రోజంతా క్లాసుల్లో ఉండే ఆమె...రాత్రి పూట ఏం చేస్తుందో తెలుస్తే హాట్సాఫ్ అంటారు..! అలా చేయడానికికారణమేంటి?
కష్టపడే మనస్తత్వం ఉంటే చాలు, ఎవరైనా లక్ష్య సాధన దిశగా ముందుకు అడుగులు వేయవచ్చు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే నిర్దిష్ట లక్ష్యం కళ్ల ముందు కదులుతున్నప్పుడు ఆ అవాంతరాలు కూడా గడ్డిపోచలుగా మారిపోతాయి. లక్ష్యసాధనకు అవి అడ్డు కావు. సరిగ్గా ఇలా అనుకుంది కాబట్టే ఆ యువతి తన లక్ష్యం కోసం చాలా కష్టపడుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసులకు హాజరవుతుంది. సాయంత్రం జీవనోపాధి కోసం పరోటాలు అమ్ముతుంది. ఈమె కథ వింటే ఎవరికైనా జాలి కలుగుతుంది.
ఆమె పేరు స్నేహ లింబ్గా ఓంకార్ (28). మహారాష్ట్ర వాసి. కేరళ రాష్ట్రం త్రివేండ్రంలోని కేరళ యూనివర్సిటీలో బయో ఇన్ఫర్మాటిక్స్ డిపార్ట్ మెంట్ లో పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్ గా విద్యనభ్యసిస్తోంది. ఈ క్రమంలోనే రెండేళ్లు పూర్తయ్యాయి. తనకు వచ్చే స్కాలర్ షిప్‌తో చదువుకునేది. అయితే ఈ సారి యూనివర్సిటీ ఇవ్వాల్సిన ఫెలోషిఫ్ మాత్రం ఇంకా అందలేదు. దీనికితోడు కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఇంటి నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఎలాగైనా రీసెర్చ్ కంప్లీట్ చేయాలని భావించిన లింబ్గా ఓంకార్ స్వయం ఉపాధి చూసుకుంది. తనకు పరోటాలు చేయడం బాగా వచ్చు. కనుక సాయంత్రం పూట యూనివర్సిటీ వద్దే పరోటాలను చేసి అమ్మడం ప్రారంభించింది.
ఈ క్రమంలోనే ఓంకార్ ఉదయం యూనివర్సిటీలో రీసెర్చ్ వర్క్ చేస్తుంది. ఇక సాయంత్రం నుంచి రాత్రి 11 గంటల వరకు పరోటాలు చేసి విక్రయిస్తుంది. ఇలా ఓ వైపు చదువు, మరో వైపు పనితో ఆమె కాలం వెళ్లదీస్తోంది. అయితే ఈమె గురించి తెలిసిన కొందరు యూనివర్సిటీ స్టూడెంట్స్ అక్కడికే వచ్చి పరోటాలను తింటూ ఆమెకు గిరాకీ పెంచుతున్నారు. ఇక స్టూడెంట్స్‌తోపాటు చుట్టూ పక్కల కంపెనీల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులు కూడా ఓంకార్ పరోటా సెంటర్ కే వస్తున్నారు. అయితే కొందరు ఆమెకు సాయం చేస్తామని ముందుకు వచ్చారు. అయినా ఆమె నిరాకరించింది. తనకు ఆయాచితంగా వచ్చిన డబ్బు అక్కర్లేదని, కష్టపడి పనిచేస్తానని చెబుతోంది. అలా వచ్చిన డబ్బుతోనే ఎలాగైనా పీహెచ్డీ పూర్తి చేస్తానని ధీమాగా ఓంకార్ చెబుతోంది. ఆమె లక్ష్యం నెరవేరాలని మనమూ కోరుకుందాం.
రాత్రి 2 గంటల సమయంలో, భారీ వర్షంలో ఓ కలెక్టర్ ఇలా చేసి, ఊరందరినీ కాపాడాడు.చీకట్లో మగ్గుతున్న ఊరికి కరెంట్ తెప్పించింది,మాఫియాకు చుక్కలు చూపించింది.స్నేహం..కోసం ప్రాణాలకు తెగించి మరీ సాహసం చేసిన శునకం.
Post a Comment