Header Ads

ప్రాణాలకు తెగించి శబరిమలను కాపాడుతున్న హిందూవీరులను తయారుచేసిన ఈ వీరవనిత ఎవరో తెలుసా..??

అది 1975 సంవత్సరం..కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఒక ఉన్నత పాఠశాలలో 9వ తరగతిలో చరిత్ర ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నాడు.. ఆరోజుటి పాఠం ఔరంగజేబు దండయాత్రలు.. 15 ఏళ్ళ బాలిక చెవులు చాటంత చేసుకుని ఏకాగ్రతగా వింటున్నది.. పాఠం అయిపోయిన తరువాత తిన్నగా ఉపాధ్యాయుని దగ్గరకెళ్ళి ఔరంగజేబు దౌర్జన్యాలూ అరాచకాల గురించి మరింతగా వివరంగా చెప్పమని ప్రాధేయపడింది.చుట్టూ ఉన్న పరిస్థితుల రీత్యా చెప్పడానికి ఆ ఉపాధ్యాయుడు నిరాకరించాడు.
కానీ ఆ బాలిక చలాకీతనాన్ని ఏకసంథాగ్రాహ నిశితాగ్ర బుధ్ధిని గమనించిన ఆ టీచరు కొన్ని పుస్తకాల పేర్లు చెప్పి లైబ్రరీకి వెళ్ళమన్నాడు.. అంతే ఆ బాలిక సరాసరి లైబ్రరీకి వెళ్ళి.. లైబ్రేరియన్ "ఈరోజు సమయం అయిపోయింది, ఇక తలుపులు మూసేయాలి.." అని చెప్పేవరకు ప్రతిరోజు అనేక చరిత్ర పుస్తకాలు చదివేది..

ఆతరువాత 6 ఏళ్ళకు 1981లో టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో 'Social Studies & History 'విభాగంలో ఈ బాలికే జిల్లాలో ప్రథమ స్థానం దక్కించుకుని ఉపాధ్యాయురాలిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది.. ఆమె చరిత్ర పాఠాలు చెబుతుంటే విద్యార్థులు నిజంగానే చరిత్రలోకి (ఆదిత్య 369 సినిమాలో మాదిరి) వెళ్ళినంతగా ముగ్దులయ్యేవారు..
మన దేశంపై 712 AD లో ఖాసింరిజ్వీ తో ప్రారంభమైన దండయాత్రలు ఏవిధంగా 2014 వరకు కొనసాగాయో వివరించి చెప్పేది.. కానీ ఇదంతా ఇతర మతస్తులకూ, కమ్యూనిస్టులకూ తల నొప్పిగా మారింది.. దీనితో ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.. ఆమె ధీరవనిత., ఏమాత్రం వెనకడుగు వేయలేదు.. అప్పుడు క్లాస్‌రూం వదిలి సభలూ సమావేశాలూ నిర్వహించి హిందువులు ఏవిధంగా 1200 ఏళ్ళుగా ఊచకోతకు గురయ్యారో వివరిస్తూ అసలైన చరిత్రను చెప్పసాగింది.

ఆమెను 2003లో హిందూఐక్యవేదికకు (HAV) ఉపాధ్యక్షురాలిగా హైందవ సంఘాలు ఎన్నుకున్నాయి..అప్పటి నుంచి సర్వస్వం హిందువుల అభ్యున్నతికే పాటుపడుతూ పోరాడుతున్నది..కేవలం నాలుగేళ్ళలోనే 2007లో హిందూ ఐక్య వేదికకు ఆమె అధ్యక్షురాలు అయినది..కేరళలోని దక్షిణ మలబార్ జిల్లాలైన పాలక్కాడ్, త్రిశూర్, మలప్పురం జిల్లాలలో ఆమెకు లక్షలాదిమంది అనుచరులు ఉన్నారు.

ఆమెపై ఇంతవరకు 3సార్లు హత్యా యత్నాలు జరిగాయి..ప్రతిసారీ కోలుకుని రెట్టించిన ఉత్సాహంతో ఆమె పనిచేస్తున్నారు.. ప్రస్తుతం ఆమె పాలక్కాడ్ జిల్లా #వల్లప్పూజ అనే మేజర్ పంచాయితీ గ్రామంలో ఉన్నత పాఠశాలలో డెప్యూటీ హెడ్‌మిస్ట్రెస్‌గా పనిచేస్తున్నారు.. అయ్యప్ప_శబరిమల విషయంలో ఆమె నేత్రృత్వంలోనే ఉద్యమం నడుస్తున్నది.. స్వయానా సుప్రీంకోర్టు మరియు ప్రభుత్వం ఒకటై దుష్టులకు అండగా ఉన్నా కూడా, ఆమె వ్యూహం వల్లనే సన్నిధానానికి అడుగు పెట్టలేక పోతున్నారు.. దానితో ఆమెను కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం నిన్న అరెస్టు చేసింది..
అందుకు నిరసనగా నేడు కేరళలో బంద్ జరుగుతున్నది.

ఇంతకూ ఆ వీర వనిత పేరు చెప్పలేదు కదూ..

ఆమె పేరు KP_Sashikala..

ఆమెను కేరళ_ఝాన్సీరాణి అని అక్కడివారు పిలుచుకుంటారు.No comments