Header Ads

పీరియడ్లను వాయిదా వేయటానికి టాబ్లెట్స్ తీసుకుంటున్నారా?.టాబ్లెట్స్ తీసుకోడం వల్ల కలిగే నష్టాలుతెలుసుకోండి.

రుతుస్రావం(పీరియడ్స్) సమయంలో ఇంటి బయట కూర్చోవాల్సి వచ్చే మహిళల సంఖ్య కనీసం నగరాల్లో అయినా తక్కువగా ఉంది. కానీ రుతుస్రావం అవుతున్న మహిళలు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనటం నిషిద్ధం. అందుకే చాలా మంది మహిళలు పీరియడ్స్ వాయిదా వేయటానికి టాబ్లెట్లు వాడుతున్నారు. ‘‘రుతుస్రావంలో ఉన్నపుడు పూజలు చేయొద్దు అని కానీ. మతపరమైన పనుల్లో పాల్గోవద్దు అని కానీ దేవుడు చెప్పలేదు. కాబట్టి.. ఇటువంటి అపోహల కోసం మహిళలు తమ శరీరాలకు హానిచేసుకోకూడదు’’ అని సూచిస్తున్నారు డాక్టర్ గౌరి. ‘‘నెలసరి రుతుస్రావం అపవిత్రం కాదు. అది ప్రకృతి కానుక. దానిని సంతోషంగా అంగీకరించాలి. మహిళలు పీరియడ్స్ సమయంలో ఆలయాలకు వెళ్లరు. పండుగల సమయంలో రుతుస్రావాన్ని వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తుంటారు.




ఇదంతా పూర్తిగా తప్పు. చాలా గణపతి పూజలకు నన్ను ఆహ్వానిస్తుంటారు. ఆ రోజుల్లో నాకు పీరియడ్స్ ఉన్నా సరే. నేను వెళ్లి పూజలు చేస్తాను. హారతిలు పాడతాను. నాకు పీరియడ్స్ ఉన్నందు వల్ల ఫలానా కార్యక్రమానికి హాజరుకాలేను అని నేను ఎప్పుడూ చెప్పలేను. ఈ ముట్టు వంటి ఆంక్షలు. మైల వంటి భావనలు. ఈ దురాచారాలన్నిటికీ మనం స్వస్తిచెప్పాల్సి ఉంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘పాత రోజుల్లో మహిళలను వారి రుతుస్రావం సమయంలో ఇంట్లో ఒక మూలన కూర్చోబెట్టేవారు. వారికి కొంత విశ్రాంతి లభించాలని.. మొత్తంగా పరిశుభ్రంగా ఉండాలన్నది దాని ఉద్దేశం. కానీ ఇప్పుడది అవసరం లేదు. ఉదాహరణకి.. ఒక ఇంట్లో ఒక మహిళ ఒంటరిగా ఉన్నపుడు.. ఆమె పీరియడ్స్‌లో ఉంటే.. దేవుడికి ఆమె నైవేద్యం వండకూడదా? ఆమె తప్పకుండా వండాలి. ఎలాగూ.. దేవుడికి నైవేద్యం సమర్పించే ముందు దానిని పవిత్రం చేయటానికి దాని మీద తులసిదళం లేదా దువ్వగడ్డి ఉంచుతాం. కాబట్టి.. పీరియడ్స్‌లో ఉన్నపుడు నైవేద్యం వండటంలో. చివరికి పూజలు చేయటంలో అయినా ఎలాంటి ప్రమాదం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఒకవేళ మహిళలు టాబ్లెట్లు తీసుకోవటం ద్వారా పీరియడ్లను వాయిదావేస్తున్నట్లయితే. అది పూర్తిగా తప్పు. దేవుడికి కోపం రాదని.. ఆయన శిక్షించడని.. ఆయన ఎల్లప్పుడూ క్షమిస్తాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. కాబట్టి.. మత ఛాందసం సృష్టించిన అనవసర భయాలతో మహిళలు తమ శరీరాలకు హాని చేసుకోకూడదు’’ అని సోమన్ సూచించారు.

పీరియడ్లను వాయిదా వేయటానికి టాబ్లెట్స్ తీసుకుంటారు అమ్మాయిలు, అయితే ఇలా టాబ్లెట్స్ వాడటం వలన తలతిరగటం, పార్శ్వనొప్పి (మైగ్రేన్) ఉన్నా. గతంలో ఎప్పుడైనా స్ట్రోక్ వచ్చినా. రక్తపోటు ఉన్నా. అధిక బరువు ఉన్నా. ఆమె ఆరోగ్యాన్ని ఈ టాబ్లెట్లు మరింతగా దెబ్బతీయగలవు. కనుక టాబ్లెట్స్ వాడకం తగ్గియండి, అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రమే తీసుకోండి, దేవుడి పూజలు, కార్యక్రమాలు అంటూ ప్రతి సారి వాడటం వల్ల మీ ఆరోగ్యం దెబ్బ తింటుంది.


No comments