Header Ads

ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు.?

బెర్ముడా ట్రయాంగిల్ ఈ పేరు వింటే అందరికి గుర్తు వచ్చేది, విమాన ప్రమాదాలు, నౌకల(షిప్స్, బోట్స్) ప్రమాదాలు . ప్రపంచం అంత ఉలిక్కిపడుతుంది ఈ పేరు వినగానే, ఈ బెర్ముడా ట్రయాంగిల్ లోకి ప్రవేశించే ఓడలు, విమానాలు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు, అట్లాంటిక్ సముద్రం లో మయామి, సాన్ యువాన్, ప్యూర్టో రికో మధ్యన గల 7 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు. గత వందేళ్లలో ఇటుగా వెళ్లిన సుమారు 80 విమానాలు, వందలాది నౌకలు గల్లంతయ్యాయి.సముద్రంలో పిరమిడ్ లు ఉండటం వల్లే ఇలా జరుగుతుందని కొందరు అంటారు, ఏలియన్లే అటుగా వెళ్తున్న నౌకలు, వినామాలను నాశనం చేస్తున్నాయని మరికొందరు వాదిస్తున్నారు. ఇటీవల ఛానల్ 5 టీవీ రూపొందించిన డాక్యుమెంటరీలో శాస్త్రవేత్తలు ఆ వాదనలను కొట్టిపడేసారు. సముద్రంలో ఏలియన్లు, పీరమిడ్లు అంటూ ఏమి లేవని....సముద్రంలో సుమారు 100 అడుగుల ఎత్తుకు ఎగిసిపడే రాకాసి అలలు వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అని వాళ్ళు చెబుతున్నారు. ఆ అలలకు రోగ్ వేవ్స్ అమీ పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతం లో ఉన్న విభిన్న వాతావరం వల్ల నౌకలు, విమానాలు ప్రమాదానికి గురి అవుతున్నాయి అని వెల్లడించారు, ఆ వాతావరణం లో ప్రయాణించలేం అని అందుకే అక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి అని తెలిపారు. సముద్రంలో ఆకస్మికంగా ఏర్పడే తూఫాన్ ల వల్ల అలలు 100 అడుగుల ఎత్తుకు ఎగిసి పడతాయట. ఇంతటి భారీ అలల్లో మరియు వేగంగా వీచే గాలుల్లో, నౌకలు విమానాలు ప్రయాణించడం కష్టమని అందుకే ప్రయాణాల్లో ప్రమాదాలు సంభవిస్తాయి అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
అయితే బెర్ముడా ట్రయాంగిల్ ప్రమాదాలు వెనుక ఉన్న రహస్యాలని ఆధారాలతో నిరూపించలేక పోతున్నారు. మార్స్(అంగారకుడు) పైకి మానవ రహిత రోవర్లను ప్రవేశ పెడుతున్న పరిశోధకులు, శాస్త్రవేత్తలు... భూమిపై ఉన్న ఈ అతిపెద్ద మిస్టరీని ఎందుకు ఛేదించలేకపోతున్నారు? ఇది ఎప్పటికి మిస్టరీ లాగే ఉంది పోతుందా? లేకుంటే ఈ రహస్యం గురుంచి తెలిసిన శాస్త్రవేత్తలు, బయట ప్రపంచానికి నిజం తెలియకుండా దాచి పెడుతున్నారు...

ఒకవేళ నిజంగానే ఏలియన్స్ వల్లే అక్కడ ప్రమాదాలు జరుగుతుంటే, అవి మిగిలిన చోట్లకి ఎందుకు రావట్లేదు? సబ్ మెరైన్ లు, ఫైటర్ జెట్ లు అంటూ ఎన్నో పరికరాలు మన దెగ్గర ఉన్నాయ్, వాటిని ఉపయోగించి ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? ఈ మిస్టరీని ఛేదించి ప్రజల ముందుకు ఎప్పుడు పెడతారో వేచి చూడాలి.

No comments