Header Ads

మా మధ్య ఎటువంటి కొట్లాటలు, విబేధాలు లేవు- మంత్రి కేటీఆర్..!

కేటీఆర్ , హరీష్ రావు ల మధ్య కొట్లాటలు ఉన్నాయ్ అంటూ జరిగే ప్రచారం లో నిజం లేదని కేటీఆర్ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పష్టం చేసాడు
కేటీఆర్ మాట్లాడుతూ : మా ఇద్దరి కోరిక ఒకటే. కెసిఆర్ గారు మరొక 15 సంవత్సరాల పాటు ముఖ్య మంత్రిగా ఉండాలి, నాకు హరీష్ రావు గారి మధ్య వారసత్వ పోరు, ఎజెండా లు మనస్పర్థలు పోటీ లు లేవు. కెసిఆర్ గారే మా పార్టీ కి పెద్ద దిక్కు. టీవీ చానెల్స్ నడపాలని లేనిపోని వణ్ణి సృష్టించి చెబుతున్నారు. కెసిఆర్ గారికి 64 ఏళ్ళు. ఈ రోజుల్లో 90, 95 ఏళ్ళు ఉన్న వాళ్లు పార్టీలను, ప్రభుత్వాలను నడుపుతున్నారు. కెసిఆర్ గారి తరువాత ఎవరు అనేది చెప్పలేము, అది ఎవ్వరం చెప్పలేం. మాకు కెసిఆర్ గారే ముఖ్య మంత్రి గా ఉండాలి, పార్టీ ని నడపాలి, ఇంకో 15, 20 సంవత్సరాల వరకు అయన పాలించాలి, ఆయన పాలన లో తెలంగాణ అంత సంతోషం గా ఉండాలి. హైదరాబాద్ లో మాకు 0 కార్పొరేటర్లు ముందు, నేను మా నాయకుడి ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం తో హైదరాబాద్ లో 99 సీట్ లు గెలిపించుకొని వచ్చాను. నా పుట్టుక చావు అన్ని తెరాస లోనే అని హరీష్ రావు చాల సార్లు చెప్పాడు. బావ బామ్మర్దుల మధ్య పోటీ లేదు గొడవ లేదు పోటీ తత్వం లేదు. కెసిఆర్ కంటే ముందే మేమిద్దరం రాజకీయాల నుండి విరమించొచ్చు . నేనేదో ముఖ్యమంత్రి కావాలి అని పిచ్చి పిచ్చి కళలు కానీ అనుచరులను పెంచుకోవాలని అస్సలు లేదు నేను ఏ నాడు జీవితం లో మంత్రిని అవుతా అని నేను అనుకోలేదు నా స్థాయి కి మంత్రి అవ్వడమే ఎక్కువ. నా కంటే సమర్థులు వందల, వేల మంది ఉన్నారు. మా కోరిక ఒకటే, ఈ ఎన్నికల్లో లో తెరాస గెలవాలి, కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. నేనేదో రెండు మూడు సభల్లో కనిపించినందుకు నేను తోపు, తురుము అని అనుకోను, నాకు సీఎం అవ్వాలని అసలు లేదు. వారసులే పార్టీ లు నడపాలి, ముఖ్య మంత్రులు అవ్వాలి అని ఎక్కడ లేదు. ఎవరు అయినా అవ్వొచ్చు అని కేటీఆర్ గారు పేర్కొన్నారు.

Watch Video:

https://www.facebook.com/ntvtelugu/videos/353253202147062/?t=136

No comments