Header Ads

స్టార్ హీరో కి గుండు కొట్టించింది ఎవరు.?

సామాన్యంగా స్టార్ హీరో లు గుండు కొట్టించుకోరు, కానీ కొంత మంది కొన్ని పాత్రల కోసం గుండు కొట్టించుకుంటారు. పాత్రల కోసం గుండు కొట్టించుకున్న వారి సంఖ్యా తక్కువే, కళ్యాణ్ రామ్ 'ఓం' సినిమా కోసం గుండు కొట్టించుకున్నాడు, ఇటీవల బాజీ రావు మస్తానీ సినిమా కోసం రణవీర్ సింగ్ గుండు కొట్టించుకున్నాడు. ఇప్పుడు అర్జున్ కపూర్ వంతు వచ్చింది.




తనకంటే 15 సంవత్సరాలు పెద్దదైన మలైకా అరోరా తో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అర్బాజ్ ఖాన్ కి విడాకులు ఇచ్చిన తరువాత, అర్జున్ కపూర్ తో క్లోజ్ గా ఉంటుంది మలైకా అరోరా. అర్జున్ కపూర్ నటించిన నమస్తే ఇంగ్లాండ్ భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది. ప్రస్తుతం లగాన్ వంటి ఇండియన్ సూపర్ ఫిల్మ్ తీసిన అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో పానిపట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మూడో పానిపట్ యుద్ధం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో పేష్వా వీరుడిగా నటిస్తున్నాడు.

పేష్వా రాజవంశానికి చెందిన వీరులు గుండుతో ఉంటారు. అది వారి ఆనవాయితీ. అర్జున్ కపూర్ గుండులాంటి గెటప్ తో కనిపించబోతున్నాడు. దీనికోసం అర్జున్ కపూర్ గుండు కొట్టించుకున్నాడు. అలా గుండు చేయించుకొని ఎవరికి కనబడకుండా టోపీ, పైన షర్ట్ కప్పుకొని కారులో వెళ్తూ మీడియా కంటపడ్డాడు. పానిపట్ సినిమా డిసెంబర్ 23 నుంచి సెట్స్ మీదకు వెళ్తున్నట్టు సమాచారం. పానిపట్ తోనైనా అర్జున్ కపూర్ హిట్ కొడతాడా చూద్దాం.ఇక ఈ మూవీ ట్రైలర్ షూట్ కోసం అర్జున్ కపూర్ గుండు చేయించుకొని అశుతోష్ గోవారికర్ ఆఫీస్ కు వెళ్ళాడు. అక్కడి నుంచి బయటకు వచ్చే సమయంలో క్యాప్ పెట్టుకొని ముఖం కనిపించకుండా ముసుగు వేసుకొని బయటకు వెళిపోయాడు.

అర్జున్ కపూర్ ముసుగు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అర్జున్ కపూర్ పేష్వా రాజు పాత్రలో సరిపోతాడా లేదా అనే దాని మీద సోషల్ మీడియా లో చర్చ జోరుగా సాగుతుంది.

No comments