Header Ads

మరో సారి వివాదం లో సాయి పల్లవి..? అసలు కారణం ఏమిటి అంటే.?

పడి పడి లేచే మనసు చిత్రం లో శర్వానంద్ హీరో గా నటించాడు, సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన పడి పడి లేచే మనసు సినిమా కి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. కొన్ని సీన్ లను తిరిగి చేయాలనీ చిత్ర యూనిట్ భావించింది. అందు కోసం హీరో శర్వానంద్ తో సహా, అందరు ఒప్పుకున్నారని సమాచారం. సాయి పల్లవి డేట్స్ కోసం తనని సంప్రదించగా, ఇప్పుడు ఇచ్చే డేట్స్ కోసం పారితోషికం కావాలని డిమాండ్ చేసిందంట. ఇప్పటికే ఈ సినిమా కోసం పారితోషికం అందుకున్న ఈ భామ, ఇప్పుడు అదనంగా డబ్బులు అడుగుతుంది అంట. చేసేదేమి లేక తనకి అదనంగా డబ్బులు ముట్ట చెప్పారు అని సమాచారం.




ఇది వరకు ఎం.సి.ఎ చిత్ర షూటింగ్ లో కూడా సాయి పల్లవి వల్ల చిత్ర సిబ్బంది చాలా ఇబ్బందులు పడ్డారని పుకార్లు వచ్చాయి, ఆ తరువాత వచ్చిన కణం సినిమా లో సాయి పల్లవి కి హీరో నాగ శౌర్య కి కొట్లాటలు అయ్యాయి అని చాలా మంది చెప్పారు. శౌర్య కూడా పలు ఇంటర్వ్యూ లలో సాయి పల్లవి ని ఇండైరెక్ట్ గా తిట్టాడు. సాయి పల్లవి వరుస చూస్తూ ఉంటె, త్వరలోనే తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి దూరం కానుందని అర్ధం అవుతుంది. ఫిదా సినిమా వల్ల వచ్చిన క్రేజ్ ని చేతులారా నాశనం చేసుకుంటుందని తెలుగు సినీ పెద్దలు విమర్శిస్తున్నారు.

No comments