Header Ads

హైదరాబాదీ. క్రికెటర్ తెలంగాణ బిడ్డ మహమ్మద్ అజారుద్దీన్ గారి గూరించి.!

ప్రపంచాన్ని ఉద్విగ్న పరిచి కోట్లాది అభిమానుల గుండెల్లో మంటలు రేపి కుల, జాతి , మతాలకు అతీతంగా ప్రాంతాల సరిహద్దులను చెరిపేసే అరుదైన ఆటల్లో క్రికెట్ ముందుంటుంది. అలాంటి క్లిష్టమైన ఆటలో నెగ్గుకు రావాలంటే చాలా కష్టపడాల్సిందే. ఇలాంటి ఫీట్ ను సాధించిన కొద్దిమంది ఆటగాళ్లలో మహమ్మద్ అజారుద్దీన్ మొదటి వాడు. పక్కా హైదరాబాదీ. పక్కా తెలంగాణా బిడ్డ. ప్రపంచాన్ని శాసించిన వారిలో , లోకాన్ని ప్రభావితం చేసిన మహనీయులు , వ్యక్తులులీడర్లలో . అన్ని రంగాలలో అరుదైన వారిని దగ్గరుండి చూస్తే కొన్ని బలహీనతలు కనిపిస్తాయి. అలా అని వారిని మనం పక్కన పెట్టలేం. చూసుకుంటూ పోతే, పరిశీలిస్తే విజయం సాధించిన వారిలో ఏదో ఒక లోపం ఉంటుంది. అది కాదనలేని సత్యం. దానినే ప్రామాణికంగా తీసుకుంటే ఈ అరుదైన ఆవిష్కరణలు వచ్చేవి కావు. కాలపు ప్రవాహంలో మార్పు సహజం. భిన్నమైన మతాలు, కులాలు , జాతులు కలిగిన ఈ దేశాన్ని ఒకే భారతీయ జెండా కిందకు తీసుకువచ్చిన ఘనత క్రికెట్ కే చెల్లింది. సంపన్న వర్గాలకే పరిమితమైపోయిన క్రికెట్ ను భూమార్గం పట్టించిన చరిత్ర మన అజ్జూ భాయ్ దే. అటు టెస్ట్ క్రికెటర్ గా ఇటు వన్ డే క్రికెట్ కే వన్నె తెచ్చిన ఆటగాడిగా అతడికి పేరుంది. అత్యంత ప్రమాదకరమైన బౌలర్లను ఎదుర్కొని ముంబై ఆధిపత్యాన్ని తుత్తునియలు చేసిన ఘనత ఆయనదే. టెస్ట్ అరంగ్రేటం లోనే మూడు ముచ్చటైన సెంచరీలతో వరల్డ్ రికార్డ్ లను బద్దలు కొట్టిన ఆటగాడు ఆయనే. అలా ఆటగాడిగా మొదలైన అజహర్ ప్రస్తానం కొన్నేళ్లుగా సాగింది. ప్రపంచం నివ్వెర పోయింది అతగాడి ఆటను చూసి. మణికట్టు మాంత్రికుడిగా అతడి చేతుల్లోని ఆటతనపు మాయాజాలానికి కోట్లాది ప్రజలు క్రికెట్ అభిమానులుగా మారిపోయారు. దేశం అతడిని గౌరవంగా చూసింది. ఫీల్డర్ గా , బాట్స్ మెన్ గా , బౌలర్ గా , ఆల్ రౌండర్ గా ఇలా ఎన్నో ఫార్మాట్ లలో అజహరుద్దీన్ రాణించాడు. భారత క్రికెట్ రాజకీయాలను తట్టుకుని బాంబే వాలాల కుయుక్తులను దాటుకుని తనను తాను మల్చుకున్నాడు. అంతేనా దేశపు జట్టుకు అరుదైన విజయాలను తెచ్చి పెట్టాడు. అతడి పేరు మీద ఎన్నో రికార్డులు , మరెన్నో అవార్డులు .లెక్కలేనన్ని గెలుపులు, పురస్కారాలు ఇదంతా ఒక ఎత్తైతే అతడి నడక , మాట , ఆట అన్నీ మణికట్టు పోలికలే .విజయపు శిఖరం అంచున నిలబడిన అజహరుద్దీన్ అనూహ్యంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కున్నాడు . జీవితపు కాలం నిషేధం నుండి బయటపడ్డాడు. ఆ దశలో ఇంకొకరైతే ఈ ప్రపంచం నుంచి తప్పుకునే వారే. కానీ ఆయన అలా చేయలేదు . తప్పును సరిదిద్దుకున్నాడు . ఎంపీగా గెలుపొందాడు. అదే సమయంలో ప్రాణానికి ప్రాణమైన కొడుకును పోగొట్టుకున్నాడు. బహుశా ఇది అజ్యూ భాయ్ కి కోలుకోలేని దెబ్బ. అయినా హైదరాబాద్ వాసులు ఆయనకు అండగా నిలబడ్డారు. తమలో దాచుకున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మన అజహరుద్దీన్ మనకే సొంతం. అతడు లేని భారత క్రికెట్ ను ఊహించుకోలేం. ఏదో కారణం చెప్పి అతడిని దూరంగా ఉంచాలని అనుకోవటం ఘోరం. ఈ దేశం మెచ్చిన ఆటగాడు . ప్రపంచం మెచ్చిన మొనగాడు. ఎందరో ఆటగాళ్లకు స్ఫూర్తిని , వారికి క్రికెట్ లో జీవితాన్నిచ్చిన ఘనత మన అజహరుద్దీన్ దే. అజహరుద్దీన్ ఎక్కడో లేడు. ఆయన హృదయం , బతుకు , దారి అంతా తెలంగాణకే స్వంతమైన ఈ హైదరాబాదే. జగమెరిగిన అజహరుద్దీన్. మణికట్టు మాంత్రికుడిగా . కోట్లాది అభిమానుల మనసు దోచుకున్న క్రికెటర్ అతడు. బహుశా మ్యాచ్ ఫిక్సింగ్ అనే భూతంలో ఇరుక్కోక పోయి వుంటే ఆయన ఇవ్వాళ ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న ఐ.సి సి పాలక వర్గంలోనో లేక బి సి సి ఐ లోనో ఆయన వుండే వారు. ఈ 30 ఏళ్లలో ఇలాంటి ఆటగాళ్లను నేను చూడలేదు . బహుశా చూస్తామో తెలియదు. ఎలాంటి క్రికెట్ అనుభవం లేకుండా ఫక్తు వ్యాపారమే నిర్వహిస్తూ ఓ వైపు ఛానల్ ఇంకో వైపు కేబినెట్ ర్యాంక్ హోదా పొందుతూ వుండే వాళ్లకు క్రికెట్ ను శాసించాలని అనుకోవటం మన ఖర్మ కాక మరేమిటి.
క్రికెట్ లోకం మెచ్చిన ఆటగాడు మహమ్మద్ అజహరుద్దీన్ఆ.రోపణలు పక్కన పెట్టండి . అతడిని రేపటి భవిష్యత్తు కోసమైనా సరే అతడి సేవలు ఈ దేశం .ఈ తెలంగాణా ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. లేకపోతే అజహరుద్దీన్ లో వున్న ఆటగాడు కనుమరుగయ్యే ప్రమాదం వుంది.

కళాత్మకమైన క్రికెట్ ఆటకే వన్నె తెచ్చిన అరుదైన ఆటగాడు అజహరుద్దీన్. అతడు ఆడుతూ ఉంటే మైదానం లోపట లోకం వాకిట అంతా అభిమానులు , ఆటగాళ్లు , సహచరులు విస్మయానికి గురవుతారు. ఆటకే పాఠాలు నేర్పటమే కాదు ఎలా ఆడాలో కూడా తెలిసిన గొప్పనైన క్రికెటర్ . ఇలాంటి ఆటగాడు ఒక్కడే . ఆ మణికట్టు మాయాజాలం బహుశా అది దైవంశ మాత్రమే. ఎన్నో ఏళ్లుగా ఎందరో ఆటగాళ్లు వస్తున్నారు. ఈ ఆట స్థలం నుండి వీడ్కోలు తీసుకుంటున్నారు అయినా అలాంటి ఆటగాడు మాలో ఒకడిగా ఆయన మా కోట్లాది అభిమానుల గుండెల్లో ఎప్పటికి పదిలంగా వుంటారు . అజారుద్దీన్ ఆటగాడు కానీ కాదు బతుకు యుద్ధంలో గెలిచిన యోధుడు . హాట్స్ హాఫ్ అజహరుద్దీన్ . వుయ్ లవ్ యూ ఫర్ ఎవర్.

No comments