Header Ads

కలిసిపోవాలని ప్రయత్నిస్తున్న నిఖిల్.. నిఖిల్ కి థ్యాంక్స్ చెప్పిన హీరో.విజయ్ దేవరకొండ.!

విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం ప్లాప్ అయ్యింది, ఆ చిత్రం ప్లాప్ అయ్యాక విజయ్ దేవరకొండ ఒక ట్వీట్ చేసాడు 'ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో విశ్లేషించుకుంటా, కానీ ఈ సినిమాతో నేను కుంగిపోను.. నా విమ‌ర్శ‌కులకి ఇక న‌న్ను విమ‌ర్శించే అవ‌కాశం ఇవ్వ‌ను. త‌ర్వాత వ‌చ్చే సినిమాల‌తో వారికి స‌మాధానం చెపుతాను అంటూ ట్వీట్ చేసాడు' విజయ్ దేవరకొండ, ఇందులో తప్పేమి లేదు. విజయ్ చేసిన ఈ ట్వీట్ లో వేరే ఏ హీరో ని లాగలేదు, తిట్టనూలేదు.. కానీ విజయ్ దేవరకొండ ఆ పోస్ట్ వేసిన వెంటనే విజయ్ పేరు ఎత్తకుండా ఒక పోస్ట్ వేసాడు నిఖిల్.. అంతా మనమే, మనదే అంటూ అనుకోకూడదు, మనమెంత వాళ్ళమో తెలుసుకోవాలి అన్నట్టు ట్వీట్ వేసాడు నిఖిల్. కానీ ఆ ట్వీట్ విజయ్ ఫాన్స్ ఏ కాకుండా కామన్ ఆడియన్స్ కూడా నిఖిల్ ని తిట్టారు, ఆ దెబ్బతో ట్వీట్ డిలీట్ చేసాడు నిఖిల్. దీనితో ఆ రోజు నుండి, నిఖిల్ కి విజయ్ అంటే అసూయా అనే విషయం బయట పడింది.




విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన "ట్యాక్సీవాలా" చిత్రం నవంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. కానీ ఈ సినిమా మొత్తం టారెంట్స్‌లోకి వ‌చ్చింది. ఒక టారెంట్ సైట్ సినిమా పైర‌సీ ప్రింట్‌ని అప్‌లోడ్ చేసింది. సినిమా విడుద‌ల‌కి ఐదు రోజుల ముందే మొత్తం సినిమాని ఆన్‌లైన్‌లో పెట్టింది. షాక్ తిన్న టీమ్‌..ఆ పైర‌సీ ప్రింట్‌ని ఆపేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే త‌మిళ హీరో సూర్య విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. ఈ క‌ష్టం కూడా త్వ‌ర‌లోనే పోతుంది, నువ్వు ఇక్క‌డ రూల్ చేస్తావు అని సూర్య విజ‌య్‌కి సపోర్ట్‌గా ట్వీట్ చేశాడు. ఐతే ఆశ్చ‌ర్య‌క‌రంగా నిఖిల్ కూడా అదే పంథాలో విజ‌య్‌కి సపోర్ట్‌గా ఒక వీడియోని షేర్ చేశాడు. పైర‌సీని అరికట్టండి. ఈ సినిమాని సూప‌ర్ హిట్ చేయండ‌ని కోరాడు. త‌న మిత్రుడు రాహుల్ (టాక్సీవాలా చిత్ర ద‌ర్శ‌కుడు), నిర్మాత ఎస్‌.కే.ఎన్‌ల తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రోత్సహించండ‌ని చెప్పాడు. నిఖిల్ ఇలాంటి టైమ్‌లో త‌న‌కి స‌పోర్ట్‌గా నిల‌వ‌డంతో అత‌ని పాత జెల‌సీ యాక్ట్‌ని మ‌రిచిపోయి, విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా అత‌నికి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేసాడు. దీనితో అయిన తాను ముందు చేసిన ట్వీట్ ని అందరు మర్చిపోతారని అనుకుంటున్నాడేమో నిఖిల్.

No comments