Header Ads

సినిమా చూసి కత్తి పట్టి కటకటాల పాలైన యువకుడు.!

జనతా గారేజ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే, ఎన్.టీ.ఆర్ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. చెట్లను కాపాడాలి పర్యావరణం ని సురక్షితంగా చూసుకోవాలి అనే పాత్రలో ఎన్.టీ.ఆర్ నటించాడు, జనతా గారేజ్ సినిమా లో జనాల కష్టాలు తీర్చే పాత్రలో కూడా నటించాడు, అయితే సమాజం లో కొందరు పర్యావరణం కాపాడటం ఆదర్శం గా తీసుకొని పాటిస్తే, మరి కొందరు ఇంకో దారిలో వెళ్లారు, జనాల కష్టాలు తీరుస్తాం, మీ కష్టాలు పంచుకోండి అంటూ ఒక వ్యక్తి హల్చల్ చేస్తున్నాడు. సామాన్యులకు ఏ సమస్యలు వచ్చినా ‘జనతాగ్యారేజ్’కు వెళ్లి చెప్పుకుంటే పరిష్కారం అవుతాయన్నట్లు జనతాగ్యారేజ్ సినిమాలో చూపించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ యువకుడు కత్తితో వీరంగం సృష్టిస్తున్నాడు.




గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం ఉండవల్లిలో నడిరోడ్డుపై ప్రదీప్ అనే యువకుడు చేతిలో కత్తి పట్టుకుని హల్‌చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాడు.

‘జనతాగ్యారేజ్’ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి. ఎవరికైనా సమస్య ఉంటే జనతాగ్యారేజ్‌లో సెటిల్ చేస్తామంటూ కొంతకాలంగా ప్రదీప్ ప్రచారం చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అయితే ఇంతకు ముందే ప్రదీప్ పలుసార్లు అరాచకాలకు పాల్పడినా పోలీసులు పట్టించుకోలేదని, అందుకే మరింత రెచ్చిపోయి రోడ్డు మీదే కత్తితో తిరుగుతున్నాడని స్థానికులు అంటున్నారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోనే ప్రదీప్ అరాచకాలకు పాల్పడడం ఆందోళన రేకెత్తిస్తోంది. సామాన్యంగా ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి, శివ సినిమా తరువాత చాలా మంది యువత చైన్ లు పట్టుకొని కొట్లాటల్లో తిరిగారు, పోకిరి చిత్రం తరువాత చేతికి కర్చీఫ్ కట్టుకొని మహేష్ బాబు స్టైల్ ని ఫాలో అయ్యారు. ముందు ముందు రానున్న కాలం లో ఇంకెంత మంది హీరో ల స్టైల్స్ ని మరియు వాళ్ల మూవీస్ లో కంటెంట్ ని ఫాలో అవుతారో చూడాలి.

Watch Video:

https://www.facebook.com/330837801006166/videos/793861747619621/?t=0

No comments