మాటే మంత్రం చినజీయర్ జీవన వేదం !
మాటలే మనసుల్ని కరిగించేది. మాటలే గుండెల్ని మీటేది. జీవన ప్రయాణంలో మాటలు వారధలవుతాయి. మనమేమిటో మన స్థాయి ఏమిటో తెలియ చేస్తాయి. మాటలకున్న పవర్ అలాంటిది. మాటలు కోటలు దాటితే ప్రమాదం. పొదుపుగా వాడితే ఎంతో ఉపయోగం. ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకోవాలంటే..లక్షలాది ప్రజలను ఆధ్యాత్మిక లోగిళ్లలోకి తీసుకు రావాలంటే చాలా శ్రమించాల్సి వుంటుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ప్రతి రోజూ క్రమపద్ధతిన ప్రాక్టీస్ చేస్తూ పోవాల్సిందే. లేకపోతే ఎక్కడో ఒక చోట ఆగిపోతాం. మహోన్నతమైన ఈ మానవ సంచారానికి కొలమానం కావాలంటే మాటలుండాల్సిందే. ఎందులోనైనా లేక దేనిలోనైనా పరిణతి సాధించాలంటే దాని పట్ల ఎరుక కలిగి వుండాలి. అంతకంటే దాని పట్ల అభిమానించే స్థాయికి చేరుకోవాలి. లేకపోతే ఉన్నచోటునే ఉండిపోతాం. ఇదో అంతులేని ప్రయాణం.
కొన్ని తరాలను తరిచి చూస్తే విలువలే ప్రామాణికంగా ఉన్నాయన్న వాస్తవం మనకు అర్థమవుతుంది. ఎందరో మహానుభావులు తమ తమ విలువైన బతుకుల్ని ఆధ్యాత్మిక వెలుగుల్ని ప్రసరింప చేసేందుకు త్యాగం చేశారు. అంతకంటే తమను తాము వినమ్రంగా అర్పించుకున్నారు. ఇంకో రకంగా బలిదానం చేసుకున్నారు. ఇందులో సందేహ పడాల్సిన పనేలేదు. టెక్నాలజీ జోరుగా ఆధిపత్య ధోరణిని అనుసరిస్తూ అత్యున్నతమైన ..ఉత్కృష్టమైన సమాజపు పునాదులను పెకిలించే స్థాయికి చేరుకోవడం మరింత ప్రమాదాన్ని సూచిస్తున్నది. ఆధునికత పేరుతో మానవ సమూహం వెర్రి పోకడలు పోతోంది. ఇది ఎంతమాత్రం క్షమార్హం కాదు. ఎన్నో కాలాలను దాటుకుని ముందుకు వచ్చాము. గతంలో కంటే ఇప్పుడు విస్తృతమైన అవకాశాలు..అపారమైన వనరులు కలిగి వున్నప్పటికిని..మనుషుల మధ్య పొరపొచ్చాలు బంధాలు పలుచనై. మసకబారి పోతున్నాయి. ఇది కాదు మన సంస్కృతి..ఇది కాదు మన నాగరికత. ప్రతి ఇంట్లో దీపం వెలుగాలి. ప్రతి సింధూరం ఆధ్యాత్మికతకు నాందీ సూచకం కావాలి. అప్పుడే ప్రతి పల్లెలో గుడిలో గంట మోగుతుంది. బడిలో అక్షరం పలుకుతుంది.
అనంతమైన ఈ ప్రపంచం తన దారిన తాను వెళుతూనే వుంటుంది. కానీ ఆధ్మాత్మికత మాత్రం ఎన్నటికీ మారదు. అది నిత్యనూతనమై భక్తి జలధారను అందించే ప్రయత్నం చేస్తుంది. రుషులు, మునులు, మహర్షులు.యోగులు, సర్వసంగ పరిత్యాగం చేసిన వాళ్లు..ఆధ్యాత్మిక వేత్తలు.తాత్వికులు, గురువులు, మేధావులు బతుకు మర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. బంధాలను కలుపుతూ కుటుంబ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు శతవిధాలుగా శ్రమిస్తూనే వున్నారు. ఎవరికి తోచిన మార్గంలో వాళ్లు తమదైన బ్రాండ్‌తో నడుస్తున్నారు. అడుగులు వేస్తున్నారు. అందరి మతం ఒక్కటే..అందరి ఆదర్శం ఒక్కటే..అందరి ధ్యేయం ఒక్కటే..అదే ..అదే మానవత్వం. సర్వ ప్రాణ కోటి సమూహం అంతా ఒక్కటే. మానవులే కాదు..సకల జీవ చలరాశులు సమానమే. వాటికి జీవించే స్వేచ్ఛను కల్పించాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక పరిమళాలనే విత్తనాలను చల్లుకుంటూ అంతరించి పోతున్న మానవీయ విలువల పునరుద్ధరణ కోసం కృషి చేయాలి. అప్పుడే ఈ భేదభావాలు..ఈర్ష్యా విద్వేషాలు ..కుట్రలు..దూరమై పోతాయి. మనుషులంతా ఒకే కోవకు..ఒకే జాతికి చెందిన వారుగా ఉన్నపుడే ఏదైనా సాధ్యమవుతుంది.
ఈ ఉన్నతమైన జీవితాన్ని దేదీప్యమానం చేసుకోవాలంటే ఏం చేయాలి? కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. బ్యాంకు బ్యాలెన్సులు అక్కర్లేదు. ఎయిర్ కండీషన్లు..కార్లు..లగ్జరీ గూడ్స్..ఏవీ ఉండాల్సిన పనిలేదు. కావాల్సిందల్లా సత్ సంకల్పం. తోటి వారిని ప్రేమించే గుణం. సాటి వారి పట్ల కరుణ. జీవులపై కాసింత ప్రేమ కలిగి ఉంటే చాలు. ఏకాగ్రత అబ్బుతుంది. మనలోకి మనం చేరుకుంటాం. మనంతో మనం సంభాషిస్తాం. అప్పుడు నీకు నీవేమిటో అర్థమవుతుంది. అనంతరం ఇతరుల పట్ల గతంలో కంటే వర్తమానంలో ప్రేమగా పలకరించడం అలవాటైపోతుంది. ఇందులో ఎలాంటి జిమ్మిక్కులు లేవు. ఇంకే మ్యాజిక్కులు వాడాల్సిన పనేలేదు. కళ్ల ముందు అద్భుతమైన కాంతి ప్రస్ఫుటమవుతుంది. వస్తువులు తాత్కాలికం. అవి ఇచ్చే ఆనందం అశ్వాశ్వతం. ఉన్నదల్లా ఆధ్యాత్మికమే.
జీవసాకేతంను దర్శించండి. నిరాటంకంగా విరాజిల్లే ఆ ఆధ్యాత్మిక శోభను కనులారా వీక్షించండి. మీరేమిటో..మీకున్న విలువేమిటో అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరు భక్తులే. అనుమానాలు..శంకలు..ప్రశ్నలు..అన్నీ మాయమైపోతాయి. ఒక్కటే మీ ముందు మిగిలిపోతుంది. తల్లితనం .దైవసమానమైన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి రూపాన్ని చూడండి. ఈ జన్మకు ఇది చాలనకుంటారు. ఆయన
చల్లని చేతులు మిమ్మల్ని సాదరంగా ఆశ్వీరదిస్తాయి. మంగళాశాసనాలు అందజేస్తాయి. అదో ఉద్విగ్నమైన ఘట్టం. ఏ కవికీ..ఏ కళాకారుడికీ..ఏ చిత్రకారుడికీ..ఏ శిల్పికీ..ఏ దర్శకుడికీ అందని మనోహరమైన సన్నివేశం. జీవితంలో ఒక్కసారైనా ఒక రోజు కేటాయించండి. స్వామి వారు చేస్తున్న సేవలో పాలుపంచుకోండి. మీ జీవితాలను చరితార్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. !
చల్లని చేతులు మిమ్మల్ని సాదరంగా ఆశ్వీరదిస్తాయి. మంగళాశాసనాలు అందజేస్తాయి. అదో ఉద్విగ్నమైన ఘట్టం. ఏ కవికీ..ఏ కళాకారుడికీ..ఏ చిత్రకారుడికీ..ఏ శిల్పికీ..ఏ దర్శకుడికీ అందని మనోహరమైన సన్నివేశం. జీవితంలో ఒక్కసారైనా ఒక రోజు కేటాయించండి. స్వామి వారు చేస్తున్న సేవలో పాలుపంచుకోండి. మీ జీవితాలను చరితార్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. !
Post a Comment