కృనాల్ పాండ్య పైన విరుచుకుపడ్డ హర్భజన్ సింగ్, దుమారం లేపుతున్న హర్భజన్ కమెంట్స్..!
ఆస్ట్రేలియా తో మొదటి T20 లో భరత్ ఓడిపోవడం తో, భారత మాజీ క్రికెటర్ లు మొదలు, గల్లి పోరగాళ్ల వరకు అందరూ కారణాలు, తప్పిదాల గురుంచి చెప్ప సాగారు, వీరిలో అందరికంటే ఎక్కువ రచ్చ లేపిన వ్యక్తి హర్భజన్ సింగ్, హర్భజన్ సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా, మీడియా లో వైరల్ అయ్యాయి.
బ్యాటింగ్ మార్పులపై కూడా అసహనం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లి మూడో స్థానంలో కాకుండా, కేఎల్ రాహుల్ కోసం నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ఆసీస్‌కు కలిసొచ్చిందన్నాడు. నాలుగో స్థానం రాహుల్‌కు తగదనుకుంటే అతడిని పక్కకు పెట్టి అంబటి రాయుడుని జట్టులోకి తీసుకుంటే బాగుంటుందన్నాడు. వన్డేల్లో నాలుగో స్థానానంలో రాయుడు సెట్ అయ్యాడని, టీ20ల్లో కూడా ఆ స్థానంలో రాణిస్తాడనే నమ్మకముందన్నాడు. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంపకప్ దృష్ట్యా స్పిన్నర్లపై సెలక్టర్లు ఓ అభిప్రాయానికి రావాలని సూచనలిచ్చాడు. చహల్‌ను ప్రపంచకప్‌లో ఆడించాలనుకుంటే ఆసీస్ పర్యటనలో తగినన్ని అవకాశాలివ్వాలని హర్భజన్ అభిప్రాయపడ్డాడు
కృనాల్ నాణ్యమైన స్పిన్నర్ కాదు :
ఆసీస్ పిచ్‌లపై కృనాల్ రాణించలేడని ఈ మాజీ ముంబై ఇండియన్స్ ఆటగాడు పేర్కొన్నాడు. అసలు కృనాలు సరైన స్పిన్నర్ కాదని, బంతిని స్పిన్ చేయలేడని, కేవలం వేగంగా మాత్రమే బంతులు విసురుతాడని విమర్శించాడు. ఇక ఆరోస్థానంలో బ్యాటింగ్ కోసం నాణ్యమైన స్పిన్నర్‌ను పక్కకు పెట్టి కృనాల్‌ను జట్టులోకి తీసుకోవడం ఘోర తప్పిదమన్నాడు. కృనాల్‌ను ఏ ఉద్దేశంతో జట్టులోకి తీసుకున్నారో టీమ్ మేనేజ్మెంట్కైనా క్లారిటీ ఉందా అంటూ ప్రశ్నించారు. ఇక శుక్రవారం జరిగే రెండో టీ20లోనైనా కృనాల్‌ను తప్పించి చహల్‌కు అవాకాశం ఇవ్వాలని సూచించాడు.
అసలు కృనాల్ పాండ్య పైన హర్భజన్ సింగ్ ఈ రేంజ్ లో విరుచుక పడటానికి కారణం ఏంటా అని నెటిజెన్ లు చర్చలు మొదలుపెట్టారు.
Post a Comment