్, ఇటీవల కాలం లో సోషల్ మీడియా లో అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వలేదు, చాలా రోజుల తరువాత సోషల్ మీడియా లో అభిమానులతో ఇంటరాక్ట్ అయిన రేణు దేశాయ్ అభిమానుల పైన ఆగ్రహించింది.




సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి అభిమానులతో పలు విషయాలు ముచ్చటించారు. కొన్ని నెలల క్రితమే రేణు దేశాయ్ రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఓ వ్యక్తితో రేణు దేశాయ్ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ వ్యక్తి ఎవరనే విషయాలు రేణు దేశాయ్ ఇంతవరకు బయట పెట్టలేదు. వివాహం జరిగాక వెల్లడిస్తానని తెలిపింది., తన పెళ్లి గురుంచి, అఖీరా గురుంచి అడగవద్దు అని చెప్పింది, కుటుంబ విషయాల గురుంచి మాట్లాడే సమయం ఇది కాదు అంటూ తాను తెలిపింది. కొంత మంది, కామెంట్స్ లో, వదిన నువ్వు ఇంకో పెళ్లి చేసుకోకు, మా అఖీరా బాబు సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు అంటూ ఇలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు, వారి కామెంట్స్ కి రేణు దేశాయ్ స్పందిస్తూ, ప్రస్తుతం ఈ విషయాలను నేను పెద్దగా పట్టించుకోదలచుకోలేదు, దయ చేసి ఈ విషయాల గురుంచి అడగకండి, వేరే విషయాల గురుంచి మాట్లాడుకుందాం అని రేణు దేశాయ్ తెలిపారు.

No comments