Header Ads

కేసీఆర్ పథకాలపై బండ్ల గణేష్ వేసిన జోకులు... వింటే పడి పడి నవ్వుకుంటారు..!

కె.సి.ఆర్ పైన విరుచుక పడ్డాడు బండ్ల గణేష్, కానీ తన డైన శైలి లో సెటైరికల్ గా పంచ్ లు వేసాడు.ఇటీవల ఒక టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన బండ్ల గణేష్, ఆ ఇంటర్వ్యూ లో ఇలా మాట్లాడాడు:
  • కెసిఆర్ గారు కరెక్ట్ గానే చెప్పాడు, కానీ మేమె తప్పుగా అర్ధం చేసుకున్నాం, మా తెలంగాణ ప్రజలకు ఆయన మాటలు అర్ధం కాలేదు.

  • డబల్ బెడ్ రూమ్ ఇల్లే (హౌస్) అన్నాడు, ఇల్లే అంటే లేవు అని అర్ధం.. ఇల్లే అంటే లేవన్నాడు, ఇల్లులే అనుకున్నాం కానీ ఇల్లే అని తరువాత అర్ధం అయ్యింది.

  • నల్ల తిప్పితే నీళ్ళే అన్నాడు, నిల్ (నిల్ అంటే కాళీ అని ఆంగ్లం లో అర్ధం ) ఏ ..ఈ రెండు విషయాల్లో అయన తప్పు లేదు, ఆయన కరెక్ట్ గానే చెప్పాడు, కానీ మాకే ఈ రెండు విషయాలు సరిగ్గా అర్ధం కాలేదు...

  • తెలంగాణ లో ఉన్న ప్రతి దళితుడికి మూడు ఎకరాలు ఇస్తాడు అనుకున్నాం, కానీ అయన తెలంగాణ లో ఉన్న దళితులందరికి కలిపి మూడు ఎకరాలు ఇచ్చాడు.

  • ఇంటికో ఉద్యోగం అన్నారు, అంటే తెలంగాణ లో ఉన్న ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు అనుకున్నాం, కానీ ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్లందరికీ ఉద్యాగాలు ఇచ్చాడు..

  • ముస్లిం లకి 12 % రిజర్వేషన్ 'లే 'అన్నాడు, అంటే లేదు అనే గా అర్ధం.
    ఆయన ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాడు, మేమె తప్పుగా అనుకున్నాం,

  • ఆయన మేము ఏవి చేయము అనే అన్నాడు, కానీ మాకే అన్ని చేస్తాడు అనిపించింది.

కేజీ టూ పీజీ, గురువు గారు అయ్యారు రాజి, అందుకే అవుతున్నారు రేపు 11 వ తారీకు మాజీ. అంటే, కేజీ నుండి పీజీ అన్నారు, అది చేయడానికి సార్ అయ్యాడు రాజి, అందుకే జనం చేస్తున్నారు ఆయన్ని 11 వ తారీకు మాజీ....

ఇలా కే.సి.ఆర్ మరియు టీ.ఆర్.ఎస్ పార్టీ మీద విరుచుకుపడ్డాడు బండ్ల గణేష్, తను స్వతహాగా కమెడియన్ కాబట్టి ఇలాంటి మాటలు ఆయనకి వెన్నతో పెట్టిన విద్య, కానీ ఈ రేంజ్ లో చెప్తాడు అని ఎవరు ఊహించి ఉండరు. వ్యంగ్యం అజ్ఞాని కూడా జ్ఞానీ గా చూపించగలదు అంటే ఇదేనేమో, మొత్తానికి బండ్ల గణేష్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతున్నాయి.

No comments